Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలిచే ఈ 'బేబో'.. ఇప్పుడు ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. విమానాశ్రయంలో సామాన్యుల పట్ల ఆమె వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలైతే కొమ్ములుంటాయా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అసలేం జరిగిందో చూడండి.
క్యూ లైన్ దాటి వెళ్లిన కరీనా

తాజాగా కరీనా కపూర్ విమానాశ్రయానికి చేరుకున్న ఒక వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కరీనా పీచ్ కలర్ సూట్-సల్వార్ ధరించి, స్టైలిష్ గ్లాసెస్‌తో కనిపించింది. అయితే ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ వద్ద ప్రయాణికులందరూ క్యూ లైన్‌లో వేచి చూస్తుండగా.. కరీనా మాత్రం ఆ లైన్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా గేటు వద్దకు వెళ్లింది. ఆమెతో ఉన్న సిబ్బంది ఐడీ కార్డులు చూపించగానే భద్రతా సిబ్బంది ఆమెను లోపలికి పంపించేశారు.
నెటిజన్ల ట్రోలింగ్
చాలా సేపటి నుంచి లైన్‌లో నిలబడి తమ వంతు కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రయాణికులను కాదని, సెలబ్రిటీలకు ఇలాంటి 'స్పెషల్ ట్రీట్‌మెంట్' ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "సెలబ్రిటీలకు మాత్రమే ఇలాంటి ప్రత్యేక హక్కులు ఎవరు ఇచ్చారు? అక్కడ లైన్‌లో ఉన్న వాళ్లందరికీ విమానం అందుకోవాలనే ఆత్రుత ఉంటుంది కదా" అని ఒక యూజర్ ప్రశ్నించారు.
మరికొందరైతే ఏకంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ.. దేశంలో ఈ వీఐపీ సంస్కృతికి ఎప్పుడు చెక్ పడుతుందని నిలదీస్తున్నారు. సామాన్యులకు ఒక రూల్, సెలబ్రిటీలకు ఒక రూలా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.
వరుస సినిమాలతో బిజీ
వివాదాలు పక్కన పెడితే, కరీనా కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'దాయరా' చిత్రంలో ఆమె నటిస్తున్నారు. దీనితో పాటు ఒక భారీ పాన్ ఇండియా చిత్రంలో కూడా కరీనా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
{{/usCountry}}వివాదాలు పక్కన పెడితే, కరీనా కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'దాయరా' చిత్రంలో ఆమె నటిస్తున్నారు. దీనితో పాటు ఒక భారీ పాన్ ఇండియా చిత్రంలో కూడా కరీనా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
{{/usCountry}}అయితే ఈ ఎయిర్‌పోర్ట్ వివాదంపై కరీనా కపూర్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు అందరికీ సమానమేనని ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.