బంగ్లాదేశ్ లోని మైమెన్‌సింగ్‌లో రీసెంట్ గా దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని మూకదాడిలో దారుణంగా చంపేసిన ఘటన ఇప్పుడు మన దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ అమానుషమైన చర్యపై స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కాజల్ అగర్వాల్ పోస్ట్ వైరల్

బంగ్లాదేశ్ లో మూకదాడిపై ఇండియాలో సెలబ్రిటీలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఈ మధ్యే జాన్వీ కపూర్ దీనిపై మాట్లాడగా.. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఓ పోస్ట్ చేసింది. "హిందువులారా మేల్కోండి" అంటూ కాజల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సీరియస్ మెసేజ్ పోస్ట్ చేసింది.
మంటల్లో కాలుతున్న ఒక వ్యక్తి బొమ్మతో ఉన్న పోస్టర్ ని షేర్ చేస్తూ.. "హిందువులారా మేల్కోండి! మీ మౌనం మిమ్మల్ని కాపాడదు" అని ఘాటుగా రాసుకొచ్చింది. బంగ్లాదేశ్ లోని హిందువుల రక్షణ కోసం అందరూ గొంతు ఎత్తాలని పిలుపునిచ్చింది.
జాన్వీ కపూర్ రియాక్షన్ ఇలా..
ఇంతకు ముందే జాన్వీ కపూర్ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఘటనపై స్పందించింది. ఈ ఘటనను పూర్తి అనాగరికంగా అభివర్ణించింది. ఇది ఊచకోత అని మండిపడింది. మనవాళ్ళు చేసే తప్పును ఎత్తిచూపింది.
"ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలకు మనం కన్నీళ్లు పెట్టుకుంటాం. కానీ మన పక్కనే మన సోదర సమానులను చంపుతుంటే పట్టించుకోం. ఇలాంటి హిపోక్రసీ (కపట వేషం) మనల్ని నాశనం చేస్తుంది" అని గట్టిగా క్లాస్ పీకింది. ఈ వీడియోలు చూశాక కూడా రక్తం మరిగిపోకపోతే అది మన తప్పు అని సీరియస్ అయ్యింది.
అసలేం జరిగిందంటే?
బంగ్లాదేశ్ లో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడిని కొంతమంది మూకలు పబ్లిక్ గా చంపేశారు. ఈ ఘటన తర్వాత ఇండియాలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. వీహెచ్పీ, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. దీనివల్ల రెండు దేశాల మధ్య దౌత్యపరంగా కూడా హీట్ పెరిగింది. వీసా సర్వీసులను కూడా తాత్కాలికంగా ఆపేశారు. అయతే మన హీరోయిన్లు కూడా ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మీద గట్టిగా గొంతు విప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
{{/usCountry}}బంగ్లాదేశ్ లో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికుడిని కొంతమంది మూకలు పబ్లిక్ గా చంపేశారు. ఈ ఘటన తర్వాత ఇండియాలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. వీహెచ్పీ, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. దీనివల్ల రెండు దేశాల మధ్య దౌత్యపరంగా కూడా హీట్ పెరిగింది. వీసా సర్వీసులను కూడా తాత్కాలికంగా ఆపేశారు. అయతే మన హీరోయిన్లు కూడా ఇలాంటి సీరియస్ ఇష్యూస్ మీద గట్టిగా గొంతు విప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
{{/usCountry}}