రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన కాంతార ఛాప్టర్ 1 డిజిటల్ ప్రీమియర్ కానుంది. అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్ల సినిమాగా నిలిచిన ఈ మూవీ.. తాజాగా కర్ణాటకలోనూ మరో రికార్డును సొంతం చేసుకుంది.
కాంతార ఛాప్టర్ 1 బాక్సాఫీస్ రికార్డు

కాంతార ఛాప్టర్ 1 మూవీ కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకూ ఏ సినిమాకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ కర్ణాటక గ్రాస్ రూ.250 కోట్ల మార్క్ అందుకుంది. నిజానికి ఇప్పటి వరకూ ఏ ఇతర సినిమా కనీసం రూ.200 కోట్లు కూడా దాటలేదు.
కేజీఎఫ్ 2లాంటి మూవీ కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసినా.. సొంత రాష్ట్రంలో గ్రాస్ మాత్రం కాంతార ఛాప్టర్ 1 కంటే చాలా తక్కువే. ఇప్పటికే రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. ఈ ఏడాది ఇండియాలో అత్యధిక వసూళ్ల సినిమాగా నిలిచింది. అటు కన్నడలోనూ కేజీఎఫ్ 2 తర్వాత ఎక్కువ వసూళ్లు సాధించిన మూవీ కూడా ఇదే. అయితే కర్ణాటక బాక్సాఫీస్ రికార్డు మాత్రం అసలు ఊహకందనిదే.
కాంతార ఛాప్టర్ 1 ఓటీటీ స్ట్రీమింగ్
కాంతార ఛాప్టర్ 1 మూవీ థియేటర్లలో ఉండగానే శుక్రవారం (అక్టోబర్ 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ సౌత్ వెర్షన్లే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అంటే కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం అందుబాటులోకి వస్తాయి. హిందీ వెర్షన్ కు మరో నెల రోజులకుపైగా సమయం పట్టనుంది.
దీంతో ఇక్కడ వసూళ్లు పడిపోయినా.. నార్త్ లో మాత్రం ఎంతోకొంత వస్తూనే ఉంటుందన్న ధీమాతో ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇక్కడ కూడా మూడేళ్ల కిందట కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే ఈ సినిమాను నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు నిర్మాత చలువే గౌడ చెప్పిన విషయం తెలిసిందే. థియేటర్ల కంటే ఎక్కువగా ఈ సినిమాకు ఓటీటీలో ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
{{/usCountry}}దీంతో ఇక్కడ వసూళ్లు పడిపోయినా.. నార్త్ లో మాత్రం ఎంతోకొంత వస్తూనే ఉంటుందన్న ధీమాతో ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇక్కడ కూడా మూడేళ్ల కిందట కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే ఈ సినిమాను నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు నిర్మాత చలువే గౌడ చెప్పిన విషయం తెలిసిందే. థియేటర్ల కంటే ఎక్కువగా ఈ సినిమాకు ఓటీటీలో ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
{{/usCountry}}