OTT Spy Thriller: ఓటీటీలోకి మూడు వారాల్లోనే కార్తి స్పై థ్రిల్లర్.. అప్పుడు బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు డిజాస్టర్.. ఈవారమే..

OTT Spy Thriller: ఓటీటీలోకి కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 మూవీ మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ కు వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. థియేటర్లలో ఈ మూవీ తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే.

Published on: Sep 28, 2026, 14:15:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Spy Thriller: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కార్తీ నటించిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ సైలెంట్‌గా లాక్ అయిపోయింది. థియేటర్లలో రిలీజైన కేవలం 21 రోజుల వ్యవధిలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుండడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కార్తీ ఫ్యాన్స్ 'సత్యం సుందరం' (తమిళంలో మేయళగన్) రెండో యానివర్సరీ వేడుకల్లో ఉండగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

OTT Spy Thriller: ఓటీటీలోకి మూడు వారాల్లోనే కార్తి స్పై థ్రిల్లర్.. అప్పుడు బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు డిజాస్టర్.. ఈవారమే..
OTT Spy Thriller: ఓటీటీలోకి మూడు వారాల్లోనే కార్తి స్పై థ్రిల్లర్.. అప్పుడు బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు డిజాస్టర్.. ఈవారమే..

సర్దార్ 2 మూవీ విశేషాలు

• మూవీ పేరు : సర్దార్ 2

• నటీనటులు : కార్తీ, ఎస్జే సూర్య, మాళవికా మోహనన్

• డైరెక్టర్ : పీఎస్ మిత్రన్

• ఓటీటీ ప్లాట్‌ఫామ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో

• ఓటీటీ రిలీజ్ డేట్ : అక్టోబర్ 1, 2026

• మ్యూజిక్ డైరెక్టర్: సామ్ సీఎస్

థియేటర్లలో నిరాశపరిచిన బాక్సాఫీస్ రన్

డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ కాంబినేషన్‌లో 2022లో వచ్చిన 'సర్దార్' మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లకుపైగా వసూలు చేసింది. దాంతో ఈ సీక్వెల్ పై అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ట్రేడ్ వర్గాల్లో, ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సెప్టెంబర్ 10, 2026న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజైన 'సర్దార్ 2' థియేటర్లలో ఆడియన్స్‌ను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పోటీగా వచ్చిన తమిళ నటుడు సూరి 'మండాడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపడంతో 'సర్దార్ 2' వసూళ్లు బాగా పడిపోయాయి. వరల్డ్‌వైడ్‌గా కేవలం రూ.23 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోవడంతో థియేట్రికల్ రన్ త్వరగానే ముగిసింది.

అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్

థియేట్రికల్ రన్ ఊహించిన దానికంటే త్వరగానే ముగిసి పోవడతో ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అయింది. అక్టోబర్ 1, 2026 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 'సర్దార్ 2' ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ రిలీజ్ అయిన 3 వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకోస్తుండటంతో థియేటర్లలో మిస్సయిన ఆడియన్స్ ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

భారీ స్టార్ కాస్ట్.. విజువల్స్ నెక్స్ట్ లెవెల్

ఈ స్పై థ్రిల్లర్‌లో కార్తీ మరోసారి డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి అలరించారు. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో ఎస్.జె. సూర్య "బ్లాక్ డాగర్" క్యారెక్టర్‌లో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

కార్తీకి జోడీగా మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటించగా, సామ్ సి.యస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. సాంబార్ ప్రొడక్షన్ హౌసెస్ ప్రిన్స్ పిక్చర్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో బిగ్ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు.

పెద్ద స్క్రీన్‌పై కంటే ఓటీటీ హోమ్ స్క్రీన్‌పై ఈ తరహా మైండ్ బెండింగ్ స్పై ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు బాగా వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి థియేటర్లలో నిరాశ పరిచిన సర్దార్ 2 ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం, అందులో గాంధీ జయంతి రూపంలో లాంగ్ వీకెండ్ కావడంతో ఈ సినిమాకు భారీ వ్యూస్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More