Malavika Mohanan: రజనీ, మోహన్ లాల్‌తో విజయ్‌ను పోల్చిన మాళవిక మోహనన్- ఫోన్ చేసేంత స్వేచ్ఛనిస్తారన్న రాజా సాబ్ బ్యూటీ
Malavika Mohanan On Thalapathy Vijay: కోలీవుడ్ అగ్ర నటుడి నుంచి తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ సమయపాలన, వృత్తి బద్ధతపై ది రాజా సాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రశంసలు కురిపించారు. మరోవైపు విజయ్ నటించిన రూ. 500 కోట్ల భారీ చిత్రం జన నాయగన్ విడుదలకు అడ్డంకులు తొలగుతున్నట్లు తెలుస్తోంది.
Malavika Mohanan Comments On CM Vijay: కోలీవుడ్ పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోగా వెలిగి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డులు సృష్టించారు దళపతి విజయ్. ఆయన రాజకీయ ప్రస్థానం, సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.

క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు
విజయ్‌తో కలిసి నటించిన సహనటులు సైతం ఆయన పనితీరును, క్రమశిక్షణను ఎంతగానో అభినందిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ది రాజా సాబ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సెట్స్‌లో విజయ్ డిసిప్లిన్ వేరే లెవెల్
విజయ్‌తో తనకున్న మొదటి పరిచయాన్ని మాళవిక గుర్తు చేసుకున్నారు. షూటింగ్ తొలిరోజే ఒక సవాలుతో కూడిన సీన్ చేయాల్సి వచ్చిందని, చివరి నిమిషంలో డైలాగులు రావడంతో తాను కంగారు పడ్డానని చెప్పారు. ఆ సమయంలో విజయ్ ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా తన పని తాను చూసుకుంటూ కనిపించారని ఆమె తెలిపారు.
"సెట్స్‌లో విజయ్ చాలా సైలెంట్‌గా ఉంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ, తన పాత్రపైనే పూర్తి దృష్టి పెడతారు. ఒకసారి పరిచయం పెరిగాక ఆయన ఎంతో సరదాగా ఉంటారు. ఎప్పుడు అవసరమొచ్చినా ఫోన్ చేసి మాట్లాడగలిగేంత స్వేచ్ఛను ఇస్తారు. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా అందరికీ అందుబాటులో ఉండటం గొప్ప విషయం" అని మాళవిక మోహనన్ కొనియాడారు.
సమయపాలనలో ఆ ముగ్గురే స్ఫూర్తి
సినిమా పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ప్రతిభతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరమని మాళవిక అభిప్రాయపడ్డారు. రజనీకాంత్, మోహన్ లాల్, విజయ్ వంటి సీనియర్ హీరోల నుంచి ప్రొఫెషనలిజం అంటే ఏంటో నేర్చుకున్నట్లు మాళవిక మోహనన్ వెల్లడించారు. అంటే రజనీకాంత్, మోహన్ లాల్‌తో దళపతి విజయ్‌ను పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు మాళవిక.
ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉంటే, వారు 6:55 గంటలకే సెట్స్‌లో ఉంటారని.. ఎప్పుడూ ఆలస్యం చేసి నిర్మాతల డబ్బును వృధా చేయరని ప్రశంసించారు. యువ నటీనటులు వీరిని చూసి చాలా నేర్చుకోవాలని చెప్పారు. కాగా 2021లో వచ్చిన 'మాస్టర్' సినిమాలో విజయ్, మాళవిక కలిసి నటించారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత తీవ్ర నష్టాల్లో ఉన్న థియేటర్లకు ఆ సినిమా భారీ వసూళ్లతో ఊపిరి పోసింది.
రూ. 500 కోట్ల 'జన నాయగన్' విడుదలకు మోక్షం
ఇదిలా ఉంటే, దళపతి విజయ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'జన నాయగన్' ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. సెన్సార్ బోర్డ్ (CBFC)తో ఉన్న కొన్ని వివాదాల కారణంగా ఈ సినిమా చాలా కాలంగా ఆలస్యమవుతూ వచ్చింది. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సినిమా అడ్డంకులు తొలగుతున్నట్లు నిర్మాత వెంకట్ కే నారాయణ స్పష్టం చేశారు. సెన్సార్ ప్రక్రియ చివరి దశకు చేరిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ స్వయంగా చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ప్రభాస్‌తో రాజా సాబ్
మరోవైపు మాళవిక మోహనన్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె ఇటీవల ప్రభాస్ సరసన 'ది రాజా సాబ్' చిత్రంలో నటించారు. ప్రస్తుతం కార్తీ సరసన 'సర్దార్ 2' సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది గ్లామర్ భామ మాళవిక మోహనన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


