Anil Ravipudi Saregamapa: జీ తెలుగు సరిగమప కంటెస్టెంట్లకు బంపరాఫర్-జనవరి 12 విడుదల మూవీలో ఛాన్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi Saregamapa: జీ తెలుగు 'సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్' రియాలిటీ షో సింగర్స్ కు గోల్డెన్ ఛాన్స్. ఈ ఆదివారం ప్రసారం కానున్న స్పెషల్ ఎపిసోడ్ లో ముగ్గురికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన అప్ కమింగ్ మూవీ 'జనవరి 12 విడుదల'లో పాడే గోల్డెన్ ఛాన్స్ ఇవ్వనున్నారు.

Published on: Oct 31, 2026, 19:46:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Anil Ravipudi Saregamapa: జీ తెలుగులో ప్రతి వారం ప్రసారమయ్యే 'సరిగమప' సింగింగ్ రియాలిటీ షోకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో, ఎంతో మంది అద్భుతమైన గాయనీ గాయకులు తమ వాయిస్ తో మ్యాజిక్ చేస్తున్నారు. అయితే ఈ సింగర్స్ కు అనిల్ రావిపూడి గోల్డెన్ ఆఫర్ ఇవ్వనున్నారు.

జీ తెలుగు సరిగమప కంటెస్టెంట్లకు బంపరాఫర్-జనవరి 12 విడుదల మూవీలో ఛాన్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి
జీ తెలుగు సరిగమప కంటెస్టెంట్లకు బంపరాఫర్-జనవరి 12 విడుదల మూవీలో ఛాన్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి ఆఫర్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'జనవరి 12 విడుదల'. ఈ సినిమా ద్వారా ముగ్గురు టాలెంటెడ్ సింగర్స్ ప్లే బ్యాక్ సింగర్స్ గా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. సరిగమప షోలో పాడుతున్న సింగర్స్ కు అనిల్ రావిపూడి ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

సెలబ్రిటీ జ్యూరీ

కొత్త గాయకులను ఎంకరేజ్ చేయడంలో జీ తెలుగు ఎప్పుడూ ముందుంటుంది అనడానికి ఈ ముగ్గురికి అవకాశం ఇవ్వడమే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్, లెజెండరీ సింగర్ ఎస్.పి. శైలజ, డైరెక్టర్ అనిల్ రావిపూడి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

వీరి సమక్షంలో కంటెస్టెంట్లు తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించాల్సి ఉంటుంది. ఒక పక్క కప్ కొట్టాలనే టైటిల్ రేసు, మరోపక్క అనిల్ రావిపూడి సినిమాలో పాడే అవకాశం.. దీంతో స్టేజ్ పై సింగర్స్ మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.

ఆ లక్కీ ఛాన్స్ కొట్టే ముగ్గురు ఎవరు?

సినిమాల్లో నేపథ్య గాయకులుగా అవకాశం దక్కించుకోవడం అనేది వర్ధమాన సింగర్స్ కనే అతిపెద్ద కల. అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్ స్వయంగా స్టేజ్ మీద నుంచి ఆ ఆఫర్ ప్రకటిస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఈ గోల్డెన్ ఆఫర్ కోసం కంటెస్టెంట్లు అందరూ తమ గళాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేస్తూ జ్యూరీని మెప్పించేందుకు సిద్ధమయ్యారు. వాళ్ల భవిష్యత్తును మార్చేసే ఈ అరుదైన అవకాశం ఎవరిని వరిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సస్పెన్స్

అనిల్ రావిపూడి మనసు దోచి ఈ ప్లే బ్యాక్ సింగింగ్ అవకాశం సొంతం చేసుకునే ముగ్గురు కంటెస్టెంట్లు ఎవరు? జ్యూరీ ప్రశంసలు దక్కించుకుని తమ కలను నిజం చేసుకునేది ఎవరు? ఇలాంటి ఎన్నో భావోద్వేగాలు, సంగీత మాధుర్యం కలబోసిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ఎంతో అద్భుతంగా సాగనుంది. ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే.. నవంబర్ 1, ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే 'సరిగమప - ద నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్' ఎపిసోడ్ ను తప్పక చూడాల్సిందే!

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More