Kajal The India Story: మనం ప్రతిరోజూ తినే ఆహారం ఎంత వరకు సురక్షితం? పంటపొలాల నుంచి మన ప్లేట్లలోకి ఎలాంటి విషం వచ్చి చేరుతోంది? కార్పొరేట్ కంపెనీల నిర్లక్ష్యం సామాన్యుల జీవితాలను ఎలా బలి తీసుకుంటోంది? సరిగ్గా ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన, సమాజంలో ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని ఒక విపత్తు చుట్టూ తెరకెక్కిన సినిమానే 'ది ఇండియా స్టోరీ'.

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎమ్ఐజీ ప్రొడక్షన్స్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ సినిమాకు 'స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' (Slow Poison in Progress) అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ పెట్టారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే నటించారు.
జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల
సుదీర్ఘ కాలంగా షూటింగ్ జరుపుకుంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన ‘ది ఇండియా స్టోరీ’ మూవీ జులై 24, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. "నిజం కోసం ఒక పోరాటం.. ప్రతి కుటుంబం కోసం ఒక యుద్ధం" అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మనల్ని సాకుతున్న భూమే.. మనల్ని మింగేస్తే?
ఈ సినిమా కేవలం ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబానికి సంబంధించిన కథ కాదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఒక పెద్ద నెట్‌వర్క్ గురించిన విస్మయం కలిగించే నిజం. వ్యవసాయ రంగంలో రసాయనాలు, నాణ్యత లేని పురుగు మందుల వాడకం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఎలా వ్యాపిస్తున్నాయి, దీని వెనుక కార్పొరేట్ కంపెనీల స్కాములు ఎలా సాగుతున్నాయి అనే తీవ్రమైన అంశాలను డైరెక్టర్ చేతన్ డికె చాలా రా అండ్ రస్టిక్‌గా చూపించబోతున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో సినిమా సీన్లు కాకుండా, దేశంలో జరుగుతున్న ఆహార కల్తీ, పురుగుమందుల దాడుల గురించిన రియల్ న్యూస్ ఫుటేజ్, డేటా కార్డ్‌లను ఉపయోగించి ఆడియన్స్‌లో ఒక తెలియని భయాన్ని, ఆలోచనను రేకెత్తించారు.
సరికొత్త కాంబినేషన్లో ఎమోషనల్ డ్రామా
{{/usCountry}}ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో సినిమా సీన్లు కాకుండా, దేశంలో జరుగుతున్న ఆహార కల్తీ, పురుగుమందుల దాడుల గురించిన రియల్ న్యూస్ ఫుటేజ్, డేటా కార్డ్‌లను ఉపయోగించి ఆడియన్స్‌లో ఒక తెలియని భయాన్ని, ఆలోచనను రేకెత్తించారు.
సరికొత్త కాంబినేషన్లో ఎమోషనల్ డ్రామా
{{/usCountry}}స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఇద్దరి పాత్రలు చాలా ఇంటెన్స్‌గా ఉండబోతున్నాయి. వీరితో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన మురళీ శర్మ, మనీష్ వాధ్వా, డీకే చేతన్, అతుల్ తివారీ, కమలేష్ సావంత్, త్రిష శారద వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నిశాంత్ భాగవత్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు మంగేష్ ధాక్డే అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. సమాజానికి ఒక కన్నువిప్పులా మారబోతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.