చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2- కథ మళ్లీ మొదటికే- జ్యోత్స్నలోని విలన్ మళ్లీ బయటకొస్తుందా? మాలిని చంపేస్తుందా?
Karthika Deepam 2 Serial: బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది ‘కార్తీక దీపం 2’ సీరియల్. అదిరిపోయే రివేంజ్ డ్రామాతో, అదుర్స్ అనిపించే ట్విస్టులతో కార్తీక దీపం 2 సీరియల్ అదరగొడుతోంది. తాజాగా ఈ సీరియల్ లోని డ్రామా ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తోంది.
Karthika Deepam 2 Serial: స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ కు తెలుగు జనాలు జై కొడుతున్నారు. రివేంజ్ డ్రామాగా కొనసాగుతున్న ఈ సీరియల్ స్టోరీ ఇప్పుడు ఆడియన్స్ ను బాగా అలరిస్తోంది. తాజాగా ఈ సీరియల్ లో జ్యోత్స్న విలనిజం మరోసారి బయటకు వచ్చేలా కనిపిస్తోంది.

రివేంజ్ డ్రామాగా కార్తీక దీపం 2
కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పుడు రివేంజ్ డ్రామాగా మారింది. శివ నారాయణ కుటుంబం పతనం కోసం మాలిని కుట్రల మీద కుట్రలు పన్నుతోంది. జ్యోత్స్నను ప్రేమ పేరుతో మోసం చేసేలా తన కొడుకును ఉసిగొల్పింది. ఇప్పుడేమో జ్యోత్స్న క్యారెక్టర్ పై పెద్ద నింద వేసి సూరజ్ మనసులో నుంచి తనను తీసేసేలా ప్లాన్ వేసింది.
జ్యోత్స్న వార్నింగ్
ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేసిన, తన ప్రేమను దూరం చేసిన, తమను రోడ్డుకు ఈడ్చిన మాలినిపై రివేంజ్ తీర్చుకోవడానికి జ్యోత్స్న రెడీ అయింది. సూరజ్ ను పెళ్లి చేసుకుని తీరుతానని మాలినికి ఓపెన్ ఛాలెంజ్ చేసింది. తనలోని విలనిజాన్ని చూపిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది.
మాలినికి షాక్ తప్పదా?
కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న అంటే ఒకప్పుడు కరుడుగట్టిన విలన్. ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా కార్తీక్, దీపను ముప్పుతిప్పలు పెట్టింది. కానీ సూరజ్ తో ప్రేమలో పడ్డాక జ్యో పూర్తిగా మారిపోయింది. తనలోని విలన్ ను సమాధి చేసింది. కానీ ఇప్పుడు ఆ సూరజ్ దక్కకుండా కుట్రలు చేస్తున్న మాలినిని దెబ్బ కొట్టేందుకు జ్యో మళ్లీ విలన్ గా మారబోతుంది. దీంతో మాలినికి ఇక వరుస షాక్ లు తప్పవనిపిస్తోంది.
జ్యోను చంపేస్తుందా?
తన కొడుకు జీవితంలో నుంచి జ్యోత్స్నను తప్పించేందుకు మాలిని ఎన్నో కన్నింగ్ ప్లాన్స్ వేస్తుంది. ఇప్పటికే ఓ సారి తన బాడీగార్డును జ్యోను మాయం చేయించింది. కానీ జ్యోత్స్న కోసం సూరజ్ రంగంలోకి దిగడంతో చివరకు విడిచి పెట్టింది.
కానీ ఇప్పుడు మాలినికి జ్యోత్స్న ఛాలెంజ్ చేసింది. మరోవైపు తల్లి మాయ మాటలను గుడ్డిగా నమ్మిన సూరజ్ ఏమో జ్యోత్స్నను తన మనసులో నుంచి తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో జ్యోత్స్నను హత్య చేయించాలని మాలిని తెగించింది. జ్యోత్స్నను చంపడం మూడో కంటికి తెలియకుండా కుట్ర కూడా పన్నింది.
నెక్స్ట్ ఏంటీ?
జ్యోత్స్న, మాలిని మధ్య వార్ తో కార్తీక దీపం 2 సీరియల్ స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. మాలిని గురించి సూరజ్ కు నిజం తెలిసేలా జ్యో ఎలాంటి ప్లాన్స్ వేయబోతుందనే క్యూరియాసిటీ నెలకొంది. మరోవైపు జ్యోత్స్నను చంపేయమని చెప్పిన మాలిని ఎంతవరకు తెగిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. మరి కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే.

E-Paper
