Karthika Deepam 2: కార్తీక దీపం 2లో జ్యోత్స్న నిజంగానే మారిపోయిందా? నమ్మలేకపోతున్న ఆడియన్స్.. అంతా పెళ్లి కోసమేనా?

Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ లో ఇప్పుడు అసలైన మజా వస్తోంది. సూరజ్ తో పెళ్లి కోసం జ్యోత్స్న కంప్లీట్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది. విలనిజాన్ని పక్కనపెట్టేసింది. జ్యోత్స్నలో ఈ సడెన్ ఛేంజ్ పై ఆడియన్స్ రియాక్షన్ వైరల్ గా మారాయి. యూట్యూబ్ లో షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Published on: Aug 15, 2026, 21:51:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2: స్టార్ మాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీక దీపం 2 సీరియల్ రోజురోజుకో మలుపు తిరుగుతోంది. సీరియల్ రన్ లోనే అత్యంత కీలకమైన టర్న్ ఏంటీ అంటే.. విలన్ జ్యోత్స్నలో సంచలన మార్పు రావడమే. సైకో విలనిజంతో దీప అంతు చూసేదాకా వదలనని సవాలు చేసిన జ్యోత్స్న ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

కార్తీక దీపం 2లో జ్యోత్స్న నిజంగానే మారిపోయిందా? నమ్మలేకపోతున్న ఆడియన్స్.. అంతా పెళ్లి కోసమేనా? (jiohotstar)
కార్తీక దీపం 2లో జ్యోత్స్న నిజంగానే మారిపోయిందా? నమ్మలేకపోతున్న ఆడియన్స్.. అంతా పెళ్లి కోసమేనా? (jiohotstar)

జ్యోత్స్నలో మార్పు

కార్తీక దీపం 2 సీరియల్ అదిరిపోయే టర్న్ తీసుకుంది. సీరియల్ స్టార్టింగ్ నుంచి విలనిజంతో భయపెట్టిన జ్యోత్స్న ఒక్కసారిగా మారిపోయింది. తనలోని క్రూరత్వాన్ని పక్కనపెట్టి సౌమ్యంగా ప్రవర్తించడం మొదలెట్టింది. సైకో విలన్ ను దూరం పెట్టి.. పద్ధతి అయిన అమ్మాయిగా బిహేవ్ చేస్తోంది.

అందరూ షాక్

జ్యోత్స్న క్యారెక్టర్ లో వచ్చిన ఈ సడెన్ మార్పు చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు ఎలాంటి కుట్రలు చేయాలి, దీపను ఎలా చంపాలి, కార్తీక్ నుంచి దీపను ఎలా విడగొట్టాలి అని ప్లాన్ చేసిన జ్యోత్స్న.. ఇప్పుడు ఇలా మారిపోవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే జ్యో నిజంగానే మారిపోయిందా? లేకపోతే ఆస్తి కోసం కొత్త ప్లాన్ మొదలెట్టిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సూరజ్ తో లవ్

కార్తీక దీపం 2 సీరియల్ లోకి సూరజ్ ఎంట్రీ అప్పటి నుంచి కథ రసవత్తరంగా మారింది. జ్యోత్స్నను సూరజ్ ప్రేమిస్తున్నాడు. అయితే సూరజ్ ఏమో మాలిని కొడుకు అనే టాక్ వినిపిస్తోంది. మాలిని పక్కా ప్లాన్ ప్రకారమే శివ నాారాయణపై పగ తీర్చుకోవడానికి సూరజ్ ను రంగంలోకి దింపిందనే కామెంట్లు వస్తున్నాయి.

ఇక జ్యోత్స్న ఏమో మెల్లగా సూరజ్ ను ప్రేమించడం మొదలెట్టింది. అందుకే తన మనసులో ఉన్న కార్తీక్ ను కూడా డిలీట్ చేసేసింది. సూరజ్ ను ఇంప్రెస్ చేస్తోంది. దక్షిణామూర్తి, మాలిని ముందు సూరజ్ గురించి గొప్పగా చెప్పింది జ్యోత్స్న.

నిజంగానే మారిందా?

కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న క్యారెక్టర్ లో వచ్చిన సడెన్ ఛేంజ్ పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. యూట్యూబ్ లో కార్తీక దీపం 2 సీరియల్ ప్రోమో కింద కామెంట్లలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

‘‘సూరజ్ వచ్చిన తర్వాత జ్యోత్స్నలో చాలా మార్పు వచ్చింది’’, ‘‘మనిషిని మార్చే శక్తి ప్రేమకు ఉంది’’, ‘‘ఇప్పుడు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది’’ అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

మరికొంతమంది మాత్రం జ్యోత్స్న మారదని అంటున్నారు. ‘‘జ్యోత్స్న మారిందంటే నమ్మాలనిపించడం లేదు. పెళ్లి కాకపోతే ఆస్తి రాదని ఇలా చేస్తుందేమో. లేదంటే పెద్ద ప్లాన్ ఉండాలి’’, ‘‘పెళ్లి కోసం జ్యోత్స్న యాక్టింగ్ చేస్తుంది. చూసేవాళ్లే పిచ్చోళ్లు’’ అని కామెంట్లు చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More