Jr NTR: అప్పుడు ఒక్కడినేనని బాధపడ్డా- జక్కన్న, కీరవాణి కుటుంబాలను దేవుడిచ్చాడు- కార్తికేయ నా తమ్ముడు: జూనియర్ ఎన్టీఆర్
Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పుకొచ్చారు. డ్రాగన్ అప్డేట్ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగాయి. చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
Jr NTR: మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don’t Trouble The Trouble). ఈ మూవీ ప్రి-రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ వేడుకలో ఎన్టీఆర్ చేసిన ఎమోషనల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
అర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ సంయుక్తంగా నిర్మించిన మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్ వైరల్ గా మారింది.
‘‘నన్ను ఒక్కడినే ఎందుకు కన్నావమ్మా అని మా అమ్మను అడుగుతుంటా. నాకు తమ్ముడు అనేవాడు పుట్టి ఉంటే అది కచ్చితంగా కార్తికేయనే. నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన, కష్టకాలంలో కార్తికేయ నాకు అండగా నిలిచాడు. ఈ విషయం బయట చాలామందికి తెలియదు కానీ తన కారణంగానే 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' లాంటి గ్లోబల్ ప్రాజెక్టులు సాధ్యమయ్యాయి. అతను ఒక ప్రొడ్యూసర్‌గా మారడం నాకు ఎంతో గర్వంగా ఉంది" అని ఎన్టీఆర్ చెప్పారు.
ఫహాద్ నటనకు ఫిదా
ఫహాద్ ఫాజిల్ నటనపై తనకున్న అభిమానాన్ని ఎన్టీఆర్ ఈ వేదికగా పంచుకున్నారు. "నేను మొదటిసారి చూసిన ఫహాద్ సినిమా 'బెంగళూరు డేస్'. భారతీయ చిత్ర పరిశ్రమలో నేను ఆరాధించే కొద్దిమంది నటుల్లో ఫహాద్ సర్ ఒకరు. ఆయన పర్ఫార్మెన్స్ నన్ను ఎన్నోసార్లు ఇన్స్‌పైర్ చేసింది. ఆయన నటిస్తున్న మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అతిపెద్ద విజయం సాధించి ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలవాలి" అని ఎన్టీఆర్ ఆకాంక్షించారు.
దేవుడిచ్చిన కుటుంబాలు
ఇదే క్రమంలో తన తొలి చిత్రం 'నిన్ను చూడాలని' ఓపెనింగ్ రోజున ఎదురైన అనుభవాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. "నా మొదటి సినిమా ప్రారంభోత్సవానికి ఎవరూ రాలేదు. ఏ కుటుంబ సభ్యులూ లేరు. ఆ రోజు ఒంటరిగా చాలా బాధపడ్డాను. కానీ ప్రకృతి నా ఆవేదనను విన్నది. ఆ తర్వాత అభిమానుల రూపంలో దేవుడు నాకు కొండంత ప్రేమాభిమానాలను ఇచ్చాడు. జక్కన్న, కీరవాణి కుటుంబాలను ఇచ్చాడు’’ అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
'డ్రాగన్' అప్‌డేట్ ఇచ్చిన యంగ్ టైగర్
తన తదుపరి ప్రాజెక్టుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎన్టీఆర్ ఈ వేదికగా ఒక కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. "మేము త్వరలోనే 'డ్రాగన్' సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించబోతున్నాం. ఈ ప్రాజెక్ట్‌లో ఎలాంటి ఆలస్యం ఉండదు, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాం" అని హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాను థియేటర్లలో చూసి డెబ్యూ డైరెక్టర్ శశాంక్ ఏలేటితో పాటు ప్రొడ్యూసర్ కార్తికేయను ఆశీర్వదించాలని ఎన్టీఆర్ కోరారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


