OTT Blockbuster: కన్నడ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా 'ప్రేమద ఊరలి' (Premada Oorali) ప్రస్తుతం మూడో వారంలోకి అడుగుపెట్టి థియేటర్లలో దుమ్ములేపుతోంది. హీరో శ్రీరామ్ (Sriram), టెర్రిఫిక్ యాక్టర్ రంగాయణ రఘు (Rangayana Raghu) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతుండటంతో, ఓటీటీ ప్రియులు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఓటీటీ, శాటిలైట్ హక్కులపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు.
థియేటర్లే మా ఫస్ట్ ప్రయారిటీ అంటున్న మేకర్స్
సోషల్ మీడియాలో 'ప్రేమద ఊరలి' (ప్రేమతో నిండిన ఊరు అని అర్థం) సినిమా ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్ తేదీల గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో.. లీడ్ యాక్టర్ శ్రీరామ్ సినిమా టీమ్ తరఫున అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతానికి ఏ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తోనూ లేదా శాటిలైట్ ఛానెల్‌తోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రేక్షకులు ఈ అందమైన ప్రేమకథను, తండ్రీకొడుకుల భావోద్వేగ బంధాన్ని కేవలం బిగ్ స్క్రీన్ పైనే అనుభవించాలని తాము కోరుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. థియేట్రికల్ రన్ ముగిసే వరకు డిజిటల్ రిలీజ్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ ఓటీటీ డేట్ ఫిక్స్ అయితే అధికారిక ఛానెల్స్ ద్వారానే అనౌన్స్ చేస్తామని స్పష్టం చేశారు.
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తూ..
మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తపస్విని పూణచ్ఛ, రామిక శివు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎంబీఏ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ విలేజ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాకు సంగీతం, ఎమోషనల్ సీన్స్ ప్రధాన బలంగా నిలిచాయి. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ, మౌత్ టాక్‌తో కర్ణాటక వ్యాప్తంగా ఏకంగా 1,100 పైచిలుకు షోలతో ఈ సినిమా దూసుకుపోతోంది. యశ్ నటించిన టాక్సిక్ మూవీకి కూడా ముచ్చెమటలు పట్టించింది.
{{/usCountry}}మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తపస్విని పూణచ్ఛ, రామిక శివు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎంబీఏ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ విలేజ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాకు సంగీతం, ఎమోషనల్ సీన్స్ ప్రధాన బలంగా నిలిచాయి. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ, మౌత్ టాక్‌తో కర్ణాటక వ్యాప్తంగా ఏకంగా 1,100 పైచిలుకు షోలతో ఈ సినిమా దూసుకుపోతోంది. యశ్ నటించిన టాక్సిక్ మూవీకి కూడా ముచ్చెమటలు పట్టించింది.
{{/usCountry}}కన్నడ నాట థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. రూరల్ కర్ణాటకలో అయితే మూవీని చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ కావడం విశేషం. అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులు మాత్రం ఇంకొంతకాలం థియేటర్లలోనే ఈ మ్యాజికల్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయాల్సి ఉంటుందన్నది స్పష్టమైంది.