Kajal Aggarwal: టాలీవుడ్ లో తనదైన అందం, అభినయంతో ‘చందమామ’గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తాజాగా ‘ది ఇండియా స్టోరీ’ మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది ఈ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ ఓ షాకింగ్ సంఘటన గురించి చెప్పుకొచ్చంది.
కాజల్ అగర్వాల్ కు భయం

ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తన కారవాన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని కాజల్ అగర్వాల్ వెల్లడించింది. "ఏలాంటి పర్మిషన్ లేకుండా ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి హఠాత్తుగా నా కారవాన్‌లోకి వచ్చాడు. లోపలికి రాగానే అతడు తన షర్ట్ తీసేశాడు’’ అని కాజల్ అగర్వాల్ తెలిపింది.
కాళ్లు, చేతులు వణికాయి
‘‘ఆ వ్యక్తి తన ఛాతీపై వేయించుకున్న నా పేరు టాటూను చూపించాడు. ఆ క్షణంలో తీవ్ర భయాందోళనకు గురయ్యా. నా కాళ్లు చేతులు వణికిపోయాయి" అని కాజల్ ఆ భయణాక క్షణాలను గుర్తుచేసుకుంది.
వార్నింగ్ ఇచ్చి
"నటిగా నాపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నా పేరు పచ్చబొట్టు పొడిపించుకోవడం ఆనందమే కావచ్చు, కానీ ఒక మహిళ ఒంటరిగా ఉన్న ప్రైవేట్ స్పేస్‌లోకి అనుమతి లేకుండా రావడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
అందుకే ఆ వ్యక్తికి పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పా. కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చి పంపించా’’ అని కాజల్ అగర్వాల్ పేర్కొంది.
వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చ
ఈ ఘటన కేవలం ఒక అభిమాని లేదా సాంకేతిక నిపుణుడి అతి ప్రవర్తన మాత్రమే కాదు. చిత్ర పరిశ్రమలో నటీనటులకు, ముఖ్యంగా మహిళా ఆర్టిస్టులకు కారవాన్ల వద్ద ఉండే భద్రతా ప్రమాణాల తీవ్రతను మరోసారి తెరపైకి తెచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
{{/usCountry}}ఈ ఘటన కేవలం ఒక అభిమాని లేదా సాంకేతిక నిపుణుడి అతి ప్రవర్తన మాత్రమే కాదు. చిత్ర పరిశ్రమలో నటీనటులకు, ముఖ్యంగా మహిళా ఆర్టిస్టులకు కారవాన్ల వద్ద ఉండే భద్రతా ప్రమాణాల తీవ్రతను మరోసారి తెరపైకి తెచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
{{/usCountry}}సాధారణంగా కారవాన్‌ను నటీనటులు తమ వ్యక్తిగత అడ్డాగా భావిస్తారు. అక్కడ కూడా ఇలా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్లడం, భయపెట్టడం లాంటివి జరగడం భద్రతా సిబ్బంది వైఫల్యాన్నే ఎత్తిచూపుతోంది.
బాలయ్య మూవీలో
ప్రస్తుతం బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్‌బీకే111 (వర్కింగ్ టైటిల్) చిత్రంలో కాజల్ నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ 'రామాయణ'లో మండోదరి పాత్ర పోషిస్తోంది.
కాజల్ రీసెంట్ ఫిల్మ్ ది ఇండియా స్టోరీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో కాజల్ యాక్టింగ్ కు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా వర్కింగ్ స్పేస్‌లో వ్యక్తిగత హద్దులు, ప్రైవసీని ప్రతీ ఒక్కరూ కాపాడాలని కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.