...
...
Next Story

ఇవాళ ఓటీటీలోకి 7700 కోట్ల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. క్షణక్షణం ఉత్కంఠ.. ఇక్కడ చూసేయండి

ప్రపంచవ్యాప్తంగా రూ.7700 కోట్లకు పైగా కలెక్ట్ చేసి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో నాలుగో ప్లేస్ లో నిలిచిన మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Nov 14, 2025, 12:35:53 IST
Advertisement

జురాసిక్ వరల్డ్, జురాసిక్ పార్క్ సినిమాలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ వేరు. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన సినిమాలన్నీ వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ కూడా అదరగొట్టింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

జురాసిక్ వరల్డ్: రీబర్త్ ఓటీటీ

ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ (Universal Pictures and Amblin Entertainment via AP)
ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ (Universal Pictures and Amblin Entertainment via AP)

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఆడియన్స్ కు థ్రిల్ పంచిన జురాసిక్ వరల్డ్: రీబర్త్ మూవీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేసేందుకు వచ్చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ శుక్రవారం (నవంబర్ 14) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌లో అడుగుపెట్టింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ.

తెలుగులోనూ

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జురాసిక్ వరల్డ్: రీబర్త్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ ఇంగ్లీష్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ థ్రిల్లర్ ను చూడొచ్చు. జురాసిక్ పార్క్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కు ఈ మూవీ నిజంగా ఓ ట్రీట్ లాంటిదే. గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 'జురాసిక్ పార్క్' సిరీస్‌లో ఏడవ భాగం, 'జురాసిక్ వరల్డ్' ఫ్రాంచైజీలో నాలుగో భాగం.

బాక్సాఫీస్ షేక్

జురాసిక్ వరల్డ్: రీబర్త్ లో స్కార్లెట్ జోహాన్సన్, జొనాథన్ బెయిలీతో పాటు మహర్షాల అలీ, రూపెర్ట్ ఫ్రెండ్, ఎడ్ స్క్రీన్, లూనా బ్లేస్, డేవిడ్ ఇయాకోనో తదితరులు నటించారు. ఈ మూవీ 2025 జూలై 2న అమెరికా, కెనడాలో థియేటర్లలో విడుదలైంది. జూలై 4, 2025న భారతీయ సినిమా హాళ్లలో విడుదలైంది. ఈ చిత్రం అభిమానుల నుండి సానుకూల స్పందన పొందింది. బాక్సాఫీస్ వద్ద బాగా రాణించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.7707 కోట్లు ఖాతాలో వేసుకుంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచింది.

డీఎన్ఏ కోసం

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks