ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కాంతార ఛాప్టర్ 1.. రష్మిక మందన్నా మూవీ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ శెట్టి మూవీ

కాంతార ఛాప్టర్ 1 మరో రికార్డును తన పేరిట రాసుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో రష్మిక మందన్నా నటించిన ఛావా మూవీ రికార్డును బ్రేక్ చేయడం విశేషం.

Published on: Oct 23, 2025, 17:21:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది అంటే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ఛావా (Chhaava) పేరిట ఉన్న రికార్డును కాంతార ఛాప్టర్ 1 (Kantara Chapter 1) బద్దలు కొట్టింది. రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా బుధవారం (అక్టోబర్ 22) నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో ఛావా మొత్తం లైఫ్‌టైమ్ కలెక్షన్లు రూ.807 కోట్లను కూడా దాటేసింది.

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కాంతార ఛాప్టర్ 1.. రష్మిక మందన్నా మూవీ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ శెట్టి మూవీ
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కాంతార ఛాప్టర్ 1.. రష్మిక మందన్నా మూవీ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ శెట్టి మూవీ

కాంతార ఛాప్టర్ 1 బాక్సాఫీస్ అప్‌డేట్

కాంతార ఛాప్టర్ 1 సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) ప్రకారం.. ఈ పీరియడ్ యాక్షన్ మూవీ మొదటి రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.717 కోట్లు సంపాదించింది. స్టూడియో ఈ ప్రకటనను గత శుక్రవారం ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. మూడో వారంలో కూడా ఈ సినిమా వేగంగా వసూళ్లను సాధిస్తూనే ఉంది. మూడో వీకెండ్‌లో ఇండియాలో రూ.38 కోట్ల నెట్ వసూళ్లను జోడించింది. అప్పటి నుండి ఈ సినిమా ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మరో రూ.92 కోట్లు వసూలు చేసి.. దాని మొత్తం వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రూ.809 కోట్లకు చేర్చింది. ఇది ఛావా మొత్తం వసూళ్లు రూ.807 కోట్ల కంటే ఎక్కువ.

అయితే ఇతర వర్గాలు మాత్రం కాంతార ఛాప్టర్ 1 ఇప్పటికీ ఛావా రికార్డుకు కొంత దూరంలో ఉందని పేర్కొంటున్నాయి. Sacnilk ప్రకారం 21 రోజుల తర్వాత (బుధవారం రాత్రి నాటికి) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.775 కోట్లు వసూలు చేసింది. కాంతారా ఛాప్టర్ 1 ఇండియాలో రూ.556.75 కోట్ల నెట్, విదేశాలలో సుమారు 13 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ నెలాఖరులో ఈ సినిమా ఇంగ్లిష్ వెర్షన్ విడుదల కానుంది.

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలు

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో కాంతార ఛాప్టర్ 1, ఛావా తర్వాత మోహిత్ సూరి డైరెక్ట్ చేసిన సయ్యారా (Saiyaara) ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.576 కోట్లు వసూలు చేసింది. రజనీకాంత్ మూవీ కూలీ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో నాలుగో స్థానంలో ఉంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ వార్ 2 రూ.365 కోట్ల వసూళ్లతో టాప్ 5లో నిలిచింది. మహావతార్ నరసింహ, ఓజీ, లోకా ఛాప్టర్ 1 అనే మూడు ఇతర ఇండియన్ మూవీస్ కూడా ఈ ఏడాడి రూ.300 కోట్లకు పైగా వసూలు చేశాయి. టాప్ 10లోకి వచ్చిన ఒకే ఒక హిందీ మూవీ ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్. ఇది మోహన్‌లాల్ నటించిన L2: ఎంపురాన్ కంటే కొద్దిగా వెనుక ఉంది.

కాంతార ఛాప్టర్ 1 గురించి

రిషబ్ శెట్టి రచన దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార ఛాప్టర్ 1.. 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ కాంతార సినిమాకు సీక్వెల్. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఇది రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ మూవీ. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కూడా నటించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More