Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..అమ్మకే సపోర్ట్ చేస్తానన్న సూరజ్-ఇంట్లో మాలినికి షాకిచ్చిన కార్తీక్, దీప

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 21 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కూతురు కాంచన ఇంట్లో పెయింగ్ గెస్టులుగా ఉండేందుకు శివ నారాయణ ఒప్పుకొంటాడు. జ్యోత్స్న ప్రశ్నలకు సూరజ్ ఎమోషనల్ అవుతాడు. మాలిని ఇంటికి వెళ్లిన కార్తీక్, దీప దిమ్మతిరిగే షాకిస్తారు. 

Published on: Sep 21, 2026, 07:04:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. శివ నారాయణ కుటుంబాన్ని సర్వ నాశనం చేస్తున్నానని సూరజ్ తో మాలిని చెప్తుంది. మన వ్యాపారాలు నువ్వు చూసుకో. ఇప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్స్ కూడా మనవే. అడగడానికి, ఆపడానికి ఎవరూ లేరని మాలిని పొగరుగా చెప్తుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సూరజ్ ను రెచ్చగొట్టేలా

జ్యోత్స్న పెళ్లి ఆపడంతో మనం బదులు తీర్చుకున్నామని చెప్పావ్ కదమ్మా. మరి ఇదంతా ఏంటీ? అని సూరజ్ తల్లిని ప్రశ్నిస్తాడు. అక్కడితో ఆగిపోలేదు. మీ తాతను అవమానించారు. జ్యోత్స్న నీ మీద చేయి ఎత్తింది. తాతయ్యకు అవమానం జరుగుతుంటే నువ్వు చూస్తు ఊరుకుంటావా? నా కొడుకుకు అవమానం జరిగితే నేను చూస్తూ ఊరుకోను. ఇప్పుడు శివ నారాయణ కుటుంబం పొగరు దించానని సూరజ్ ను రెచ్చగొట్టేలా మాలిని మాట్లాడుతుంది.

నేను తప్పు చేశానని నీకు అనిపిస్తుందా? నేను తప్పు చేసినా సరే నువ్వు తల్లికే సపోర్ట్ గా ఉండాలి. తన అమ్మ శత్రువులు తనకూ శత్రువులే అని జ్యోత్స్న చెప్పింది గుర్తుందా? ఈ అమ్మకు శత్రువులు నీకు కూడా శత్రువులే. వాళ్లకు ఇది సరిపోదు. ఇంకా అనుభవిస్తారని సూరజ్ కు మాలిని చెప్తుంది.

నన్ను కొట్టు తాత

మరోవైపు కాంచన ఇంట్లో కార్తీక్ పై శివ నారాయణ మండిపడతాడు. మౌనంగా ఉన్నానని మీ ఇంట్లో ఉంటాననుకోకు. మేం ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరే అని శివ నారాయణ అంటాడు. ఓకే తాత మీ మాటే నా మాట. మేం తప్పు చేశామంటున్నావ్ కదా మేమే బాధ్యత తీసుకుంటాం. మీరు మా ఇంట్లోనే ఉండాలి. కోపం ఉంటే నన్ను కొట్టు అని కార్తీక్ అంటాడు.

నీకు వదిలేయడం తెలుసు తాత. కానీ నాకు పట్టుకోవడం తెలుసు. నాకు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అని కార్తీక్ అడుగుతాడు. ఒకరి రుణం మేం ఉంచుకోలేం. మీ దయాదాక్షిణ్యాల మీద ఈ శివ నారాయణ కుటుంబం బతకదని తాత మొండిగానే వాదిస్తాడు.

పెయింగ్ గెస్ట్ లుగా

మా ఇంట్లో మీరంతా పెయింగ్ గెస్ట్ లు అనుకోండని కార్తీక్ అంటాడు. డబ్బులు తీసుకుంటూనే ఉంటాం. కార్తీక్ కుటుంబం నుంచి తీసుకునే దానికి లెక్క రాయమని పారిజాతానికి శివ నారాయణ చెప్తాడు. చివరకు పెయింగ్ గెస్టులుగా ఉండేందుకు శివ నారాయణ ఒప్పుకొంటాడు.

మీ అమ్మ డ్యూటీ వేసిందా?

ఇంట్లో ఫ్రెషప్ అయిన జ్యోత్స్న అప్పుడే సూరజ్ కార్లో వెళ్లడం చూసి ఫాలో అవుతుంది. నన్ను చూడటానికే కదా బావ ఇంటికి వచ్చాం. నేను శత్రువును అనుకున్నప్పుడు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావ్. వీళ్ల బతుకులను రోడ్డున పడేశాం. ఎలా బతుకుతున్నారో చూడమని మీ అమ్మ డ్యూటీ వేసింది కదా. నీలాంటి మోసగాడిని నమ్మడం మా కర్మ. ఇది మా తలరాత కాదు, మీ అమ్మ రాసిన రాత అని సూరజ్ తో జ్యోత్స్న సీరియస్ గా మాట్లాడుతుంది.

చూస్తూ ఊరుకోను సూరజ్

మనుషులను ప్రేమతో గెలవాలని అర్థం చేసుకున్నా. అలా అని ఎవరేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటాననుకోకు. శివ నారాయణ కుటుంబం వాళ్ల కూతురి ఇంట్లో తలదాచుకుందని మీ అమ్మకు చెప్పు. అప్పుడు మీ అమ్మ మరో ప్లాన్ వేసి మా అత్త కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పడగొడుతుంది. మాలిని తన ఆడపడుచు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. జ్యోత్స్న పెళ్లి ఆపిందని జనాలు చెప్పుకుంటారని జ్యోత్స్న అంటుంది.

సూరజ్ ఎమోషనల్

ఇలా జరుగుతుందని నాకు తెలియదు. తెలిసే సరికి మీరంతా రోడ్డు మీద ఉన్నారు. ముందే తెలిసినా మా అమ్మకే సపోర్ట్ చేసేవాడిని. చనిపోయిన మా నాన్న కోసం అమ్మ ఏడుస్తుంటే కడుపులో ఉన్న నేను కూడా ఎంతో ఏడ్చా. ఒక మనిషికి తండ్రి లేకపోవడం చిన్న విషయం కాదు. నాన్న అని ఎవరిని పిలవలేం. ప్రతి ఫాదర్స్ డేకు తండ్రి ఫొటో దగ్గర చాక్లెట్ పెట్టి ఐలవ్యూ చెప్పేవాడినని సూరజ్ ఎమోషనల్ అవుతాడు.

నా తల్లి చెడ్డది కాదు. తన కన్నీళ్లను ఆపేందుకు ఏదైనా చేస్తా. నేను నా తల్లి కోసమే బతుకుతున్నా. అమ్మ అంటే ఓ నిజం. ఆ నిజమే నా జీవితం అని చెప్పి సూరజ్ వెళ్లిపోతాడు.

మాలిని ఇంటికి కార్తీక్, దీప

ఇక దక్షిణామూర్తి ఇంటికి వెళ్లిన కార్తీక్, దీప నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి టిఫిన్ వడ్డించుకోవడంతో మాలిని షాక్ అవుతుంది. మేమెప్పుడూ మంచివాళ్లమే. లేకపోతే నా కొడుకు దీపను కాపాడేవాడే కాదని మాలిని చెప్తుంది. నువ్వు అసలు ఆడదానివేనా పిన్ని? మేనకోడలు పెళ్లి ఆపేశావ్. ఆడపడుచు కుటుంబాన్ని రోడ్డున పడేశావ్. పది మందికి తిండి పెట్టే కుటుంబానికి తిండి లేకుండా గుడిలో పడుకునేలా చేశావని కార్తీక్ సీరియస్ గా అంటాడు.

దక్షిణామూర్తి షాక్

ఈ మాటలు అన్ని వింటున్న దక్షిణామూర్తి షాక్ అవుతాడు. ఇవన్నీ నువ్వు చేసిన పాపాలు అత్త. సుమిత్రమ్మ కుటుంబం జోలికి వస్తే ఊరుకోనని ఆ రోజే చెప్పా. అసలు నీకేం హక్కు ఉందని ఆస్తులు లాక్కున్నావ్? రెస్టారెంట్లు రాయించుకున్నావ్. ఇంటిని లాక్కుని కట్టుబట్టులతో రోడ్డు మీదకు లాగావని దీప అంటుంది.

ఏం తాత నువ్వేమైపోయావ్? కళ్లకు గంతలు కట్టుకున్నావా? కూతురి జీవితం నాశనం అవుతుంటే హాయిగా ఉన్నావా? అని దక్షిణామూర్తిని ప్రశ్నిస్తాడు కార్తీక్. ఎక్కడ మామయ్యకు నిజం తెలుస్తుందేమోనని మాలిని కవర్ చేసేందుకు ట్రై చేస్తుంది. మామయ్యను అవమానించినప్పుడు, నా కొడుకును కొట్టినప్పుడు నువ్వేం చేశావని కార్తీక్ ను మాలిని నిలదీస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More