Jr NTR Varanasi: వారణాసి మూవీ పేరు వినగానే తల పట్టుకున్న తారక్.. వెనుక రాజమౌళి భార్య రియాక్షన్ చూశారా?

Jr NTR Varanasi: రాజమౌళి వారణాసి మూవీ పేరు వినగానే జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా గురించి ఇప్పుడెందుకు.. అప్పుడే మాట్లాడుకోవచ్చు అని స్టేజ్ కింది నుంచి తారక్ చేసిన సైగల వీడియో అభిమానులను అలరిస్తోంది.

Published on: Sep 30, 2026, 16:43:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Jr NTR Varanasi: హైదరాబాద్‌లో జరిగిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రమోషనల్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేసిన అల్లరి సైగలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్ పై ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ, యాంకర్ సుమ 'వారణాసి' (Varanasi) సినిమా ముచ్చట తీయగానే, ఫ్రంట్ రోలో కూర్చున్న తారక్ పిచ్చిపిచ్చి సైగలు చేస్తూ తల పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫన్నీ మూమెంట్‌కు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన సతిమణి రమా రాజమౌళి పొట్టచెక్కలయ్యేలా నవ్వేశారు.

Jr NTR Varanasi: వారణాసి మూవీ పేరు వినగానే తల పట్టుకున్న తారక్.. వెనుక రాజమౌళి భార్య రియాక్షన్ చూశారా?
Jr NTR Varanasi: వారణాసి మూవీ పేరు వినగానే తల పట్టుకున్న తారక్.. వెనుక రాజమౌళి భార్య రియాక్షన్ చూశారా?

స్టేజ్ పై అసలు ఏం జరిగింది? తారక్ సైగలకు కారణమేంటి?

ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణంలో ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈవెంట్ నడుస్తుండగా సీనియర్ ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ, యాంకర్ సుమ స్టేజ్ పైకి వచ్చి మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్-వరల్డ్ మూవీ 'వారణాసి' గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అది చూసిన ఎన్టీఆర్ వెంటనే ఫ్రంట్ రో నుంచి రెండు చేతులూ ఊపుతూ, "ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు బాబాయ్" అన్నట్లు గాల్లో సైగలు చేశారు.

రమా రాజమౌళి కూడా 'వద్దొద్దు' అని చేత్తో సిగ్నల్ ఇవ్వగా, తారక్ తన నుదుటిపై కొట్టుకుంటూ చేతులు జోడించి దండం పెట్టేశారు. ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెషన్స్ చూసిన సుమ వెంటనే "వారణాసి ప్రమోషన్స్ టైమ్‌లోనే ఆ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడదామని తారక్ చెప్తున్నారు" అని గ్రహించి మైక్‌లో స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో న్యూ మీమ్.. ఎన్టీఆర్ కార్తికేయ బాండింగ్

ఎన్టీఆర్ చేసిన ఈ సైగలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ "జస్ట్ తారక్ అన్న థింగ్స్", "న్యూ మీమ్ అన్‌లాక్డ్" అంటూ సరదా కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.

ఈవెంట్‌లో తారక్ మాట్లాడుతూ ప్రొడ్యూసర్ కార్తికేయతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 'స్టూడెంట్ నంబర్ 1' సినిమా టైమ్‌లో కార్తికేయ 9 ఏళ్ల పిల్లాడని, తన సొంత తమ్ముడిలాంటి వాడని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

అలాగే మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ యాక్టింగ్‌ను ఎన్టీఆర్ విపరీతంగా పొగిడారు. 'బెంగళూరు డేస్' సినిమా నుంచి ఫహద్‌కి తాను బిగ్ ఫ్యాన్ అయ్యానని, ఆయనొక ఇన్స్‌పిరేషన్ అని కొనియాడారు.

'వారణాసి', 'డ్రాగన్' సినిమాల అఫీషియల్ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్

ఈ సరదా సన్నివేశం తర్వాత ఎన్టీఆర్ సరదాగా రాజమౌళిని ఆట పట్టిస్తూ.. "నేను నా డ్రాగన్ మూవీ అప్‌డేట్ ఇచ్చేలోపు, ఈయనగారు వారణాసి అప్‌డేట్ ఇస్తే బాగుంటుంది. అసలు ఏప్రిల్‌లో సినిమా వస్తుందో రాదో!" అని చమత్కరించారు.

దీనికి జక్కన్న బిగ్గరగా నవ్వుతూ సినిమా చెప్పిన సమయానికే వస్తుందని హింట్ ఇచ్చారు. ఆ తర్వాత వేదికపై ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాల విడుదల తేదీలపై క్లారిటీ ఇచ్చారు.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్న మహేష్ బాబు 'వారణాసి' చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (NTR31) మూవీ 2026 జూన్ 11న థియేటర్లలోకి రాబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More