కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ కమరొ 2 (Kamaro 2). గతంలో కమరొట్టు చెక్‌పోస్ట్ పేరుతో వచ్చిన సినిమాకు ఇది సీక్వెల్. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. రెండున్నర నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఐఎండీబీలో 8 రేటింగ్ ఉన్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ పై ఆసక్తి నెలకొంది.
కమరొట్టు 2 ఓటీటీ రిలీజ్ డేట్

కమరొ 2 మూవీ ఓ కన్నడ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. 2019లో వచ్చిన కమరొట్టు చెక్‌పోస్ట్ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాను సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ శుక్రవారం (నవంబర్ 7) నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.
“కమరొట్టు చెక్ పోస్ట్ దగ్గర టెర్రర్ మళ్లీ నిద్ర లేచింది.. ఈసారి మరింత భయానకంగా, ప్రమాకరంగా మారింది. కమరో 2 నవంబర్ 7 నుంచి సన్ నెక్ట్స్ లో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయతే ఇది కేవలం కన్నడ భాషలోనే స్ట్రీమింగ్ కానుంది.
కమరొ 2 మూవీ గురించి..
కమరొ 2 మూవీ 2019లో వచ్చిన కమరొట్టు చెక్‌పోస్ట్ కు సీక్వెల్. అయితే ఆ సినిమాకు ఐఎండీబీలో 5.4 రేటింగే ఉండగా.. ఈ సీక్వెల్ కు మాత్రం 8 రేటింగ్ నమోదైంది. పరమేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో స్వామినాథన్ అనంతరామన్, రజనీ భరద్వాజ్, అనిల్ బాబీ, రక్షిత్ లాంటి వాళ్లు నటించారు. దెయ్యాల వేట సాగించే ఓ వ్యక్తి తన సోదరిని వెతుక్కుంటూ కమరొట్టు హౌస్ కు వస్తుంది.
అక్కడి వచ్చిన తర్వాత అందులోని సీక్రెట్స్ గురించి ఆమెకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఆమె ఎలా బయటపడుతుంది? ఆమె సోదరి సంగతి ఏమైంది అన్నది ఈ కమరొ 2 మూవీలో చూడొచ్చు. ఈ సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 7) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
{{/usCountry}}అక్కడి వచ్చిన తర్వాత అందులోని సీక్రెట్స్ గురించి ఆమెకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఆమె ఎలా బయటపడుతుంది? ఆమె సోదరి సంగతి ఏమైంది అన్నది ఈ కమరొ 2 మూవీలో చూడొచ్చు. ఈ సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 7) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
{{/usCountry}}