...
...
Next Story

టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కాంతార ఛాప్టర్ 1.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

కన్నడ బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాంతార: ఎ లెజెండ్ ఛాప్టర్ 1 మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమాను జీ తెలుగు ఛానెల్ టెలికాస్ట్ చేయనుంది. థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగు నెలల తర్వాత మూవీ టీవీలోకి రానుండటం విశేషం.

Published on: Jan 21, 2026, 21:47:42 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

కాంతార: ఎ లెజెండ్ ఛాప్టర్ 1.. గతేడాది ఇండియన్ సినిమా నుంచి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటి. అక్టోబర్ 2న దసరా సందర్భంగా రిలీజై.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఇప్పటికే మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు టీవీ ప్రీమియర్ కోసం సిద్ధమైంది.

కాంతార ఛాప్టర్ 1 టీవీ ప్రీమియర్ డేట్

టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కాంతార ఛాప్టర్ 1.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కాంతార ఛాప్టర్ 1.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ వారం మరో కొత్త సినిమాతో వచ్చేస్తోంది. థియేటర్​, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్​ మూవీ కాంతార: ఎ లెజెండ్​ ఛాప్టర్​ 1. కన్నడ స్టార్​ హీరో రిషబ్​ శెట్టి స్వీయ​ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్​ నిర్మించిన ఈ సినిమాను వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​గా అందిస్తోంది జీ తెలుగు. రిషబ్​ శెట్టి​, రుక్మిణీ వసంత్​ నటించిన బ్లాకబస్టర్​ మూవీ కాంతార: ఎ లెజెండ్​ చాప్టర్​ 1.. ఈ శనివారం (జనవరి 24) సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

కాంతార ఛాప్టర్ 1 మూవీ విశేషాలు

2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా రూ.855 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. సినిమా కథ విషయానికి వస్తే.. కాంతార ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే రాజు రాజ్యం ఉంటుంది. రాజశేఖర్ వంశం ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ల ఆధీనంలోనే ఉంటుంది. అదే ప్రాంతంలో బెర్మె (రిషబ్ శెట్టి) ఉంటాడు. తన ప్రజల కోసం అతడు ఏకంగా రాజ్యంలోకే వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు.

ఈ సినిమాలో పాన్​ఇండియా స్టార్ రిషబ్​ శెట్టి, రుక్మిణీ వసంత్​ ప్రధాన పాత్రలు పోషించగా.. జయరామ్, రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య వంటి ప్రముఖులు ఇతర ముఖ్యపాత్రల్లో మెప్పించారు. హోంబలే ఫిలిమ్స్​ బ్యానర్​పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకి బి. అజనీష్ లోక్‌నాథ్​ సంగీతం అందించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe