...
...
Next Story

Kajal Aggarwal Dating: 14 ఏళ్ల ప్రేమ.. అయినా బ్రేకప్ చెప్పుకున్నాం..కానీ విధి మా ఇద్దరినీ మళ్లీ కలిపింది: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Dating: కాజల్ అగర్వాల్ తన వ్యక్తిగత జీవితం, లవ్ స్టోరీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. భర్త గౌతమ్ కిచ్లుతో తన ప్రయాణం ఏ సినిమా కథకూ తీసిపోదని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. మనస్పర్థల వల్ల విడిపోయి వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ కూడా చేశామని కాజల్ ఓపెన్‌గా చెప్పారు.

Published on: Nov 14, 2026, 12:46:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Kajal Aggarwal Dating: సెలబ్రిటీల ప్రేమకథలు ఎప్పుడూ నేరుగా, సాఫీగా సాగవు. స్నేహంతో మొదలై, విడిపోయి, మళ్లీ కలుసుకునే ఎన్నో మలుపులు వాటిలో ఉంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్, తన భర్త గౌతమ్ కిచ్లుతో తన ప్రేమ ప్రయాణం గురించి ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నారు.

కాజల్ లవ్ స్టోరీ ఇలా..

Kajal Aggarwal Dating: 14 ఏళ్ల ప్రేమ.. అయినా బ్రేకప్ చెప్పుకున్నాం..కానీ విధి మా ఇద్దరినీ మళ్లీ కలిపింది: కాజల్ అగర్వాల్
Kajal Aggarwal Dating: 14 ఏళ్ల ప్రేమ.. అయినా బ్రేకప్ చెప్పుకున్నాం..కానీ విధి మా ఇద్దరినీ మళ్లీ కలిపింది: కాజల్ అగర్వాల్

"దాదాపు 13 లేదా 14 ఏళ్ల క్రితమే మేమిద్దరం ప్రేమలో ఉన్నాం. కానీ అప్పట్లో మా మధ్య పరిస్థితులు అనుకూలించలేదు. దాంతో మేము విడిపోయాం. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకుని, వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ కూడా చేశాం" అని కాజల్ నిజాయితీగా చెప్పుకొచ్చారు.

అయితే విధి వారి కోసం వేరే ప్రణాళిక సిద్ధం చేసింది. వేరే వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ, తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఏమిటో వారికి అర్థమైంది. “బహుశా ఒకరి విలువ ఒకరికి తెలియడానికే మేము వేరే వాళ్లతో డేటింగ్ చేశామేమో! చివరకు మా దారులు మళ్లీ ఒక్కటయ్యాయి” అంటూ కాజల్ నవ్వుతూ వివరించారు.

‘పెళ్లి చేసుకుందామా? లేక గుడ్‌బై చెబుదామా?’: కాజల్ పెట్టిన కండీషన్

రెండోసారి మళ్లీ దగ్గరైన తర్వాత, ఈసారి తన బంధం విషయంలో ఎలాంటి అస్పష్టత ఉండకూడదని కాజల్ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో గౌతమ్‌కు తాను నేరుగా ఒక అల్టిమేటం ఇచ్చానని ఆమె గుర్తుచేసుకున్నారు.

“నేను గౌతమ్‌తో ఒకటే మాట చెప్పాను.. 'ఓకే బాస్, ఈసారి మనం కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేదంటే శాశ్వతంగా గుడ్‌బై చెప్పుకోవాలి' అని తేల్చి చెప్పాను” అని కాజల్ వెల్లడించారు.

వివాహం తర్వాత ఈ జంట జీవితం మరింత ఆనందమయంగా మారింది. 2022 ఏప్రిల్‌లో వీరికి పండంటి మగబిడ్డ జన్మించగా, అతడికి 'నీల్' (Neil) అని పేరు పెట్టారు. ఒకవైపు తల్లిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే, మరోవైపు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో వరుస అవకాశాలతో కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

నిజమైన ప్రేమ ఎక్కడికి వెళ్లినా తిరిగి తన గమ్యాన్ని చేరుకుంటుందనే మాటను కాజల్ అగర్వాల్ – గౌతమ్ కిచ్లు జంట మరోసారి నిజం చేసి చూపించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks