ఓటీటీలోకి కార్తీ డిజాస్టర్ తమిళ మూవీ తెలుగులోనూ వస్తోంది.. అన్నగారు వొస్తారు ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

కార్తీ నటించిన తమిళ డిజాస్టర్ మూవీ వా వాతియార్ ఇప్పుడు తెలుగులో అన్నగారు వొస్తారు పేరుతో ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది. తమిళ వెర్షన్ చాలా రోజుల కిందటే స్ట్రీమింగ్ కు వచ్చినా.. తెలుగు వెర్షన్ ను ఈవారం తీసుకొస్తున్నారు.

Published on: Mar 3, 2026, 18:34:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళంలో ఈసారి సంక్రాంతికి వచ్చి బోల్తా పడిన మూవీ వా వాతియార్. ప్రముఖ నటుడు కార్తీ నటించిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నా థియేటర్లు దొరకలేదు. దీంతో ఇప్పుడు నేరుగా ప్రైమ్ వీడియోలోకి తీసుకొస్తున్నారు. ఇన్నాళ్లూ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉండగా.. శుక్రవారం (మార్చి 6) నుంచి అన్నగారు వొస్తారు అంటూ పూర్తిగా తెలుగు వెర్షన్ రాబోతోంది.

ఓటీటీలోకి కార్తీ డిజాస్టర్ తమిళ మూవీ తెలుగులోనూ వస్తోంది.. అన్నగారు వొస్తారు ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
ఓటీటీలోకి కార్తీ డిజాస్టర్ తమిళ మూవీ తెలుగులోనూ వస్తోంది.. అన్నగారు వొస్తారు ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

అన్నగారు వొస్తారు ఓటీటీ రిలీజ్ డేట్

కార్తీ నటించిన అన్నగారు వొస్తారు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని ప్రైమ్ వీడియో మంగళవారం (మార్చి 3) ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. “అన్నగారి ఆగమనం.. అన్నగారు వొస్తారు కొత్త సినిమా మార్చి 6 నుంచి ప్రైమ్ వీడియోలో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఇందులో కార్తీ ఈ మూవీ గురించి చెప్పే ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసింది.

తమ్ముళ్లు, చెల్లెళ్లు.. అందరూ బాగున్నారా.. అంటూ ఎన్టీఆర్ స్టైల్లో కార్తీ ఓ డైలాగు చెబుతాడు. లెజెండరీ నటుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా ఆయన ఫ్యాన్స్ కు ఇస్తున్న గిఫ్టే అన్నగారు వొస్తారు.. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఓ చెడును ప్రశ్నించడానికి అన్నగారు వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే ఇది అని కార్తీ ఆ వీడియోలో చెప్పాడు.

అన్నగారు వొస్తారు మూవీ విశేషాలు

కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్’ ఈ ఏడాది పెద్ద సంక్రాంతి సినిమాలతో పాటు జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే తమిళ వెర్షన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. మిగిలిన భాషల డబ్బింగ్ వెర్షన్లనూ అందుబాటులోకి తెచ్చారు.

ఈ సినిమా రాము (కార్తి పోషించిన పాత్ర) చుట్టూ తిరుగుతుంది. రాము తన తాతయ్య దగ్గర పెరుగుతాడు. అతడు అలనాటి దిగ్గజ నటుడు, రాజకీయ నాయకుడు ఎంజీఆర్ కు వీరాభిమాని. రాము కథ ద్వారా ఈ సినిమా ఆ మహానటుడికి నివాళి అర్పిస్తుంది.

తన మనవడికి, తన అభిమాన నటుడికి మధ్య ఏదో సంబంధం ఉందని తాతయ్య నమ్ముతుంటారు. పెరిగి పెద్దయ్యాక రాము పోలీస్ అవుతాడు కానీ, అతను నీతి నిజాయితీ లేని మార్గంలో నడుస్తుంటాడు. అయితే కొన్ని సంఘటనలు రాము తన పద్ధతులను మార్చుకునేలా చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరపై చూడాల్సిందే. తెలుగులో ఎంజీఆర్ స్థానంలో ఎన్టీఆర్ కు నివాళిగా ఈ అన్నగారు వొస్తారు రానుంది.

ఇందులో కార్తీ హీరోగా నటించగా, రాజ్‌కిరణ్ అతని తాతయ్యగా కనిపించాడు. కృతి శెట్టి కథానాయికగా నటించింది. సీనియర్ నటులు సత్యరాజ్, నిళల్‌గల్ రవి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జి.ఎం. సుందర్, రమేష్ తిలక్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More