Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-కార్తీక్ నీ కొడుకేనా? మంట పెట్టిన మాలిని-తండ్రీకొడుకుల సవాల్-జ్యో ఐడియా!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 5 ఎపిసోడ్ లో కాంచన ఇంటికి వచ్చిన మాలిని రచ్చ చేస్తుంది. కార్తీక్ అసలు నీ కొడుకేనా? అని శ్రీధర్ ను అవమానిస్తుంది. తన కొడుకు వెంట జ్యో పడుతుందని అబద్ధాలు చెప్తుంది. దీంతో మాలినికి షాకివ్వాలని కార్తీక్, దీప, జ్యో అనుకుంటారు. 

Published on: Nov 5, 2026, 06:55:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కాంచన ఇంటికి వచ్చిన మాలిని శ్రీధర్ ను అవమానించేలా మాట్లాడుతూ మరో పెంట పెడుతుంది. అసలు మీకు సిగ్గుందా? రెండు పూటల భోజనం ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదని మాలిని అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

కార్తీక్ నీ కన్నకొడుకేనా?

ఏం చెప్పాలనుకుంటున్నావ్ మాలిని అని శ్రీధర్ అడుగుతాడు. నీకేం తక్కువా? కార్తీక్ నీ కన్నకొడుకా? లేదా ఏ బస్టాండ్ లో అయినా దొరికాడా? కన్న కొడుకే అయి ఉంటే ఇంకొకరి కాళ్ల దగ్గర పని చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వొక అసమర్థపు తండ్రివి అని మాలిని అంటుంది.

కార్తీక్ సీరియస్

పిన్ని నువ్వు ముందు లే, బయటకు వెళ్లు అని కార్తీక్ ఫైర్ అవుతాడు. అనవసరంగా వేరేవాళ్లతో మాటలు పడాల్సిన అవసరం లేదని కార్తీక్ ఫుల్ సీరియస్ అవుతాడు. కార్తీక్ నువ్వు ఇక్కడే ఉండు, కానీ మాట్లాడితే నా మీద ఒట్టే అని శ్రీధర్ షాక్ ఇస్తాడు. మాలిని మాటలు వినాలి. నాకు ఓపిక ఎక్కువ అని శ్రీధర్ చెప్తాడు.

నువ్వేం తండ్రివి?

నీ కొడుకు నీ మాట వినడం లేదా? నా కొడుకు అయితే గీసిన గీత దాటడు అని మాలిని అంటుంది. నీ కొడుకుతో నా కొడుకును పోల్చకు మాలిని. వాడిది తల్లి పోలిక. శత్రువులు కూడా బాగుండాలని వాడు కోరుకుంటాడని శ్రీధర్ కౌంటర్ ఇస్తాడు. కొడుకు జీవితానికి న్యాయం చేయలేని వాడివి నువ్వేం తండ్రివి? కొడుకు అన్ని మాటలు పడుతుంటే ఎందుకు చూస్తున్నావ్? కోడలు కడుపుతో ఉంది అని మాలిని అంటుంది.

దోషులుగా కార్తీక్, దీప

ఈ రోజు ఓ ఆర్డర్ విషయంలో కార్తీక్, దీప దోషులుగా నిలబడ్డారు. చివరకు ఆ తప్పునకు కారణమైన వాళ్లు ఆఫీసులో నుంచి వెళ్లిపోయారు. కానీ దీపదే తప్పు. నీ ప్లేసులో నేను ఉండి ఉంటే వాడితో రెస్టారెంట్ పెట్టించేవాడిని. నీ కర్మకు నువ్వు బతుకు అని వదిలేసేవాడిని కాదు అని శ్రీధర్ తో మాలిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో ఆవేశం కట్టులు తెంచుకోవడంతో కార్తీక్ గాజు వస్తువు విసిరేస్తాడు.

మీ చిన్న ఫ్యామిలీ బాగుంటే చాలా? ఇది మీ ఫ్యామిలీ కాదా? ఈ కుటుంబం కోసం ఏం చేశారు? అని మాలిని అంటూనే ఉంటుంది. మధ్యలో కాంచన జోక్యం చేసుకుంటే.. శ్రీధర్ నీ భర్త అని చెప్పు ఆపేస్తానని మాలిని షాక్ ఇస్తుంది. దీంతో కాంచన, శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకుంటారు.

నా కొడుకు కోసమే

నువ్వు నీ కూతురిని నా కొడుకు కోసమే ఆఫీస్ కు పంపిస్తున్నావని తెలిసింది. నువ్వు పెట్టిన క్యారేజీ నా కొడుకు, నీ కూతురు కలిసి తిన్నారని సుమిత్రకు మాలిని షాకిస్తుంది. అవును మమ్మీ కలిసే తిన్నామని జ్యోత్స్న చెప్తుంది. అసలు నువ్వు మనిషివేనా అత్త? జ్యోత్స్న క్యారేజీ అని తెలియక సూరజ్ తిన్నాడు. మధ్యలో ఆపడం ఎందుకని వదిలేశామని దీప చెప్తుంది.

జ్యోత్స్నకు పెళ్లి చేయ్

వెంటనే జ్యోత్స్న ఫైర్ అవుతుంది. నాపై మమ్మీ, డాడీకి నమ్మకం ఉందని జ్యో అంటుంది. హే సుమిత్ర నువ్వే కావాలని నా కొడుకు కోసం నీ కూతురిని పంపిస్తున్నావా? ముందు దీనికి పెళ్లి చేయ్. నీకు చేతగాకపోతే నేను పెళ్లి చేస్తానని మాలిని రచ్చ చేస్తుంది. నా ఆస్తికి ఏకైక వారసుడు నా కొడుకు. అందుకే లైన్లో పెట్టమని మీ కూతురిని పంపిస్తున్నారా అని మాలిని అడుగుతుంది.

నేను ఫైటర్ ను

తాత, సూరజ్ కు కాల్ చేస్తానని జ్యో అనడంతో మాలిని వెళ్లిపోతుంది. నేను జాబ్ మానేస్తే మాలిని వేసిన నింద నిజం అవుతుంది. చిన్న గొడవను బూతద్దంలో చూపించి మాలిని అత్త రచ్చ చేసింది. పోలీస్ స్టేషన్లో కేసు అలాగే ఉంది. అందుకే ఈ పాయింట్లు మాట్లాడుతుంది. నేను ఆఫీసుకు వెళ్లడం మానేస్తే మాలిని అత్త గెలిచినట్లు. అదే జరిగితే మనకు ఏం చేతకాదని ఒప్పుకున్నట్లే. నేను లూజర్ ను కాదు ఫైటర్ ను. నన్ను ఫైట్ చేయనివ్వండని జ్యోత్స్న గట్టిగా చెప్తుంది.

తండ్రీకొడుకుల సవాల్

ఇక కోపంతో ఊగిపోతున్న కార్తీక్ తో శ్రీధర్ మాట్లాడతాడు. నేను తప్పు చేశా. నేను ఓడిపోయిన తండ్రినే. కానీ నువ్వు గెలిపించాలి. నువ్వు, దీప మాలిని ఆఫీసుకు వెళ్లకూడదు. నీకో కొత్త రెస్టారెంట్ పెట్టిస్తానని శ్రీధర్ చెప్తాడు. అందుకు ఒప్పుకోను. మేం వెళ్లడం మానేస్తే ఓడిపోయినట్లే. అక్కడ పని చేయడానికి మాకు కారణాలు ఉన్నాయి. యుద్ధం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఆపలేమని కార్తీక్ చెప్తాడు.

నేను మిమ్మల్ని ఆపుతా. నిన్ను మాలిని ఆఫీసు నుంచి బయటకు రప్పిస్తా. ఇప్పుడు ఆటలోకి దిగేశానని శ్రీధర్ కొడుక్కే సవాలు విసురుతాడు. తమను వదిలేయ్యాలని కార్తీక్ చెప్తాడు. ఇక మాలిని గురించి దీప, జ్యోత్స్న డిస్కస్ చేసుకుంటారు. ఎక్కడ సూరజ్ తో మూడు ముళ్లు వేయించుకుంటావోనని మాలిని భయపడుతుందని దీప చెప్తుంది.

జ్యో ఐడియా

మాలిని గీసిన గీతను సూరజ్ దాటేలా చేయాలి. తల్లి గురించి పూర్తిగా తెలిసేలా చేయాలి. బలమైన ఆధారం ఉంటే సూరజ్ ను నమ్మించొచ్చు. మట్టి మన చేతులకు అంటకూడదని కార్తీక్ చెప్తాడు. నా దగ్గర ఓ ఐడియా ఉంది బావ అని జ్యోత్స్న చెప్తుంది. ఇదే ఐడియాను అమలు చేద్దామని కార్తీక్ అంటాడు. మాలినికి చుక్కలు చూపించాలని ముగ్గురూ అనుకుంటారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More