...
...
Next Story

Kamal Haasan: ఏ బిలియనీర్ మమ్మల్ని శాసించలేడు.. ఇండియా కాలనీ కాదు.. ప్రజాస్వామ్యం:ఎలాన్ మస్క్‌కు క్లాస్ పీకిన కమల్ హాసన్

Kamal Haasan: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు క్లాస్ పీకారు కమల్ హాసన్. తన స్టార్ లింక్ ను ఇండియాకు రాకుండా అడ్డుకుంటున్నారంటూ మస్క్ చేసిన ట్వీట్ కు చాలా ఘాటు రిప్లై ఇచ్చారు. ఇండియా ప్రజాస్వామ్య దేశమని, కాలనీ కాదని స్పష్టం చేశారు.

Published on: Oct 9, 2026, 22:09:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Kamal Haasan: భారతీయ శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్, గ్లోబల్ టెక్ దిగ్గజాల ఒత్తిళ్లపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ అత్యంత తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను నేరుగా ఉద్దేశిస్తూ.. "మిస్టర్ మస్క్.. భారతీయుడైనా లేదా అమెరికన్ అయినా సరే ఏ బిలియనీర్ కూడా ఒక దేశం విధానాలను శాసించలేడు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kamal Haasan: ఏ బిలియనీర్ మమ్మల్ని శాసించలేడు.. ఇండియా కాలనీ కాదు.. ప్రజాస్వామ్యం:ఎలాన్ మస్క్‌కు క్లాస్ పీకిన కమల్ హాసన్
Kamal Haasan: ఏ బిలియనీర్ మమ్మల్ని శాసించలేడు.. ఇండియా కాలనీ కాదు.. ప్రజాస్వామ్యం:ఎలాన్ మస్క్‌కు క్లాస్ పీకిన కమల్ హాసన్

సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా టెలికాం వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్ తన సార్వభౌమాధికారాన్ని, జాతీయ భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ పణంగా పెట్టదని కమల్ హాసన్ స్పష్టం చేశారు.

శాటిలైట్ ఇంటర్నెట్ సామాన్యుడికి అందుబాటులో ఉండాలి

మన దేశంలో సుదూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కనెక్టివిటీ అందించడానికి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అవసరమేనని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ ప్రొవైడర్లు అయినా లేదా గ్లోబల్ ప్రొవైడర్లు అయినా సరే, అతి తక్కువ ఖర్చుతో సేవలు అందించే ప్రతి ఒక్కరినీ భారత్ స్వాగతిస్తుందని తెలిపారు.

అయితే తక్కువ తలసరి ఆదాయం ఉన్న భారతదేశం లాంటి దేశాల్లో అధిక సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు, భారీ పరికరాల వ్యయం సాధారణ కుటుంబాలకు భారం కాకూడదని హెచ్చరించారు. కనెక్టివిటీ అనేది ప్రజల మధ్య వ్యత్యాసాలను తగ్గించాలి తప్ప, కొత్త డిజిటల్ అసమానతలను సృష్టించకూడదని ఆయన సూచించారు.

పాశ్చాత్య దేశాల డబుల్ స్టాండర్డ్స్‌పై తీవ్ర ఆగ్రహం

పాశ్చాత్య దేశాల ద్వంద్వ విధానాలను (Double Standards) కమల్ హాసన్ తీవ్రంగా ఎండగట్టారు. ఫ్రీ మార్కెట్ అంటూ ఉపన్యాసాలు ఇచ్చే పాశ్చాత్య దేశాలు స్వదేశంలో మాత్రం రక్షణాత్మక విధానాలు (Protectionism) అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. అమెరికా తన దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడానికి చైనా ఈవీలపై 100 శాతం టారిఫ్‌లు విధించడాన్ని, హువావే (Huawei) కంపెనీపై భారత్, అమెరికా రెండూ నిషేధాలు విధించడాన్ని ఆయన గుర్తుచేశారు.

ఒక ప్రజాస్వామ్య దేశంగా మన బలాలు, బలహీనతలను అంతర్గతంగా చర్చించుకునే హక్కు భారతీయులకు ఉందన్నారు. గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బాండ్ తీసుకెళ్లే 'భారత్‌నెట్' ప్రాజెక్టుపై 2026 సీఏజీ (CAG) ఆడిట్ నివేదికను ఆయన ప్రస్తావించారు. రూ.39,888 కోట్లు ఖర్చు చేసినప్పటికీ కేవలం 33.2 శాతం గ్రామ పంచాయతీల్లోనే సేవలు ఎందుకు అందుబాటులో ఉన్నాయో తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.

అదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన డాటాను అందిస్తున్న భారత టెలికాం రంగాన్ని, నిబంధనలను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. "భారతదేశం ఒక ప్రజాస్వామ్యం.. ఎవరికీ కాలనీ కాదు. ప్రపంచాన్ని మేము ఆహ్వానిస్తాం.. కానీ మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాం" అని కమల్ హాసన్ తన సందేశాన్ని ముగించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks