Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యో ఎక్కడ- శివ నారాయణకు అవమానం- మాలినిపై పోలీస్ కేసు- చంపేయ్ సుమిత్ర!
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 14 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. జ్యోత్స్న ఎక్కడ ఉందో చెప్పమని సూరజ్ కాలర్ పట్టుకుంటాడు దశరథ. శివ నారాయణ చొక్కాను చించేసి దక్షిణామూర్తి రివేంజ్ తీర్చుకుంటాడు. మాలినిపై సుమిత్ర పోలీసు కేసు పెడుతుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శివ నారాయణ ఫ్యామిలీ మొత్తం వచ్చి అడిగినా జ్యోత్స్న ఎక్కడ ఉందో తనకు తెలియదని మాలిని అంటుంది. అంతే కాకుండా నా కొడుకు, మామయ్య నమ్మకపోతే తాను బతకడం వ్యర్థమని మాలిని ఎమోషనల్ డైలాగ్ లు పేల్చుతుంది.

నువ్వొక మనిషివా?
జ్యోత్స్న కనిపించకపోతే వెళ్లి వెతకండని మాలిని చెప్తుంది. అలా వెతుక్కుంటూనే వచ్చాం. ఎక్కడ నింద పడుతుందోనని మీరంతా కలిసి ఆడుతున్న డ్రామా ఇది శివ నారాయణ ఫైర్ అవుతాడు. నువ్వొక మనిషివి, నీదొక బతుకు. ప్రేమ పేరుతో నా మనవరాలితో ఆడుకున్నావ్. మోసం చేస్తే వదిలేశామని, ఇప్పుడు మనిషినే లేకుండా చేస్తే వదిలేస్తామనుకున్నావా అని సూరజ్ పై శివ నారాయణ మండిపడతాడు.
శివ నారాయణ ఆవేశం
ఏంటి బాబాయి బెదిరిస్తున్నావా? అని మాలిని అడుగుతుంది. ఇది బెదిరింపు కాదు తెగింపు. తెగించడానికే వచ్చానని శివ నారాయణ ఆవేశంతో ఊగిపోతావు. ఇక తన మనవరాలు, కూతురిని పని చేయించావని శివ నారాయణపై దక్షిణామూర్తి రివక్స్ ఎటాక్ చేస్తాడు. నా మనవరాలిని దగ్గర చేసుకోవాలనే నా ఆఫీసులో కావాలని జాబ్ ఇచ్చానని దక్షిణామూర్తి చెప్తాడు.
దీప ప్రశ్నలు
అసలు నీకు ఆ అర్హత ఉందా? జ్యోత్స్న ఎప్పుడైనా నిన్ను తాతగా గుర్తించిందా? అని శివ నారాయణ అడుగుతాడు. నువ్వు ఏం చేయకపోతే జ్యోత్స్న ఏమైపోయింది? జ్యోత్స్న నా సొంత చెల్లెనే. మేం ఒక్క కడుపున పుట్టకపోయినా ఒకే తల్లి ప్రేమను పొందామని మాలినిని దీప గట్టిగా అడుగుతుంది. జ్యోత్స్న మనసులో సూరజ్ ఉంటే.. దాని మనసు ఉండదు, మనిషి ఉండదు అని నువ్వు అన్నావ్ కదా అని మాలినికి కార్తీక్ గుర్తు చేస్తాడు.
జ్యోత్స్నను చంపేశారా?
నా మనవరాలు కనిపించడం లేదని నాక్కూడా బాధగా ఉందని దక్షిణామూర్తి ఫీల్ అవుతాడు. మీ ముగ్గురు కలిసే నా కూతురిని ఏదో చేశారు. నీకు జ్యోత్స్న ఎక్కడ ఉందో తెలుసు నాన్న. మీరందరూ కలిసే తనను ఎక్కడో దాచేశారు. అసలు అది బతికుందా లేదా చంపేశారా? అని సుమిత్ర ఏడుస్తుంది. మనుషుల ప్రాణాలు తీసేవాళ్లు ఈ ఇంట్లో ఎవరూ లేరత్తా అని సూరజ్ అంటాడు.
సూరజ్ కాలర్ పట్టుకున్న దశరథ
నువ్వు, మీ అమ్మ, మీ తాత అలాంటివాళ్లే. అప్పుడు నన్ను చంపాలనుకున్నారు. ఇప్పుడు నా కూతురిని మాయం చేశారు. నా కూతురిని ఏం చేశారని సూరజ్ కాలర్ పట్టుకుంటాడు దశరథ. మాలినిని సుమిత్ర పక్కకు నెట్టేస్తుంది. దక్షిణామూర్తి మధ్యలోకి వచ్చి దశరథ, సూరజ్ ను విడదీస్తాడు. మీరంతా తోడు దొంగలు, మనుషులే కాదని శివ నారాయణ అనగానే.. దక్షిణామూర్తి కాలర్ పట్టుకుంటాడు.
శివ నారాయణకు అవమానం
శివ నారాయణ, దక్షిణామూర్తి ఇద్దరూ పెనుగులాడుతారు. ఈ సారి శివ నారాయణ చొక్కాను దక్షిణామూర్తి చించేస్తాడు. ఇదిరా విధిరాత అంటే. ఆ రోజు ఇంటికి వస్తే నన్ను అవమానించావు కదా. అదే అవమానం నా ఇంటి దగ్గర నీకు జరిగింది. పోరా అని దక్షిణామూర్తి చిరిగిన చొక్కాను విసిరిగొడతాడు.
జ్యోత్స్న కనిపించలేదంటే అది మీ చేతగానితనం. నువ్వే ఏమైనా చేసి ఆ నింద నా మీద వేస్తున్నావని దక్షిణామూర్తి అంటాడు. ఇదిగో దశరథ వెయ్యి రూపాయలు అని దశరథ జేబులో డబ్బు పెడతాడు దక్షిణామూర్తి. అసలే పేదరికంలో ఉన్నారు. మీ నాన్న చొక్కా కొనుక్కోగలడో లేదోనని దక్షిణామూర్తి మరింత అవమానిస్తాడు.
దశరథ కాలమే అన్నింటికీ సమాధానం ఇస్తుంది. ఆ డబ్బులు అలాగే ఉంచు. ఏది ఎలా ఇవ్వాలో నాకు తెలుసని శివ నారాయణ అంటాడు. పోయి మనవరాలిని వెతుక్కో అని దక్షిణామూర్తి లోపలికిి వెళ్లిపోతాడు. శివ నారాయణ ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మాలినిపై పోలీసు కేసు
ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ కార్తీక్, దీపపై దశరథ నిందలు వేస్తాడు. జ్యోత్స్న వచ్చి నిజం చెప్పేంతవరకూ ఎవరూ దోషి కాదు. దక్షిణామూర్తి మాటలు విన్నాక కూడా మనం వీళ్లను తప్పు పడితే మూర్ఖులం అవుతామని శివ నారాయణ చెప్తాడు. జ్యోత్స్న ఎక్కడుందో సూరజ్ వాళ్లకు తెలిసి నాటకాలు ఆడుతున్నారని దశరథ అంటాడు. మాలిని కుటుంబంపై పోలీసు కేసు పెడదాం. వాళ్లు యుద్ధమే కోరుకుంటున్నారు. మనం అదే చేద్దామని శివ నారాయణ సై అంటాడు.
ముందు జ్యోత్స్న మన ఇంటికి రావాలి. ఆ తర్వాత అసలైన యుద్ధం మొదలవుతుందని శివ నారాయణ చిటికెలు వేస్తూ ఆవేశపడతాడు. అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్తారు.
అనుమానం ఉందా?
మరోవైపు సూరజ్ ను మాలిని ప్రశ్నిస్తుంది. వాళ్లు అన్ని మాటలు అంటుంటే మా అమ్మ ఏ తప్పు చేయలేదని ఎందుకు బలంగా చెప్పలేకపోయావ్? ఇంకా నీకు నా మీద అనుమానంగా ఉందా? అని మాలిని అడుగుతుంది. నాకు అనుమానం లేదు. అదే మాట చెప్పా. అంతే కాదు మర్చిపోలేని సన్మానం కూడా చేశానని దక్షిణామూర్తి చెప్తాడు.
మొసలి కన్నీరు
అప్పుడే పోలీసులు వచ్చి మాలినిని అరెస్టు చేస్తామంటారు. జ్యోత్స్న అనే అమ్మాయిని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ వచ్చిందని చెప్తారు. నేనే కంప్లైంట్ ఇచ్చానని సుమిత్ర షాకిస్తుంది. కాలం మారింది కానీ నీ బుద్ధి మాత్రం మారలేదు సుమిత్ర. మీ మేనత్తను చూడు సూరజ్. ఇంతకుముందు ఇదే పని చేసింది. అప్పుడు నువ్వు కడుపులో ఉన్నావు. ఇప్పుడు నా కళ్ల ముందే ఉన్నావు. అన్నీ అర్థం చేసుకో అని మాలిని మొసలి కన్నీరు కారుస్తుంది.
చంపేయ్ సుమిత్ర
జ్యోత్స్న గురించి నీకు తెలుసు పిన్ని. నీ మౌనం వెనుక మాస్టర్ డ్రామా ఉందని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. జ్యోత్స్నను మీరే దాచి కొత్త డ్రామా స్టార్ట్ చేశారని దక్షిణామూర్తి అంటాడు. నీ కూతురి మీద, నీ మనవరాలి మీద నీకు ప్రేమ లేదు నాన్న. నీ కోడలు, నీ మనవడు ఏం చేసినా సమర్థిస్తున్నావని సుమిత్ర ఫైర్ అవుతుంది.
నా ప్రాణాలు పోతోనే నీ కోపం చల్లారుతుందంటే నన్ను చంపేయ్ అని సుమిత్ర చేతులను తన గొంతు మీద పెట్టుకుంటుంది మాలిని. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


