Karthika Deepam 2: కార్తీక దీపం 2.. ఇటు మనవరాలు జ్యోత్స్న రివేంజ్.. అటు తాత కొత్త బిజినెస్.. సీరియల్ కథలో ట్విస్ట్!
Karthika Deepam 2: తెలుగులో టాప్ సీరియల్ కార్తీక దీపం 2 ట్విస్టులతో సాగుతోంది. తెలుగు నాట జనాల ప్రేమను గెలుచుకుంటున్న ఈ సీరియల్ స్టోరీ అత్యంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇటు సూరజ్ పీఏగా జ్యోత్స్న చేరడం, అటు శివ నారాయణ బిజినెస్ ఊపందుకోవడంతో కథలో ఆసక్తి పెరిగింది.
Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ లో స్టోరీ అంతా ఇప్పుడు రివేంజ్ మోడ్ లోనే సాగుతోంది. తనకు అన్యాయం జరిగిందని, తన భర్తకు చావుకు కారణమని శివ నారాయణ ఫ్యామిలీపై మాలిని పగబట్టింది. తన కొడుకు సూరజ్ తో జ్యోత్స్నతో పాటు ఆ కుటుంబాన్ని మొత్తం మోసం చేయించి పగ తీర్చుకుంది.

రివేంజ్ డ్రామా
కార్తీక దీపం 2 సీరియల్ లో మాలిని దారుణంగా ప్రవర్తిస్తోంది. శివ నారాయణ ఫ్యామిలీని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చింది. ఇప్పుడు తనకు జరిగిన అన్యాయానికి ఇటు జ్యోత్స్న, అటు శివ నారాయణ రివేంజ్ తీర్చుకోవడానికి టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో కార్తీక దీపం 2 సీరియల్ స్టోరీ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రివేంజ్ డ్రామాలా మారింది.
సూరజ్ పీఏ
ఒకప్పుడు కార్తీక దీపం 2 సీరియల్ లో కన్నింగ్ విలన్ గా జ్యోత్స్న హడలెత్తించింది. కానీ సూరజ్ ను మనస్ఫూర్తిగా ప్రేమించి పూర్తిగా మారిపోయింది. కానీ తన అమ్మ చెప్పిన మాటలను పట్టుకొని జ్యోత్స్నను సూరజ్ దారుణంగా మోసం చేశాడు. ఇప్పుడు ఈ మోసానికి బదులు తీర్చుకునేందుకు జ్యోత్స్న రంగంలోకి దిగింది. ఏకంగా సూరజ్ పీఏ పోస్టునే పట్టేసింది.
శివ నారాయణ బిజినెస్
మరోవైపు ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని కట్టుబట్టలతో కూతురు కాంచన ఇంట్లో తలదాచుకుంటున్నాడు శివ నారాయణ. కూతురు ఇంట్లో ఉండటం, ఫ్రీగా తినడం శివ నారాయణకు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ పరిస్థితుల కారణంగా తప్పడం లేదు. అందుకే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇడ్లీ కొట్టుతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.
శివ నారాయణ ఇడ్లీ హోటల్ కు గిరాకీ బాగానే వస్తుంది. కస్టమర్లు పెరుగుతున్నారు. దీంతో శివ నారాయణ మెల్లగా బిజినెస్ ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్లాన్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో శివ నారాయణ మరోసారి తన వ్యాపారాన్ని విస్తరించే అవకాశముంది.
నెక్స్ట్ ఏంటీ?
కార్తీక దీపం 2 సీరియల్ లో ఇప్పుడు శివ నారాయణ కుటుంబం నెమ్మదిగా కోలుకుంటోంది. కార్తీక్, దీప కూడా మాలినిపై పగ తీర్చుకోవడానికి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. జ్యోత్స్న ఏమో సూరజ్ ఆఫీసులో అడుగుపెట్టి మాలినికి షాక్ ఇచ్చింది. మరి వీళ్లందరూ కలిసి మాలినికి ఎలా చెక్ పెడతారు? ఆమె కుట్రలను సూరజ్ తెలిసేలా ఏం చేస్తారు? అన్నది కార్తీక దీపం 2 సీరియల్ పై ఇంట్రెస్ట్ ను పెంచుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


