ఈ నెల ప్రారంభంలో కమల్ హాసన్, రజినీకాంంత్ కలిసి 'తలైవర్ 173' అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఒక సినిమాలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా 2027 పొంగల్ నాటికి విడుదల కానుంది. సుందర్ సి దీనికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆ ప్రకటన జరిగిన కొద్ది రోజులకే సుందర్ సి.. ఊహించని, తప్పించుకోలేని పరిస్థితుల కారణంగా సినిమా నుండి వైదొలుగుతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
కమల్ కామెంట్లు

అయితే శనివారం (నవంబర్ 15) ఈ మూవీ నుంచి సుందర్ సి తప్పుకోవడంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. విలేకరులతో విమానాశ్రయం వెలుపల మాట్లాడుతూ.. “సుందర్ సి తన ప్రెస్ రిలీజ్ ద్వారా ప్రాజెక్ట్ నుండి వైదొలగడానికి గల కారణాన్ని వివరించారు. ఒక ఇన్వెస్టర్ గా నా స్టార్‌కు నచ్చే స్క్రిప్ట్ ఈ సినిమాకు కావాలి. అదే సరైన మార్గం. ఆయనకు నచ్చే వరకు మేము సరైన కథల కోసం వెతుకుతూనే ఉంటాము. నా స్టార్ స్క్రిప్ట్‌తో సంతృప్తి చెందే వరకు, మేము దాని కోసం వెతుకుతూనే ఉంటాము. ప్రస్తుతం మేము ఒక నాణ్యమైన స్క్రిప్ట్‌ను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాం” అని కమల్ చెప్పారు.
కథే కారణం
కమల్ హాసన్- రజనీకాంత్ మూవీ నుంచి సుందర్ సి తప్పుకోవడానికి కథే కారణమని తెలుస్తోంది. కమల్ హాసన్ కూడా అదే మాటలు చెప్పారు. సుందర్ సి చెప్పిన కథ కమల్ కు అంతగా నచ్చలేదని సమాచారం. కానీ దీనిపై పట్టు వదలని సుందర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే ఎలాంటి కథ కావాలని చూస్తున్నారని కమల్ ను అడిగితే.. “ఊహించని దానిని ఆశించండి” అని పేర్కొన్నారు.
సుందర్ ఔట్
"జీవితంలో మన కలల నుండి వైదొలగాల్సి వచ్చినప్పటికీ, మన కోసం వేసిన మార్గాన్ని అనుసరించాల్సిన క్షణాలు వస్తాయి. ఈ ఇద్దరు దిగ్గజాలతో నా అనుబంధం చాలా కాలం నాటిది. నేను వారిని ఎల్లప్పుడూ అత్యంత గౌరవంగా చూస్తాను. గత కొన్ని రోజులుగా మేము పంచుకున్న ప్రత్యేక క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారు నాకు అమూల్యమైన పాఠాలు నేర్పించారు’’ అని సుందర్ అప్పుడు చెప్పాడు.
{{/usCountry}}"జీవితంలో మన కలల నుండి వైదొలగాల్సి వచ్చినప్పటికీ, మన కోసం వేసిన మార్గాన్ని అనుసరించాల్సిన క్షణాలు వస్తాయి. ఈ ఇద్దరు దిగ్గజాలతో నా అనుబంధం చాలా కాలం నాటిది. నేను వారిని ఎల్లప్పుడూ అత్యంత గౌరవంగా చూస్తాను. గత కొన్ని రోజులుగా మేము పంచుకున్న ప్రత్యేక క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారు నాకు అమూల్యమైన పాఠాలు నేర్పించారు’’ అని సుందర్ అప్పుడు చెప్పాడు.
{{/usCountry}}కూలీ విడుదల కావడానికి ముందే రజనీకాంంత్, కమల్ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారనే సంకేతాలు కనిపించాయి. కమల్ చివరిసారిగా మణిరత్నం దర్శకత్వంలో 'తగ్ లైఫ్' చిత్రంలో కనిపించారు. రజనీకాంత్ ఏమో కూలీ మూవీతో హిట్ కొట్టారు.