Thriller Web Series: దక్షిణాది ఓటీటీ స్పేస్‌లో సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్లకు ఎప్పుడూ ఉండే డిమాండే వేరు. రీసెంట్‌గా ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా కన్నడ తొలినాళ్లలోని వెబ్ సిరీస్‌లలో ఒకటిగా ఆడియన్స్ ముందుకు వచ్చిన పీరియడ్ సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'అయ్యన మనే' (Ayyana Mane). ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది. అక్టోబర్ 23 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

'దియా' సినిమాతో సౌత్ ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి ఖుషీ రవి (Khushee Ravi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ ఇందిరా తెరకెక్కించారు.
జీ5 ఓటీటీలో అయ్యన మనే సీజన్ 2
జీ5 కన్నడ ఓటీటీ ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం (అక్టోబర్ 9) తన ఎక్స్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది. “అక్టోబర్ 23న రహస్యాల వెనుక ఉన్న రహస్యం కూడా బయటపడబోతోంది. ఖుషీ రవి, అక్షయ నాయక, అనిరుధ్ ఆచార్య, ఖుషీ చంద్రశేఖర్ నటిస్తున్నారు. రమేష్ ఇందిర డైరెక్టర్ చేశారు” అనే క్యాప్షన్ తో జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించింది.
అయ్యన మనే తొలి సీజన్ లో ఏం జరిగిందంటే?
శ్రుతి నాథ్, చిత్ర సంయుక్తంగా నిర్మించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 1990ల కాలం నాటి చిక్కమగళూరు పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఒక పెద్ద రాచరికపు తరహా రాజభవనంలో అడుగుపెట్టిన నవవధువుకు ఎదురైన భయంకరమైన అనుభవాలు, ఆ ఇంటి వెనుక ఉన్న శాపం, దాగి ఉన్న డార్క్ సీక్రెట్స్ చుట్టూ కథ రసవత్తరంగా సాగుతుంది.
కథ విషయానికి వస్తే.. జూజీ (ఖుషీ రవి) అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి దుష్యంత్ (అక్షయ్ నాయక్) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని 'అయ్యన మనే' అనే పెద్ద గృహంలోకి అడుగుపెడుతుంది. ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నాగలాంబికే (మానసి సుధీర్) అనే కఠినమైన అత్తగారు వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే జూజీ ఆ ఇంట్లో కాలు పెట్టిన పెళ్లి రోజే ఆమె మామగారు అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. ఇది జూజీ తెచ్చిన అపశకునమేనని ఇంటి సభ్యులు నిందిస్తారు.
{{/usCountry}}కథ విషయానికి వస్తే.. జూజీ (ఖుషీ రవి) అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి దుష్యంత్ (అక్షయ్ నాయక్) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని 'అయ్యన మనే' అనే పెద్ద గృహంలోకి అడుగుపెడుతుంది. ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నాగలాంబికే (మానసి సుధీర్) అనే కఠినమైన అత్తగారు వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే జూజీ ఆ ఇంట్లో కాలు పెట్టిన పెళ్లి రోజే ఆమె మామగారు అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. ఇది జూజీ తెచ్చిన అపశకునమేనని ఇంటి సభ్యులు నిందిస్తారు.
{{/usCountry}}కానీ కాలం గడిచేకొద్దీ ఆ ఇంట్లోకి కోడళ్లుగా వచ్చిన మహిళలు ఒక్కొక్కరుగా వింత పరిస్థితుల్లో చనిపోతున్నారనే చేదు నిజం జూజీకి తెలుస్తుంది. ఆ ఇంట్లో ఏదో శాపం ఉందా? లేక కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరు సైకో కిల్లర్‌గా మారి ఈ హత్యలు చేస్తున్నారా? తన ప్రాణాలను కాపాడుకోవడానికి జూజీ ఏం చేసింది? అనేది తొలి సీజన్ లో చూడొచ్చు.
టెక్నికల్ వాల్యూస్, నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్ చేసిన ఖుషీ రవి తన సీరియస్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో సిరీస్‌ను ఒంటిచేత్తో నడిపించింది. భయం, నిస్సహాయత, తనను తాను రక్షించుకోవాలనే పట్టుదలను ఆమె కళ్లలోనే పండించింది. అత్తగారి పాత్రలో మానసి సుధీర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న గంభీరమైన నటనతో ఆకట్టుకోగా, అక్షయ్ నాయక్, అనిరుధ్ ఆచార్య, హితా చంద్రశేఖర్ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.
దర్శకుడు రమేష్ ఇందిరా 90ల కాలం నాటి వాతావరణాన్ని, దైవ ప్రకోపానికి సంబంధించిన విశ్వాసాలను సరిగ్గా ఎలివేట్ చేశారు. రాహుల్ రాయ్ సినిమాటోగ్రఫీ, లో-కీ లైటింగ్ సిరీస్‌కి కావాల్సిన సస్పెన్స్ మూడ్‌ను క్రియేట్ చేసింది. ప్రతి ఎపిసోడ్ కేవలం 18 నిమిషాల నిడివితో 6 ఎపిసోడ్లు మాత్రమే ఉండటంతో బింజ్ వాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సీరియల్ ఛాయలు అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ, సస్పెన్స్ మర్డర్ మిస్టరీలను ఇష్టపడే ఓటీటీ ప్రేమికులకు జీ5లో అందుబాటులో ఉన్న 'అయ్యన మనే' ఒక గుడ్ టైమ్‌పాస్ వాచ్. ఒకవేళ ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే రెండో సీజన్ వచ్చే ముందే చూసేయండి.