ఓటీటీలోకి రెండు వారాల్లోనే వచ్చేస్తున్న కార్తీ డిజాస్టర్ యాక్షన్ కామెడీ మూవీ.. తెలుగులో నేరుగా ఓటీటీలోకే..
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన తాజా మూవీ ‘వా వాతియార్’ థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమైంది.
ఈసారి తెలుగులో సంక్రాంతి సినిమాలన్నీ మంచి ఫలితాలు సాధించగా.. తమిళంలో మాత్రం అన్నీ బోల్తా పడ్డాయి. అలాంటి సినిమానే వా వాతియార్. తెలుగులో అన్నగారు వస్తున్నారు పేరుతో రిలీజ్ కావాల్సి ఉన్నా థియేటర్లు లేక రాలేదు. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకే వస్తోంది. ఈ డిజాస్టర్ మూవీ రెండు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

వా వాతియార్ ఓటీటీ రిలీజ్ డేట్
కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్’ ఈ ఏడాది పెద్ద సంక్రాంతి సినిమాలతో పాటు జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు థియేటర్లలో విడుదలైన రెండు వారాల లోపే ఓటీటీలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. బుధవారం (జనవరి 28) నుంచి ఈ సినిమాను చేయనున్నట్లు ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా కార్తీ సినిమా అందుబాటులో ఉంటుంది.
కొత్త ఆలోచనతో వచ్చినప్పటికీ.. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ డిజిటల్ వేదికపై మాత్రం ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఓటీటీలోకి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
‘వా వాతియార్’ కథ ఏంటంటే?
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన తమిళ మూవీ ‘వా వాతియార్’ రాము (కార్తి పోషించిన పాత్ర) చుట్టూ తిరుగుతుంది. రాము తన తాతయ్య దగ్గర పెరుగుతాడు. అతడు అలనాటి దిగ్గజ నటుడు, రాజకీయ నాయకుడు ఎంజీఆర్ కు వీరాభిమాని. రాము కథ ద్వారా ఈ సినిమా ఆ మహానటుడికి నివాళి అర్పిస్తుంది.
తన మనవడికి, తన అభిమాన నటుడికి మధ్య ఏదో సంబంధం ఉందని తాతయ్య నమ్ముతుంటారు. పెరిగి పెద్దయ్యాక రాము పోలీస్ అవుతాడు కానీ, అతను నీతి నిజాయితీ లేని మార్గంలో నడుస్తుంటాడు. అయితే కొన్ని సంఘటనలు రాము తన పద్ధతులను మార్చుకునేలా చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరపై చూడాల్సిందే.
‘వా వాతియార్’లో కార్తీ హీరోగా నటించగా, రాజ్‌కిరణ్ అతని తాతయ్యగా కనిపించాడు. కృతి శెట్టి కథానాయికగా నటించింది. సీనియర్ నటులు సత్యరాజ్, నిళల్‌గల్ రవి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జి.ఎం. సుందర్, రమేష్ తిలక్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు.
ఇక కార్తీ రాబోయే సినిమాల విషయానికి వస్తే.. ‘సర్దార్ 2’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అలాగే ఇటీవల దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒక విషయాన్ని నిర్ధారించాడు. అల్లు అర్జున్ తో తాను చేయబోయే తెలుగు సినిమా పూర్తయిన తర్వాత.. కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా పనులు మొదలుపెడతానని అతడు చెప్పాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


