Chandrababu Naidu Birthday : ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ నాయకులు, ప్రముఖులు, అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆత్మీయంగా పోస్ట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు…

"గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మావయ్య గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని ఎన్టీఆర్ తన సందేశాన్ని ప్రారంభించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. “ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని పొందాలని కోరుకుంటున్నాను. మీ నాయకత్వం రాష్ట్రానికి పురోగతిని, శ్రేయస్సును, గర్వాన్ని అందిస్తూ కొనసాగాలని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
ఇక సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. “ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉందంటారు. చంద్రబాబుగారు పుట్టింది తెలుగు ప్రజల కోసం. పుట్టిన రోజు వేడుకలలో ఆనందం కన్నా ప్రజల సేవలోనే ఆయనకు ఎక్కువ ఆనందం. అంత ఇష్టమైన ప్రజల కోసం నిండు నూరేళ్లూ పూర్తి ఉత్సాహంతో, సంపూర్ణ శక్తితో, ఆరోగ్యంతో చంద్రబాబుగారు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని శుభాకాంక్షలు తెలిపారు.
{{/usCountry}}ఇక సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. “ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉందంటారు. చంద్రబాబుగారు పుట్టింది తెలుగు ప్రజల కోసం. పుట్టిన రోజు వేడుకలలో ఆనందం కన్నా ప్రజల సేవలోనే ఆయనకు ఎక్కువ ఆనందం. అంత ఇష్టమైన ప్రజల కోసం నిండు నూరేళ్లూ పూర్తి ఉత్సాహంతో, సంపూర్ణ శక్తితో, ఆరోగ్యంతో చంద్రబాబుగారు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని శుభాకాంక్షలు తెలిపారు.
{{/usCountry}}మరోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి” అని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణులు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను పండుగలా నిర్వహిస్తున్నాయి. పలుచోట్ల సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనూ ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించనున్నారు.