Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..లవ్యూ చెప్పిన జ్యో-మాలిని షాక్-భార్యాభర్తలుగా-దత్తత తల్లి మాలిని
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్లో మాలినితో జ్యోత్స్న ఆటాడుకుంటుంది. సూరజ్ మనసులో తానే ఉన్నానని అంటుంది. సూరజ్ దిండు కింద తన ఫొటోను చూస్తుంది. మరోవైపు ఆఫీసులో జ్యోత్స్న, సూరజ్ భార్యాభర్తలంటూ ఓ వ్యక్తి హడావుడి చేస్తాడు. మాలినిని దత్తత తల్లి అని అంటాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మాలిని ఇంటికి వెళ్లిన జ్యోత్స్న దిమ్మతిరిగే షాకిస్తుంది. అసలు మీరు మా ఇంటికి ఎప్పుడు వచ్చారని ఏమీ తెలియనట్లే మాట్లాడుతుంది. నాకు అర్థమైంది. సుమిత్రకు ఒకరే కూతురు. కాకపోతే డబుల్ యాక్షన్ అని మాలిని అంటుంది.

జ్యోత్స్న కౌంటర్
బాస్ ఆఫీసుకు రాకపోతే ఫైల్స్ టేబుల్ మీద పెట్టాలని జ్యోత్స్నకు సూరజ్ చెప్తాడు. చేతులో పెట్టాలన్నారు కదా సార్ అని జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. తనేదో ఫ్లోలో అన్నానని సూరజ్ అంటే.. సీరియస్ గా తీసుకున్నానని జ్యో చెప్తుంది. జ్యోను సూరజ్ వెళ్లిపొమ్మంటాడు.
లవ్యూ చెప్పిన జ్యో
కానీ జ్యోత్స్నను దక్షిణామూర్తి ఆపుతాడు. టిఫిన్ చేయమంటాడు. సూరజ్ కూడా చిరాకుగా తినమంటాడు. దీంతో జ్యోత్స్న లవ్యూ అని చెప్పడంతో మాలిని షాక్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో థ్యాంక్ యూకు బదులుగా లవ్యూ వాడుతున్నారని జ్యోత్స్న చెప్తుంది. ఒక పీఏని ఇంటికి రానివ్వడమే ఎక్కువ అనుకుంటే, ఆ పీఏను పక్కన కూర్చోబెట్టుకుని టిఫిన్ పెడుతున్నారని జ్యో అంటుంది.
పీఏ అంటే
జ్యోత్స్న పదే పదే పీఏ అనడంతో మాలినికి చిర్రెత్తుకొస్తుంది. పీఏ అంటే సూరజ్ ప్రేమించిన అమ్మాయి అని గతంలో జ్యోత్స్న చెప్పిన అర్థాన్ని గుర్తు చేసుకుని మాలిని రగిలిపోతుంది. పీఏ అంటే వేరే అర్థం ఏంటీ అని దక్షిణామూర్తి అడిగినా మాలిని బయటకు చెప్పలేకపోతుంది. టిఫిన్ తిన్నాక జ్యోత్స్న కూడా సూరజ్ తో పాటు ఆఫీసుకు వెళ్తుందని దక్షిణామూర్తి చెప్పడంతో మాలిని మళ్లీ షాక్ అవుతుంది.
ఈయన ఏంటీ మనవరాలిపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు? దండ పడాల్సింది నీ కొడుకు ఫొటోకు కాదు మామయ్య, నీ ఫొటోకు అని మాలిని అనుకుంటుంది.
సూరజ్ ను ప్రేమిస్తున్నావ్ కదా
సూరజ్ పేపర్లు విసిరికొట్టినప్పుడు బాధపడ్డావా అని జ్యోత్స్నను దక్షిణామూర్తి అడుగుతాడు. ఆ బాధను చెప్పలేమని జ్యో అంటుంది. ఇక పీఏ అంటే ఏంటో చెప్పమని దక్షిణామూర్తి అడుగుతాడు. కానీ జ్యో సిగ్గుపడుతుంది. నీకు సూరజ్ అంటే చాలా ఇష్టం కదా. ఇప్పటికీ వాడిని ప్రేమిస్తున్నావ్ కదా. సూరజ్ కు కూడా నువ్వంటే చాలా ప్రేమ. కానీ ఇద్దరూ బయటపెట్టరని దక్షిణామూర్తి అంటాడు.
అది నా వస్తువు
సూరజ్ ఫోన్ రింగ్ అవుతే.. రూమ్ కు వెళ్లి ఇవ్వమని జ్యోను ఫోర్స్ చేస్తాడు దక్షిణామూర్తి. సూరజ్ గదిలోకి వెళ్లిన జ్యో అతని పర్స్ లో తన ఫొటో ఉందో లేదో అని చూస్తుంది. కానీ దిండు కింద ఉంటుంది. అప్పుడే సూరజ్ వచ్చి ఆ ఫొటో లాక్కుంటాడు. నా ఫొటో ఎందుకు పెట్టుకున్నావ్ అని జ్యో అడిగితే.. అది నా వస్తువు అని సూరజ్ అంటాడు.
నేను నీ బుర్రలో ఉన్నా
ఒకరి మనసులో ఒకరు ఉన్నారని జ్యోత్స్న, సూరజ్ ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటారు. నా ఇష్టం, నీ ఇష్టం అని సూరజ్ తెలివిగా మాట్లాడతాడు. ఈ ఫొటో మా అమ్మ చూసింది. అయినా నాకు భయం లేదని సూరజ్ అంటాడు. ఈ సమయంలోనే కార్తీక్ ను జ్యోత్స్న లవ్ చేసిందని సూరజ్ అన్న మాటలను జ్యో గుర్తు చేస్తుంది. నీ లోపల ఉంది ఇది కాదని అంటుంది.
నీ కళ్ల వెనుక కన్నీటి సంద్రం ఉంది. దాని ఘోష నేను విన్నా. నీ పంతం వెనుక నీ ప్రేమను చూశా. నీ తిరస్కారం వెనుక అంతర్మథనం చూశా. ఫొటోతో మనుషులకు జ్ణాపకాలు ఉంటాయి. నన్ను నువ్వు నీలో దాచుకున్నావు. నీ మనసు అనే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ఆడదాని పేరు జ్యోత్స్న. నేను నీ బుర్రలో ఉన్నా. నీ మనసులో కూడా ఉన్నా అని జ్యోత్స్న హార్ట్ టచింగ్ గా మాట్లాడి కిందకు వెళ్లిపోతుంది.
సూరజ్, జ్యో పెళ్లి
మరోవైపు ఆఫీసుకు వచ్చిన ఓ పొలిటికల్ లీడర్ శివ నారాయణ గురించి అడుగుతాడు. కానీ మాలిని ఏమో ఇది తన ఆఫీస్ అని చెప్తుంది. అప్పుడే జ్యోత్స్న, సూరజ్ వస్తారు. నువ్వు శివ నారాయణ మనవరాలివే కదా. ఈ అబ్బాయే కదా మీ ఆయన అని సూరజ్ ను చూపిస్తూ ఆ వ్యక్తి అంటాడు. మీ పెళ్లికి పిలిచారు. కానీ సింగపూర్ వెళ్లడంతో రాలేకపోయా. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ను అని ఆయన చెప్తాడు.
సూరజ్ కు మంచి గిఫ్ట్ కొనుక్కోమని ఆయన డబ్బు ఇస్తాడు. మీ పెళ్లి అయిన తర్వాత ఆస్తి మొత్తం మీ పేరున రాసి, ఛైర్మన్ ను చేశారా? మరి ఈవిడ ఏంటీ ఛైర్మన్ అమ్మను అని చెప్తుంది. ఓ దత్తత తీసుకున్నావా అని ఆ వ్యక్తి మాట్లాడుతూనే ఉంటాడు.
భార్యాభర్తలు
అప్పుడే కార్తీక్, దీప వస్తారు. హాయ్ బాబాయ్ అని ఆ వ్యక్తిని కార్తీక్ పలకరిస్తాడు. సూరజ్, జ్యోత్స్న భార్యాభర్తలు కదా. వాళ్లకు శివ నారాయణ ఆస్తి రాసిచ్చాడంటా కదా అని ఆ వ్యక్తి చెప్తాడు. పెళ్లి కొడుకు దత్తత తీసుకున్న అమ్మ ఎందుకు ఎక్కువ మాట్లాడుతుందని ఆయన కౌంటర్ వేస్తాడు.
ఇంట్లో ఫంక్షన్ ఉందని వెయ్యి మందికి క్యాటరింగ్ ఆర్డర్ ఇద్దామని వచ్చా. కానీ దత్తత తల్లిని చూశాక ఆర్డర్ ఇవ్వాలనుకోలేదు. కానీ ఇప్పుడు ఇస్తా. శివ నారాయణ దేవుడురా. పది మందికి పెట్టే చెయ్యి అది. ఏనాడూ ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా లాక్కోలేదని మాలినికి గట్టిగా తగిలేలా ఆ వ్యక్తి చెప్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


