Jr NTR Review: నా మనసు దోచుకున్నావ్.. ప్రతి సీన్ కదిలించింది.. మస్ట్ వాచ్ మూవీ: తారక్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ
Jr NTR Review: మలయాళం స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ రివ్యూ ఇచ్చారు. ఈ మూవీ ఓ మస్ట్ వాచ్ అని ఆయన అన్నారు. ఫహాద్ నటనతోపాటు చిన్నారి సారా నటనను కూడా మెచ్చుకున్నారు.
Jr NTR Review: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble The Trouble) సినిమా చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూసిన తర్వాత తారక్ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో సుదీర్ఘమైన రివ్యూ పోస్ట్ చేశారు.

తారక్ ఎమోషనల్ రివ్యూ.. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా ప్రతీ చిన్నారికి, ప్రతీ తండ్రికి, తనలో ఇంకా ఆ బాల్యాన్ని దాచుకున్న ప్రతీ ఒక్కరికీ సొంతం అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత కుటుంబ సమేతంగా కూర్చుని ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ సినిమా వచ్చిందని తారక్ ఆనందం వ్యక్తం చేశారు.
"సినిమా చూస్తున్నంతసేపు ఒక ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్‌లో ఉన్నట్లు అనిపించింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు నన్ను బాగా కదిలించాయి. ఆ ఫీలింగ్ నుంచి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నాను" అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
'సూరి'గా ఫహాద్ రచ్చ.. డెబ్యూ డైరెక్టర్‌పై తారక్ ప్రశంసలు
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాలో 'సూరి' పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ తనను విపరీతంగా ఆకట్టుకుందని తారక్ కొనియాడారు. "ఫహాద్ సర్.. సూరిగా మీ నటన అద్భుతం. ప్రతీ ఫ్రేమ్‌కి మీరు ప్రాణం పోసే తీరు నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసింది" అని ప్రశంసించారు.
అలాగే డెబ్యూ డైరెక్టర్ శశాంక్ ఏలేటి వర్కింగ్ స్టైల్‌ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మొదటి సినిమాతోనే పిల్లలు, కుటుంబాలకు కనెక్ట్ అయ్యేంత స్వచ్ఛమైన భావోద్వేగాలను చాలా స్పష్టతతో తెరకెక్కించారని, శశాంక్‌కి భవిష్యత్తులో పెద్ద సక్సెస్ దక్కుతుందని విష్ చేశారు.
ఇక చైల్డ్ ఆర్టిస్ట్ సారా పాలేకర్ నటన తన గుండెను హత్తుకుందని చెప్పారు. "చిన్నారి సారా.. నువ్వు నా మనసు దోచుకున్నావ్. చాలా సహజంగా, ఎంతో అమాయకత్వంతో ప్రతి ఎమోషన్‌ను పండించావ్" అని తారక్ కాంప్లిమెంట్ ఇచ్చారు.
కాలభైరవ బీజీఎం మ్యాజిక్.. కార్తికేయకు ఎన్టీఆర్ స్పెషల్ మెసేజ్
సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణమని ఎన్టీఆర్ కొనియాడారు. బీజీఎం సినిమాలోని ఎమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిందని చెప్పారు.
తన సొంత తమ్ముడిలా భావించే ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయను ఉద్దేశించి మాట్లాడిన తారక్.. "నానా కార్తికేయ.. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అక్టోబర్ 2న థియేటర్లలో ప్రపంచం ఈ మ్యాజిక్ చూడబోతోంది" అని ముగించారు.
మహేష్ బాబు తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాను బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అని ప్రశంసించడంతో, అక్టోబర్ 2న రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే మహేష్ కూడా ఈ మూవీ రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫహాద్ సార్ మీ నటన అద్భుతం అంటూ సూపర్ స్టార్ కూడా కొనియాడారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


