Kajal Aggarwal: రాముడు మన రక్తంలోనే ఉన్నాడు: రామాయణం మండోదరి నటి కాజల్ అగర్వాల్
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రామాయణం మూవీలో మండోదరి పాత్రలో నటిస్తున్న ఆమె.. రాముడు మన రక్తంలోనే ఉన్నాడంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Kajal Aggarwal: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో క్రియేట్ చేస్తున్న విజువల్ వండర్ 'రామాయణం' (Ramayana) సినిమాలో లంకేశ్వరుడి భార్య మండోదరి పాత్రలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మైండ్ బ్లోయింగ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌పై తాజాగా స్పందించిన కాజల్.. "రాముడు మన రక్తంలోనే ఉన్నాడు, మన ప్రతి శ్వాసలోనూ ఉన్నాడు" అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

"భారతీయ కథలను ప్రపంచానికి చాటే సరైన సమయం"
భారతీయ సంస్కృతిని, మన పురాణాలను ప్రపంచ వేదికపై గ్లోబల్ ఆడియన్స్‌కు చూపించడానికి ఇది సరైన టైమ్ అని కాజల్ అగర్వాల్ వెల్లడించింది. చిన్నతనం నుంచి మనం విని పెరిగిన శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి కథలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి రామాయణాన్ని మించిన గొప్ప స్టోరీ మరొకటి లేదని స్పష్టం చేసింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్‌హీరో శ్రీరాముడని, ఆయన కథను ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడం నిజంగా గర్వకారణమని కాజల్ కొనియాడింది. మర్యాద పురుషోత్తముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) నటన నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని ప్రశంసల వర్షం కురిపించింది.
కంబ్యాక్ తర్వాత క్రేజీ ఆఫర్లు.. కాజల్ ఆనందం
పెళ్లి, కొడుకు పుట్టిన తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కాజల్ అగర్వాల్, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా మారిపోయింది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో మండోదరి వంటి కీలకమైన పాత్ర లభించడంపై కాజల్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తనకు ఇప్పటికీ మంచి రోల్స్ వస్తున్నాయని, ఇండియన్ సినిమాలోని బిగ్గెస్ట్ స్టార్లతో కలిసి నటించడం తన కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
రెండు భాగాలుగా 4000 కోట్ల విజువల్ వండర్
'దంగల్' ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.
తొలి భాగంలో శ్రీరాముడి జననం, గురుకుల విద్య, సీతా స్వయంవరం, వనవాసం నుంచి సీతాపహరణం వరకు కథను కవర్ చేయనున్నారు. ఈ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
ఇక రెండో భాగంలో సుగ్రీవుడితో మైత్రి, లంకేశ్వరుడిపై యుద్ధం, రావణ సంహారాన్ని హాలీవుడ్ లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్‌తో చూపిస్తూ 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఇంగ్లిష్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హిందీతోపాటు ఇంగ్లిష్ లోనూ ఒకేసారి షూట్ చేస్తున్నారు. మిగిలిన భాషల్లోకి సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. 4 నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


