హాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మరో మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ సినిమా జులై 2న థియేటర్లలో రిలీజ్ కాగా.. మొత్తానికి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులోకి రాగా.. ఇప్పుడు ఫ్రీగా మరో ఓటీటీలోకి వస్తోంది.
జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఓటీటీ రిలీజ్ డేట్

జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఏడో సినిమా, జురాసిక్ వరల్డ్ నుంచి వచ్చిన నాలుగో మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.7600 కోట్లు వసూలు చేసింది. అలాంటి మూవీ ఇప్పుడు నవంబర్ 14 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మంగళవారం (అక్టోబర్ 28) ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.
ఈ సినిమాను ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చూడొచ్చు. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్ మై షో స్ట్రీమ్ లలో రెంట్ విధానంలో అందుబాటులో ఉన్నా.. ఇప్పుడు జియోహాట్‌స్టార్ లోకి ఫ్రీగా వస్తోంది. అంటే సబ్‌స్క్రైబర్లందరూ నాలుగు భాషల్లో ఈ సినిమా చూడొచ్చు.
జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ గురించి..
జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీని గారెత్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో స్కార్లెట్ జాన్సన్, మహర్షల అలీ, జొనాథన్ బెయిలీ, రూపర్ట్ ఫ్రెండ్, మాన్యుయెల్ గార్సియాలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా జులై 2న థియేటర్లలో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 86 కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.7600 కోట్లు వసూలు చేసింది.
మూడు దశాబ్దాలకుపైగా ప్రేక్షకులను అలరిస్తున్న జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఏడో సినిమా ఇది. దీనికి ఐఎండీబీలో 5.9 రేటింగ్ నమోదైంది. 1993లో తొలిసారి జురాసిక్ పార్క్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆరు మూవీస్ ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చాయి. అయితే తొలి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే తర్వాతి సినిమాలకు ఆ స్థాయి రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి.
{{/usCountry}}మూడు దశాబ్దాలకుపైగా ప్రేక్షకులను అలరిస్తున్న జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఏడో సినిమా ఇది. దీనికి ఐఎండీబీలో 5.9 రేటింగ్ నమోదైంది. 1993లో తొలిసారి జురాసిక్ పార్క్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆరు మూవీస్ ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చాయి. అయితే తొలి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే తర్వాతి సినిమాలకు ఆ స్థాయి రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి.
{{/usCountry}}