June OTT Release Movies: ఓటీటీలోకి జూన్ నెలలో రాబోతున్న 9 బ్లాక్‌బస్టర్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

June OTT Release Movies: జూన్ నెలలో ఓటీటీ ప్రేక్షకులకు అసలైన వినోదం అందబోతోంది. రణవీర్ సింగ్ ధురంధర్, మోహన్ లాల్-మమ్ముట్టిల పేట్రియాట్, అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా సహా నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 వేదికల్లో రిలీజ్ కానున్న చిత్రాల పూర్తి వివరాలు.

Published on: May 28, 2026, 19:47:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

June OTT Release Movies: జూన్ నెలప్రారంభం కాబోతున్న వేళ ఓటీటీ ప్రియులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. వచ్చే నెలలో ప్రాంతీయ భాషలతో పాటు బాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాయి.

June OTT Release Movies: ఓటీటీలోకి జూన్ నెలలో రాబోతున్న 9 బ్లాక్‌బస్టర్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..
June OTT Release Movies: ఓటీటీలోకి జూన్ నెలలో రాబోతున్న 9 బ్లాక్‌బస్టర్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే..

మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రి నటించిన 'మా బెహన్' నుంచి రణవీర్ సింగ్ కెరీర్ లోనే భారీ వసూళ్లు సాధించిన 'ధురంధర్ ది రివెంజ్', మాలీవుడ్ సూపర్ స్టార్లు మోహన్ లాల్-మమ్ముట్టి కాంబినేషన్ లో వస్తున్న 'పేట్రియాట్' వరకు ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్‌లు ఇంట్లోనే కూర్చుని చూసేందుకు అందుబాటులోకి వస్తున్నాయి.

ధురంధర్ ది రివెంజ్ - జియోహాట్‌స్టార్

ధురంధర్ 2 మూవీ జూన్ 4 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అండర్ కవర్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ జస్కారత్ సింగ్ రంగీ అలియాస్ హంజా కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కరాచీ నేర సామ్రాజ్యంతో పాటు రెహమాన్ దకైత్ మరణం తర్వాత పాకిస్తాన్ రాజకీయాల్లోకి అతడు ఎలా చొచ్చుకుపోయాడనేది ఇక్కడి కథాంశం. 26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఎదురైన భారీ ముప్పులను అతడు ఎలా ఎదుర్కొన్నాడనేది ఆసక్తికరంగా చూపించారు.

మా బెహన్ - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ లోకి జూన్ 4న నేరుగా వస్తున్న కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక చిన్న టౌన్ లో ఉండే తల్లి, కూతుళ్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అసలు తాము ఎలాంటి హత్య చేయనప్పటికీ, వారి వంటగదిలో ఒక శవం ప్రత్యక్షమవుతుంది. ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి ఆ కుటుంబం పడిన ఆరాటం, చేసిన ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి.

మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ - ప్రైమ్ వీడియో

ఇదో వెబ్ సిరీస్. జూన్ 3 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆర్థిక సరళీకరణకు ముందు భారతదేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టైటాన్ కంపెనీ ప్రస్థానాన్ని ఇందులో చూపించారు. భారత్‌లో మొట్టమొదటి స్టార్టప్ విజయగాథగా దీన్ని అభివర్ణించవచ్చు.

టాటా ప్రెస్ పునరుద్ధరణ బాధ్యతలు చేపట్టిన జెర్సెస్ దేశాయ్, ఆ నష్టాల్లో ఉన్న సంస్థను వాచీల తయారీ వైపు ఎలా మళ్లించాడనేది ఇక్కడి ప్రధాన కథ. ప్రభుత్వ నిబంధనలు, మార్కెట్ సవాళ్లను అధిగమించి సొనాట, టైటాన్ ఎడ్జ్ లాంటి బ్రాండ్‌లను ఆయన సృష్టించారు.

గుల్లక్ సీజన్ 5 - సోనీ లివ్

టీవీఎఫ్ నుంచి వస్తున్న అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్ ఐదో సీజన్ ఇది. మిశ్రా కుటుంబంలో జరిగే కొత్త అల్లర్లు, ఆఫీస్ ఇబ్బందులు, పిల్లల పెంపకంలో ఎదురయ్యే సవాళ్లను తమదైన హాస్య చతురతతో, ఎమోషనల్ గా ఈ సీజన్ లో ఆవిష్కరించారు. జూన్ 5 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

బ్రౌన్ - జీ5 ఓటీటీ

కోల్‌కతా నగర నేపథ్యంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక అవమానానికి గురైన మహిళా పోలీస్ అధికారి, తన జూనియర్ తో కలిసి మహిళలను టార్గెట్ చేసే ఒక సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి వేట ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఆమె తన పాత జ్ఞాపకాలతో, అంతర్గత సంఘర్షణలతో పోరాడాల్సి వస్తుంది. జీ5 ఓటీటీలో జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 - జియోహాట్‌స్టార్

జియోహాట్‌స్టార్ ఓటీటీలో జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్. ప్రేమలో మోసం, అధికారం, రాజకీయాల చుట్టూ ఈ కొత్త సీజన్ సాగుతుంది. కుల్దీప్ మానసిక ఘర్షణలతో పాటు శాన్విక శక్తివంతమైన కోణాన్ని ఇందులో చూపించారు. ప్రతీకార నేపథ్యంలో ఆధునిక బంధాల మధ్య ఉన్న సంక్లిష్టతలను ఈ కథ వివరిస్తుంది.

పేట్రియాట్ - జీ5 ఓటీటీ

మలయాళం నుంచి వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ అయిన పేట్రియాట్ జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. రాజకీయ ప్రయోజనాల కోసం, సాధారణ పౌరుల నిఘా కోసం కొందరు అవినీతి రాజకీయ నాయకులు, టెక్ వ్యాపారవేత్తలు 'పెరిస్కోప్' అనే ప్రభుత్వ నిఘా వ్యవస్థను రహస్యంగా ఎలా దుర్వినియోగం చేస్తున్నారనేది ఒక రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ గుర్తిస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ సినిమా.

భూత్ బంగ్లా - నెట్‌ఫ్లిక్స్

బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా జూన్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. లండన్ నుంచి తిరిగి వచ్చిన అర్జున్ ఆచార్య తన వారసత్వంగా వచ్చిన పాత కోటలో సోదరి వివాహం జరిపించాలని మంగళపూర్ అనే గ్రామానికి వస్తాడు. అక్కడ దయ్యాల భయంతో వణికిపోయే స్థానికులు, వింత సంఘటనల మధ్య అతడు చిక్కుకుంటాడు. ఆ కోట వెనుక ఉన్న శతాబ్దాల నాటి రహస్యాన్ని అతడు ఎలా ఛేదించాడనేది హాస్యభరితంగా చూపించారు.

రాజా శివాజీ - నెట్‌ఫ్లిక్స్

అత్యధిక వసూళ్లు సాధించిన మరాఠీ మూవీ రాజా శివాజీ జూన్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా నటించిన మూవీ ఇది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఎన్నో శక్తులను ఎదిరించి, స్వరాజ్య స్థాపనకు ఆయన ఎలా పునాది వేశారనే మహోన్నత ఘట్టాలను ఈ సినిమాలో వీక్షించవచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More