Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. వంటలక్కనా మజాకా-దీప దెబ్బకు వణికిపోయిన మాలిని-సుమిత్రను చూసి దశరథ షాక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 3 ఎపిసోడ్ లో వంటలక్క అదరగొడుతుంది. స్పెషల్ బిర్యానీతో మాలిని, సూరజ్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది దీప. ఇక కుట్రకు కారణమైన వాళ్లను కార్తీక్ కనిపెట్టడంతో మాలిని వణికిపోతుంది. మరోవైపు సుమిత్రను వంట మనిషిగా చూసి దశరథ షాక్ అవుతాడు.

Published on: Nov 3, 2026, 07:05:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. నాసిరకం సరుకులతో జ్యోత్స్న రెస్టారెంట్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని మాలిని కుట్ర పన్నుతోంది. కానీ అలా జరగకుండా సీఈఓ దీప బాధ్యత తీసుకుంటుంది. ఆర్డర్ తాను డెలివరీ చేస్తానంటుంది. తానే వంట చేస్తానని సూరజ్ కు చెప్తుంది.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

దీప వంట

సీఈఓ గారు ఇది మీ ఇంట్లో నలుగురికి వంట చేయడం కాదని సూరజ్ సెటైర్ వేస్తాడు. నేను చేయాలనుకుంటే వెయ్యి కాదు పది వేలు అయినా ఓకేనని దీప నమ్మకంతో చెప్తుంది. నేను వెంటనే క్వాలిటీ మెటీరియల్ తెప్పిస్తా. నాతో పాటు వంట చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని దీప అడిగితే ఎవరూ చప్పుడు చేయరు. అప్పుడు కార్తీక్, జ్యోత్స్న మేమున్నామని అంటారు. ఆ వెంటనే స్టాఫ్ కూడా మేమున్నామని అరుస్తారు.

సుమిత్రను చూసిన దశరథ

మరోవైపు ట్యూషన్ చెప్పేందుకు పార్వతి ఇంటికి దశరథ వెళ్తాడు. పిల్లలకు దశరథ పాఠాలు చెప్తుంటాడు. అప్పుడే సుమిత్ర కాఫీ తీసుకొని వస్తుంది. అక్కడ దశరథ, సుమిత్ర ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. ఈవిడ మా వంట మనిషి అని సుమిత్రను దశరథకు ఆ ఇంటి ఓనర్ పరిచయం చేస్తాడు. వణుకుతున్న చేతులతో దశరథ కాఫీ తీసుకుంటాడు.

ఈవిడ మీకు ముందే తెలుసా అని ఓనర్ అడిగితే తెలుసని దశరథ అంటాడు. కానీ ఈ మాస్టారు ఇంతకుముందు వేరే ఇంట్లో ట్యూషన్ చెప్పేవాళ్లు, అక్కడ తనకు తెలుసని సుమిత్ర అబద్ధం చెప్తుంది.

మాలిని ఆవేశం

ఇటు మాలిని ఆవేశంగా వస్తుంది. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు. మీరు ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నామనుకుంటున్నారా? లేక కంపెనీ మీదే అనుకుంటున్నారా? అని మాలిని అడుగుతుంది. అమ్మా, నువ్వు వాళ్లను ఏమనకు. ఏదైనా తేడా వస్తే కంపెనీ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటానని సూరజ్ చెప్తాడు.

స్పెషల్ బిర్యానీ

అప్పుడే ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి నుంచి కాల్ వస్తే కార్తీక్ మాట్లాడతాడు. మటన్ బిర్యానీ ప్లేస్ లో స్పెషల్ బిర్యానీ పంపిస్తామని కార్తీక్ చెప్తే ఆ పొలిటీషియన్ సరేనంటాడు. జ్యోత్స్న కూరగాయలు కట్ చేస్తుంది. సూరజ్ కూడా ఆప్రాన్ వేసుకొని రావడం చూసి జ్యో షాక్ అవుతుంది. మాలినికి అయితే ఫ్యూజులు ఔట్ అవుతాయి. సూరజ్ ఏంట్రా ఇది అని మాలిని ఆశ్చర్యపోయి అడుగుతుంది. కోపంతో మాలిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీప వంట కంప్లీట్ చేస్తుంది.

సీఈఓ పోస్టుకు రిజైన్ చేయ్

కానీ ఆఫీసులో మాలిని పెంట పెడుతుంది. దీపపై ఫైర్ అవుతుంది. సరుకు క్వాలిటీ చెక్ చేయకుండా లాస్ట్ మినిట్ లో వచ్చి ఫుడ్ ఆర్డర్ ఆపేశావ్. ఎవరికి నష్టం? చివరకు మీ ఛైర్మన్ చేత కూడా వంటలు చేయించారు? నా కొడుకు ఎందుక చేయాలి? నా కొడుకు సాయం చేస్తే కానీ ఫుడ్ డెలివరీ ఇవ్వలేని చెత్త మేనేజ్ మెంట్ చేసింది దీప అని మాలిని మండిపడుతుంది.

దీపకు ఏం చేతకాదని మరోసారి రుజువు చేసింది. ఫుడ్ ఆర్డర్ డెలివరీ అయింది. కానీ నష్టం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. దీపను సీఈఓగా భరించడం కంపెనీ వల్ల కాదు. సీఈఓ పోస్టుకు రిజైన్ చేయమని మాలిని అంటుంది. సూరజ్ కూడా అదే అంటాడు. జ్యోత్స్న జోక్యం చేసుకుంటుంటే.. నువ్వు పీఏవి పీఏలాగే ఉండమని సూరజ్ కోప్పడతాడు.

సూరజ్ టెన్షన్

బాధ్యత లేనివాళ్లు కంపెనీకి అవసరం లేదు. వాళ్లను వదిలించుకుంటూనే మంచిది. తప్పంతా నీదే వదిన. ఇదంతా చూసుకోకుండా ఏం చేస్తున్నారు? మటన్ బిర్యానీ బదులు స్పెషల్ బిర్యానీ పంపించారు. అది వాళ్లు తిన్నారో, డ్రైనేజీలో పడేశారో అని సూరజ్ అంటాడు. అప్పుడే కస్టమర్ నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే బూతులు వినిపిస్తాయని సూరజ్ టెన్షన్ పడతాడు.

భోజనం కాదు అమృతం

కానీ.. ఫుడ్ అందరం తిన్నాం. దాన్ని ఎవరైనా భోజనం అంటారా? అమృతం అంటారు బాబు అని ఆ పొలిటీషియన్ అనగానే మాలిని, సూరజ్ కు దిమ్మ తిరుగుతుంది. ఫుడ్ అదిరిపోయింది. మా వాళ్లు లొట్టలేసుకుంటూ తింటున్నారని కస్టమర్ చెప్తాడు. వంటలు అదరగొట్టారని కార్తీక్ తో కూడా అంటాడు. ఆ స్పెషల్ బిర్యానీ మటన్ బిర్యానీ కంటే బ్రహ్మాండంగా ఉందంటాడు.

రేయ్ బాబు నీ పేరేంటో నాకు తెలియదు కానీ శివ నారాయణ పరువు నిలబెట్టారు. జ్యోత్స్న రెస్టారెంట్ దమ్ము ఏంటో చూపించారని పొలిటీషియన్ అనగానే సూరజ్ షాక్ అవుతాడు.

వణికిపోయిన మాలిని

ఈ గుంపులో ఓ గొర్రె దూరింది. బాబూ బ్లాక్ షీప్ అని మేనేజర్ వంశీని కార్తీక్ పిలుస్తాడు. సరుకులు కొన్నది ఎవరు? అని కార్తీక్ గట్టిగా అడిగేసరికి తానే కొన్నానని వంశీ చెప్తాడు. నాసిరకం సరుకులు కొనమన్నది ఎవరు అని వంశీ కాలర్ పట్టుకుంటాడు కార్తీక్. దీంతో తన పేరు చెప్తాడేమోనని మాలిని వణికి పోతుంది.

వంశీని చెంపపై కొడుతుంది మాలిని. నమ్మించి మోసం చేశావ్ కదరా. వీడిని బయటకు గెంటేయ్ మని మాలిని అరుస్తుంది. దీంతో మాలిని తప్పించుకుంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More