Karthika Deepam 2 Jyotsna: సీరియల్‌లో మిస్సింగ్-ఇన్‌స్టాలో కార్తీక దీపం 2 జ్యోత్స్న గ్లామర్ షో-బెంగగా ఉందన్న ఫ్యాన్స్!
Karthika Deepam 2 Jyotsna: బుల్లితెరపై దూసుకెళ్తున్న కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న కనిపించడం లేదు. గత రెండు మూడు ఎపిసోడ్లుగా ఆమె జాడ లేదు. కానీ ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్న గాయత్రి సింహాద్రి మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రచ్చ లేపుతోంది. దీంతో బెంగగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Karthika Deepam 2 Jyotsna: బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న మోస్ట్ పాపులర్ సీరియల్ కార్తీక దీపం 2. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కథ ప్రకారం కీలకమైన జ్యోత్స్న పాత్ర కొన్ని ఎపిసోడ్లుగా కనిపించడం లేదు. సూరజ్ పీఏగా అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్న జ్యోత్స్న సడన్‌గా మిస్ అవ్వడం, దీని వెనుక మాలిని హస్తం ఉందా అనే కోణంలో సీరియల్ స్టోరీ సాగుతోంది.

కార్తీక దీపం 2 జ్యోత్స్న
అయితే కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న ఆన్-స్క్రీన్ కథ ఇలా ఉంటే.. ఆఫ్-స్క్రీన్ (పర్సనల్ లైఫ్) లో మాత్రం ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్న బ్యూటీ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సీరియల్ లో విలన్ గా అదరగొట్టిన జ్యోత్స్న క్యారెక్టర్ ప్లే చేస్తున్న గాయత్రి సింహాద్రి.. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ వైరల్
జ్యోత్స్న పాత్రలో తన విలనిజంతో ఆకట్టుకుంటున్న నటి గాయత్రి సింహాద్రి (గాయత్రి మున్ని) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో కొన్ని అదిరిపోయే గ్లామర్ పిక్స్ పోస్ట్ చేసింది. చీరకట్టులోను, మోడరన్ లుక్స్‌లోనూ మెరిసిపోయే గాయత్రి.. తాజా ఫొటోల్లో చాలా స్టైలిష్‌గా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
సీరియల్ స్టోరీ
అయితే సీరియల్ అభిమానులు మాత్రం ఈ ఫొటోలను చూసి కార్తీక దీపం 2 స్టోరీతో లింక్ పెడుతూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. సీరియల్ లో కనిపించకుండా పోయిన జ్యోత్స్న ఎక్కడుందని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్నను మాలిని ఏమైనా చేసిందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
బెంగ పెట్టుకున్నాం జ్యో పాపా
ఈ గ్లామర్ ఫొటోల కింద నెటిజన్లు సీరియల్ డైలాగులతో రచ్చ చేస్తున్నారు. "జ్యోత్స్న అసలు నువ్వు ఎక్కడ ఉన్నావ్?", "నువ్వు సీరియల్‌లో లేకపోతే బోర్ కొడుతోంది.. నువ్వు లేక బెంగ పెట్టుకున్నాం" అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. సీరియల్‌లో కార్తీక్, దీపలతో మైండ్ గేమ్ ఆడుకున్న జ్యోత్స్న.. ఇప్పుడు మాలిని, సూరజ్ పై రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది.
ఇటు రియల్ లైఫ్‌లోనేమో గ్లామర్ పిక్స్ తో గాయత్రి సింహాద్రి నెటిజన్ల మైండ్స్ బ్లాక్ చేస్తోందంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. రీల్ లైఫ్‌లో విలన్‌గా విరుచుకుపడే ఈ కన్నడ బ్యూటీ.. రియల్ లైఫ్‌లో మాత్రం క్యూట్ అండ్ గ్లామరస్ లుక్స్‌తో సోషల్ మీడియా క్వీన్‌లా ట్రెండ్ అవుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


