డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హీరో ఫాంటసీ డ్రామా 'లోకా: చాప్టర్ 1' గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో నటి కల్యాణి ప్రియదర్శన్ 'చంద్ర/నీలి' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించి తన కెరీర్‌లోనే బెస్ట్ బ్రేక్ అందుకుంది. నస్లెన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 303.67 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
సీక్వెల్.. సెప్టెంబర్‌లో షూటింగ్..
తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో కల్యాణి ప్రియదర్శన్ 'లోకా: చాప్టర్ 2' (Lokah: Chapter 2) గురించి ఆసక్తికర అప్‌డేట్ పంచుకుంది. ఈవెంట్ యాంకర్ సీక్వెల్ గురించి అడగగా.. "నిజం చెప్పాలంటే, నాకు తెలిసినంతవరకు సెప్టెంబర్ నెలకల్లా షూటింగ్ ప్రారంభం కావాలి. రెండవ భాగంలో కూడా నేను కచ్చితంగా ఉంటాను. కాబట్టి దయచేసి వెయిట్ చేయండి" అని ఆమె చిరునవ్వుతో బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకా మొదటి భాగంలో ఏం జరిగిందంటే?
'లోకా: చాప్టర్ 1' ప్రధానంగా కేరళ జానపద కథల ఆధారంగా కల్లియంకట్టు నీలి (Kalliyankattu Neeli) అనే యక్షిణి కథతో తెరకెక్కింది. కుల వివక్ష కారణంగా ఒక రాజు తన గ్రామాన్ని నాశనం చేయడంతో, కనబడని ఒక నాయకుడు 'మాతోన్' సాయంతో ప్రపంచంలోని అన్యాయాలపై చంద్ర (కల్యాణి) పోరాడుతుంది.
ఈ క్రమంలో ఆమె నేపథ్యం తెలియక సన్నీ (నస్లెన్) ఆమెతో ప్రేమలో పడతాడు. అటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే క్రూరమైన పోలీస్ ఆఫీసర్ నాచియప్ప గౌడ పాత్రలో నటుడు శాండీ నటించాడు. అతను చనిపోవడానికి ముందు వాంపైర్‌గా మారడం మొదటి భాగంలో ఉత్కంఠను రేపింది.
చాప్టర్ 2లో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్
తాజాగా విడుదలైన 'లోకా: చాప్టర్ 2' ప్రమోషనల్ వీడియోలో కేవలం టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ మాత్రమే కనిపించారు. రెండో భాగం ప్రధానంగా 'చాతన్' (Goblin) అనే మరో వింత జీవి చుట్టూ తిరుగుతుందని హింట్ ఇచ్చారు. ఈ పాత్రలో టొవినో (అతని పేరు మాతన్) కనిపించనుండగా, అచ్చం అతనిలాగే ఉండే ఏకంగా 389 మంది తోబుట్టువులు అతనికి ఉండటం విశేషం.
{{/usCountry}}తాజాగా విడుదలైన 'లోకా: చాప్టర్ 2' ప్రమోషనల్ వీడియోలో కేవలం టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ మాత్రమే కనిపించారు. రెండో భాగం ప్రధానంగా 'చాతన్' (Goblin) అనే మరో వింత జీవి చుట్టూ తిరుగుతుందని హింట్ ఇచ్చారు. ఈ పాత్రలో టొవినో (అతని పేరు మాతన్) కనిపించనుండగా, అచ్చం అతనిలాగే ఉండే ఏకంగా 389 మంది తోబుట్టువులు అతనికి ఉండటం విశేషం.
{{/usCountry}}అంతేకాకుండా మొదటి భాగం పోస్ట్-క్రెడిట్ సీన్‌లో దుల్కర్ సల్మాన్‌ను 'చార్లీ' అనే ఒడియన్ నింజా పాత్రలో పరిచయం చేశారు. సీక్వెల్‌లో కల్యాణి (చంద్ర)తో పాటు వీరంతా కలిసి ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించనున్నారు. సౌబిన్ షాహిర్, శాంతి బాలచంద్రన్, అహానా కృష్ణ, బాలు వర్గీస్ వంటి ఎంతో మంది నటులు ఈ ఫ్రాంచైజీలో భాగమయ్యారు.
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.