The India Story Teaser: కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఇంటెన్స్ సోషల్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' (The India Story) అధికారిక టీజర్ ఈరోజు రిలీజై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మనం రోజువారీగా తినే ఆహారం ఉత్పత్తి చేయడానికి వాడుతున్న విపరీతమైన పురుగు మందుల (Pesticides) వల్ల ప్రజల ఆరోగ్యం ఎలా పాడవుతుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించారు. టీజర్ స్టార్టింగ్ నుంచే కథలోని అసలైన ఇంటెన్సిటీని చూపిస్తూ ఆడియన్స్‌కు ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కోర్టులో లాయర్‌గా కాజల్

ఈ ది ఇండియా స్టోరీ సినిమాలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ శ్రేయాస్ తల్పడే ఒక ఎమోషనల్ క్యారెక్టర్ ప్లే చేశారు. పురుగు మందులు కొట్టిన ఆహారం తినడం వల్ల అతని చిన్న కూతురు క్యాన్సర్ బారిన పడి చనిపోతుంది. ఆ గర్భశోకంతో ఉన్న తండ్రి న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కడం, అతని తరపున కాజల్ అగర్వాల్ లాయర్ అమృతగా కేసు టేకప్ చేయడం చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుంది.
లాయర్ అమృత క్యారెక్టర్‌లో కాజల్ అగర్వాల్ తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. మార్కెట్‌లో దొరికే కూరగాయలు, ధాన్యాల్లో మోతాదుకు మించి కెమికల్స్ వాడుతున్నారని, ఆ ఫుడ్ తినడం వల్లే చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్లు వస్తున్నాయని ఆమె కోర్టులో బలంగా వాదించడం ఈ టీజర్ లో చూడొచ్చు. అమాయకపు చిన్నారి మరణానికి కేవలం ఆ కెమికల్స్ మాత్రమే కాదు.. వాటిని కంట్రోల్ చేయని గవర్నమెంట్ కూడా బాధ్యత వహించాలంటూ కాజల్ వేసే ప్రశ్నలు థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం.
సమాజానికి సందేశం ఇచ్చేలా..
డైరెక్టర్ చేతన్ డీకే ఈ సినిమాను ఒక కమర్షియల్ ప్రాజెక్ట్‌లా కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ చర్చించాల్సిన ఒక సీరియస్ ఆరోగ్య సంక్షోభం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. పెస్టిసైడ్ ఉపయోగించి చేసే వ్యవసాయం వల్ల దేశంలో సైలెంట్‌గా ఎదురవుతున్న ఈ భయంకరమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించడమే తన ప్రధాన లక్ష్యం అని డైరెక్టర్ ప్రెస్ మీట్ లో చెప్పారు. జీ స్టూడియోస్ సమర్పణలో మిగ్ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ తో కలిసి సాగర్ బి. షిండే ఈ ప్రతిష్టాత్మక సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
జూలై 24న మూడు భాషల్లో గ్రాండ్ రిలీజ్
{{/usCountry}}డైరెక్టర్ చేతన్ డీకే ఈ సినిమాను ఒక కమర్షియల్ ప్రాజెక్ట్‌లా కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ చర్చించాల్సిన ఒక సీరియస్ ఆరోగ్య సంక్షోభం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. పెస్టిసైడ్ ఉపయోగించి చేసే వ్యవసాయం వల్ల దేశంలో సైలెంట్‌గా ఎదురవుతున్న ఈ భయంకరమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించడమే తన ప్రధాన లక్ష్యం అని డైరెక్టర్ ప్రెస్ మీట్ లో చెప్పారు. జీ స్టూడియోస్ సమర్పణలో మిగ్ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ తో కలిసి సాగర్ బి. షిండే ఈ ప్రతిష్టాత్మక సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
జూలై 24న మూడు భాషల్లో గ్రాండ్ రిలీజ్
{{/usCountry}}కాజల్ అగర్వాల్ గతంలో ‘భగవంత్ కేసరి’, ‘సత్యభామ’ సినిమాలతో మంచి మేకోవర్ చూపించారు. ఇప్పుడు ‘ద ఇండియా స్టోరీ’తో పూర్తిగా ఒక సోషల్ కాజ్ కోసం ఫైట్ చేసే రోల్ సెలెక్ట్ చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్, కోర్టు రూమ్ డ్రామాకు సంబంధించిన విజువల్స్ చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సీన్లలోని ఎమోషన్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది.
ఈ మోస్ట్ అవేటెడ్ సోషల్ థ్రిల్లర్ మూవీని జులై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మన వంటింట్లోకి వస్తున్న విషాన్ని ఎండగట్టే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.