Kamal Haasan: ఆమె నా తల్లి కాదా? నిజం తెలుసుకొని రోజంతా ఏడ్చిన కమల్ హాసన్.. చిన్ననాటి రహస్యం వైరల్.. అసలేం జరిగిందంటే?
Kamal Haasan: భారతీయ చలనచిత్ర దిగ్గజం, లోకనాయకుడు కమల్ హాసన్ బాల్యానికి సంబంధించిన ఓ ఎమోషనల్ సీక్రెట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన కన్న తల్లి గురించి నిజం తెలిసినప్పుడు రోజంతా ఏడ్చిన కమల్ హాసన్ జ్ణాపకాలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు అప్పుడేం జరిగిందో? చూసేయండి.
Kamal Haasan: సినీ ప్రపంచంలో కమల్ హాసన్ పేరు వినపడని రోజంటూ ఉండదు. ప్రస్తుతం మరోసారి ఈ లోకనాయకుడి పేరు ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. అందుకు బలమైన కారణం ఉంది. కమల్ చిన్నప్పటి ఓ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

కమల్ తల్లిదండ్రులు
కమల్ హాసన్ ఒక సంపూర్ణ కళాత్మక నేపథ్యం ఉన్న కుటుంబం (లాయర్ డి. శ్రీనివాసన్ - రాజలక్ష్మి దంపతులు) నుండి వచ్చారు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన కమల్ హాసన్ (అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్) జన్మించిన వెంటనే ఆయన తల్లి రాజలక్ష్మి తీవ్రమైన మధుమేహం (డయాబెటిస్) బారిన పడ్డారు.
తల్లి గురించి తెలిసి
దీనితో పసిగుడ్డుగా ఉన్న కమల్‌ను సాకే బాధ్యతను ఆయన పెద్దన్నయ్య చారుహాసన్ భార్య కోమలవల్లి తీసుకున్నారు. దాదాపు ఐదేళ్ల వయసు వచ్చేవరకు కోమలవల్లినే తన కన్నతల్లి అని కమల్ బలంగా నమ్మేవారు. ఒకరోజు ఇంట్లో పనిచేసే వ్యక్తి ద్వారా కోమలవల్లి తన కన్నతల్లి కాదనే నిజం తెలుసుకుని చిన్నారి కమల్ తట్టుకోలేక రోజంతా ఏడుస్తూనే గడిపారట.
సుహాసిని తల్లి ఎమోషనల్ జ్ఞాపకాలు
కోమలవల్లి (ప్రముఖ సీనియర్ నటి సుహాసిని మణిరత్నం తల్లి) ఒక ఇంటర్వ్యూలో కమల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
"1954లో కమల్ జన్మించాడు. ఆ మరుసటి ఏడాదే (1955) నాకు ఒక బాబు పుట్టి చనిపోయాడు. ఆ పుత్రశోకం నుంచి నన్ను రక్షించింది కమలే. మా ఇంట్లో నాలుగేళ్ల పాటు వాడొక్కడే పిల్లోడిగా తిరిగాడు. కన్న తల్లి గురించి నిజం తెలిసిన రోజు 'నువ్వు నా అమ్మవి కావా?' అని అడుగుతూ ఎంతో ఏడ్చాడు’’ అని కోమలవల్లి చెప్పిన మాటలు ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అన్నయ్యే అండగా
కమల్ హాసన్ కంటే అన్నయ్య చారుహాసన్ 20 ఏళ్లు పెద్ద. అందుకే అన్నయ్య చారుహాసన్ కమల్ కు తండ్రిలా మారాడు. ఐదేళ్ల వయసులో ‘కలత్తూరు కన్నమ్మ’ (1960) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కమల్ కు షూటింగ్ సెట్స్‌లో రక్షకుడిగా నిలిచారు చారుహాసన్.
లోకనాయకుడి సినీ ప్రస్థానం
కమల్ హాసన్ భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత గొప్ప నటులలో ఒకరిగా నిలిచారు. ఉత్తమ నటుడిగా మూడు సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను (National Film Awards) అందుకున్న ఘనత ఆయన సొంతం. ఈ మైలురాయి రికార్డును ఆయన మమ్ముట్టి, అజయ్ దేవగన్‌లతో కలిపి పంచుకున్నారు. వీళ్లు కూడా మూడేసి సార్లు నేషనల్ అవార్డులు అందుకున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


