ఈవారం ఒక్కో ఓటీటీలోకి ఒక్కో భాషలో వచ్చిన, వస్తున్న టాప్ మూవీస్ ఇవే.. తెలుగులో ఓజీ, మలయాళంలో ఆ రివేంజ్ థ్రిల్లర్
ఈవారం ఓటీటీలోకి వివిధ భాషల్లో కొత్త సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. వీటిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలకు చెందిన మూవీస్ ఉన్నాయి. వీటిని నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.
ఓటీటీలోకి ప్రతివారంలాగే ఈ వారం కూడా వివిధ భాషల్లో ఇంట్రెస్టింగ్ మూవీస్ రానున్నాయి. కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. వీటిలో తెలుగు నుంచి పవన్ కల్యాణ్ నటించిన ఓజీ ఉంది. ఇదే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీల నుంచి వచ్చే మూవీస్ ఏవో తెలుసుకోండి.

ఓజీ - నెట్‌ఫ్లిక్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మూవీ దే కాల్ హిమ్ ఓజీ గురువారం (అక్టోబర్ 23) నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. పవన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమాపై ఓటీటీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
భద్రకాళి - జియోహాట్‌స్టార్
విజయ్ ఆంటోనీ నటించిన తమిళ మూవీ శక్తి తిరుమగన్ శుక్రవారం (అక్టోబర్ 24) జియోహాట్‌స్టార్ లోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ తెలుగులో భద్రకాళిగా రిలీజైన విషయం తెలిసిందే. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.
నడికర్ - లయన్స్‌గేట్ ప్లే
మలయాళం స్టార్ హీరో టొవినో థామస్ నటించిన నడికర్ మూవీ కూడా శుక్రవారమే (అక్టోబర్ 24) లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ ఏడాది జులైలో రిలీజైన ఈ మూవీ.. సుమారు మూడు నెలల తర్వాత వస్తోంది.
చట్టులి - మనోరమ మ్యాక్స్
మలయాళం రివేంజ్ థ్రిల్లర్ మూవీ చట్టులి ఇప్పటికే మనోరమ మ్యాక్స్ లోకి అడుగుపెట్టింది. సోమవారం (అక్టోబర్ 20) దీపావళి సందర్భంగా ఈ మూవీ స్ట్రీమింగ్ మొదలైంది. కేవలం మలయాళం ఆడియోతోనే అందుబాటులో ఉంది.
జంబో సర్కస్ - సన్ నెక్ట్స్ ఓటీటీ
కన్నడ మూవీ జంబో సర్కస్ శుకవ్రారం సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వస్తోంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ భార్యల మధ్య జరిగే ఫైట్ చుట్టూ తిరిగే కామెడీ మూవీ ఇది. ఎండీ శ్రీధర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
పరమ్ సుందరి - ప్రైమ్ వీడియో
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన హిందీ మూవీ పరమ్ సుందరి. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుండగా.. శుక్రవారం (అక్టోబర్ 24) నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


