నా సినిమాను చూసే ఓజీని కాపీ కొట్టారు.. అది కూడా సీన్ టు సీన్.. నేనూ పవన్ కల్యాణ్ అభిమానినే కానీ..: కన్నడ డైరెక్టర్

పవన్ కల్యాణ్ ఓజీ మూవీ తాను తీసిన కబ్జా మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయినదే అని కన్నడ డైరెక్టర్ చంద్రు అనడం విశేషం. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతున్న సమయంలో అతడు ఈ కామెంట్స్ చేయడం ఆసక్తి రేపుతోంది.

Published on: Oct 22, 2025, 19:34:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ మరికొన్ని గంటల్లోనే అంటే గురువారం (అక్టోబర్ 23) నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో కన్నడ సినిమా కబ్జా డైరెక్టర్ చంద్రు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ఓజీ ట్రైలర్ చూస్తేనే సీన్ టు సీన్ కబ్జా నుంచి కాపీ కొట్టినట్లుగా ఉందని అనడం విశేషం.

నా సినిమాను చూసే ఓజీని కాపీ కొట్టారు.. అది కూడా సీన్ టు సీన్.. నేనూ పవన్ కల్యాణ్ అభిమానినే కానీ..: కన్నడ డైరెక్టర్
నా సినిమాను చూసే ఓజీని కాపీ కొట్టారు.. అది కూడా సీన్ టు సీన్.. నేనూ పవన్ కల్యాణ్ అభిమానినే కానీ..: కన్నడ డైరెక్టర్

కాపీ కాదు కానీ ఇన్‌స్పైర్ అయ్యారు

ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రతోపాటు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ నటించిన మూవీ కబ్జా. 2023లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. చాలా మంది ఈ సినిమాను కేజీఎఫ్ తో పోల్చారు. ఒరిజినాలిటీ లేదంటూ పెదవి విరిచారు. అయితే ఇప్పుడా సినిమా డైరెక్టర్ అయిన ఆర్.చంద్రు తన కబ్జా మూవీ నుంచి ప్రేరణ పొందే ఓజీ సినిమా తీశారని అనడం విశేషం.

ముఖ్యంగా కెమెరా యాంగిల్స్ అన్నీ అలాగే ఉన్నట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోందని అతడు స్పష్టం చేశాడు. ఇప్పుడు ఓజీ మూవీ చూసి ఇలా ఉంది.. అలా ఉంది అని తెగ పొగుడుతున్నారు.. కొన్నేళ్ల కిందటే నేను అలా తీశాను.. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు అని ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చంద్రు అన్నాడు. ఓజీ మూవీలో ప్రతి గన్ షాటూ, మేకింగ్ అంతా కబ్జాలో ఉన్నట్లుగానే ఉందని, దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని చెప్పాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

నేనూ పవన్ అభిమానినే..

అయితే ఇదే సందర్భంలో చంద్రు మాట్లాడుతూ.. ఓజీ సినిమాను కాపీ కొట్టారని అనను కానీ తన కబ్జా సినిమా నుంచి ప్రేరణ పొంది తీశారని, సినిమా ఇండస్ట్రీలో ఇది సహజమే అని అన్నాడు. అంతేకాదు తాను కూడా పవన్ కల్యాణ్ కు అభిమానినే అని, ఒకసారి అతన్ని కలిశానని కూడా చెప్పాడు. అయితే తన బాధల్లా తన కబ్జా సినిమాను ఇలాగే తీసినా మాట్లాడిన ప్రేక్షకులు ఇప్పుడు మాత్రం ఓజీని తెగ పొగిడేస్తున్నారని చంద్రు అన్నాడు.

ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్

పవన్ కల్యాణ్ ఓజస్ గంభీరా అనే పాత్రలో నటించిన ఈ ఓజీ మూవీ మరికొన్ని గంటల్లోనే నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. గురువారం (అక్టోబర్ 23) నుంచి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, ఇమ్రాన్ హష్మి కూడా నటించారు. ఈ మూవీ పవన్ కల్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ ఓజీ మూవీకి ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More