...
...
Next Story

Baba Ramdev: నా యవ్వనం, బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనకు: బాబా రామ్‌దేవ్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన కంగనా రనౌత్

Baba Ramdev: బాబా రామ్‌దేవ్ పై కంగనా రనౌత్ విరుచుకుపడింది. తాను చేసిన జనరేషన్ గట్టర్ కామెంట్స్ పై రామ్‌దేవ్ చేసిన వ్యక్తిగత విమర్శలను ప్రస్తావిస్తూ.. ఆమె చాలా ఘాటు స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Published on: Aug 19, 2026, 16:54:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Baba Ramdev: "నా యవ్వనం, బెడ్‌రూమ్ గురించి పగటికలలు కనకు బాబాజీ" అంటూ యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యోగా గురు రామ్‌దేవ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా దిమ్మ దిరిగే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ఏం జరిగింది? వివాదానికి దారితీసిన నేపథ్యం

Baba Ramdev: నా యవ్వనం, బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనకు: బాబా రామ్‌దేవ్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన కంగనా రనౌత్
Baba Ramdev: నా యవ్వనం, బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనకు: బాబా రామ్‌దేవ్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన కంగనా రనౌత్

యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ ఇటీవల 'జనరేషన్ గట్టర్' (Generation Gutter) అంటూ కామెంట్స్ చేశారు. ఫ్రీగా వచ్చిన స్వేచ్ఛను అనుభవిస్తూ బాధ్యత లేకుండా ప్రవర్తించే కొంతమంది యువతులు, నిరసనకారులను టార్గెట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై ఒక టీవీ ఇంటర్వ్యూలో బాబా రామ్‌దేవ్‌ను ప్రశ్నించగా.. ఆయన కంగనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ యువతను గట్టర్ అని పిలవడం ‘పాడైపోయిన మైండ్’కి సంకేతమని విమర్శించారు. కంగనా చిన్నతనం, యవ్వనం, గతంలో ఆమె చేసిన పనుల గురించి అందరికీ తెలుసంటూ కామెంట్ చేశారు.

'సుప్రీంకోర్టు సీన్ మర్చిపోయావా?': కంగనా స్ట్రాంగ్ కౌంటర్

రామ్‌దేవ్ చేసిన పర్సనల్ కామెంట్స్‌పై కంగనా రనౌత్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. రూమర్లు, గాసిప్స్ ఆధారంగా ఒకరి క్యారెక్టర్ గురించి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

"బాబాజీ.. నా జవానీ లేదా బెడ్‌రూమ్ గురించి పగటికలలు కనడం ఆపేయండి. కనీసం నకిలీ మెడికల్ క్లెయిమ్స్ చేసి సుప్రీంకోర్టు చేతిలో నేను తిట్లు తినలేదు. నా క్యారెక్టర్ మీకంటే చాలా బెటర్, ఇక్కడ ఎలాంటి మోసం లేదు" అని కంగనా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్ నిరసనలపై తాను చేసిన కామెంట్స్ మొత్తం యువతను ఉద్దేశించినవి కావు అని కంగనా క్లారిటీ ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపిన కొందరు వ్యక్తులు, మహిళల ప్రవర్తనను మాత్రమే తాను 'జెనరేషన్ గట్టర్' అని అన్నానని స్పష్టం చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్, రాజకీయాల్లోకి వచ్చాక కూడా తన ఫైర్‌బ్రాండ్ ఇమేజ్‌ను కొనసాగిస్తున్నారు. రీసెంట్‌గా 'భారత్ భాగ్య విధాత', 'ఎమర్జెన్సీ' సినిమాలతో వార్తల్లో నిలిచిన కంగనా, ఏ విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడటంలో ముందుంటారు.

కంగనా రనౌత్ కౌంటర్
 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe