Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..దీప, కడుపులో బిడ్డ సేఫ్-జ్యోత్స్న మైండ్ బ్లాక్-శివ నారాయణకు మాలిని ఆఫర్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 16 ఎపిసోడ్ లో దీప ప్రాణాలతో బయటపడుతుంది. ఆమె కడుపులోని బిడ్డకు కూడా ఏం కాదు. అయితే జ్యోత్స్న ఏమో కార్తీక్, దీపపై నింద వేస్తుంది. మరోవైపు తమ ఫ్యామిలీ రోడ్డున పడటం చూసి జ్యోత్స్న మైండ్ బ్లాక్ అవుతుంది. శివ నారాయణకు మాలిని ఆఫర్ ఇస్తుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్ బయట కార్తీక్, జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటారు. దీపకు, కడుపులో బిడ్డకు ప్రమాదం లేదని బయటకొచ్చిన డాక్టర్ చెప్పడంతో కార్తీక్, జ్యోత్స్న చేతులెత్తి మొక్కుతారు.

జ్యోత్స్నకు థ్యాంక్స్
థ్యాంక్స్ నాకు కాదు దీప చెల్లికి చెప్పండి. తనే దీపకు బ్లడ్ ఇచ్చి కాపాడింది. బ్లడ్ ఇవ్వకపోకపోతే దీప బతికేదు కాదు. టైమ్ కు హాస్పిటల్ కు తీసుకురావడం, బ్లడ్ ఇవ్వడం వల్లే దీప బతికిందని జ్యోత్స్న గురించి డాక్టర్ గొప్పగా చెప్తుంది. వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ జ్యోత్స్నకు కార్తీక్ థ్యాంక్స్ చెప్తాడు.
రక్తంతోనే కడుక్కున్నా
ఒకప్పుడు హాస్పిటల్లో దీప ప్రాణాలతో పోరాడుతుంటే అగ్రిమెంట్ తో ఖరీదు కట్టానని గతాన్ని జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది. ఒక ప్రాణం విలువ ఆ రోజు నాకు తెలీదు. అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం పెట్టిన తర్వాతే దీప ప్రాణాలు కాపాడా. అలాంటి పాపాలు కడుక్కునే రోజు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు నా రక్తంతోనే ఆ పాపాలన్నీ కడిగేసుకున్నానని జ్యోత్స్న చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది.
నా భార్య నా ప్రాణం. నా ప్రాణాన్ని కాపాడావ్ అని కార్తీక్ అంటాడు. మమ్మల్ని హాస్పిటల్ కు తీసుకొచ్చింది సూరజ్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. నువ్వు వచ్చే ముందే సూరజ్ ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీప ప్రాణాలను సూరజ్ కాపాడతాడని మనం అనుకున్నామా? రుణం తీర్చుకున్నానని చెప్పి వెళ్లిపోయాడని జ్యోత్స్న చెప్తుంది.
కారణం మీరే బావ
ఇది ఎలా ఉందంటే జ్యోత్స్నను మోసం చేసేందుకు సాయం చేసినందుకు మీకు రుణం తీర్చుకున్నానని అన్నట్లు ఉంది. దీనంతటికీ కారణం మీరే కదా బావ. అంతా ఇదే అనుకున్నారు. మీరు పగబట్టలేదు కానీ పగబట్టిన వాడికి సాయం చేశారు. దీప తీసుకురాకపోయి ఉంటే సూరజ్ ఆఫీస్ లో అడుగుపెట్టేవాడా? ఆ మనిషిని నమ్మిన మొదటి మనిషి ఎవరు? అని జ్యోత్స్న వరుసగా ప్రశ్నలు కురిపిస్తూనే ఉంటుంది.
పెళ్లికి ముందే తెలుసా?
మీరు నాతో సహా అందరి నమ్మకాన్ని కోల్పోయారు బావ. నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నించండి. మాలిని, దక్షిణామూర్తి, సూరజ్ చాలా తెలివిగా పగ తీర్చుకున్నారు. ఇది మీ ద్వారా జరిగింది. దీనికి అందరికీ మీరు సమాధానం చెప్పాల్సిందే. సూరజ్ మాటలు చూస్తుంటే అతను మాలిని అత్త కొడుకని మీకు పెళ్లికి ముందే తెలిసినట్లు ఉందని జ్యోత్స్న కూడా నింద వేస్తుంది.
జ్యోత్స్న కోసం సూరజ్
జ్యోత్స్న బయటకు వెళ్లగానే సూరజ్ కారు తీసుకొని వస్తాడు. మళ్లీ జ్యోత్స్న, సూరజ్ మాటలు అనుకుంటారు. కౌంటర్లపై కౌంటర్లు వేసుకుంటారు. నీలో చాలా అవతారాలు కనిపిస్తున్నాయని జ్యోత్స్న అంటుంది. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని సూరజ్ అంటే జ్యోత్స్న నో చెప్తుంది. మనసు మాట వినకపోవడమే మంచిదని సూరజ్ తెలివిగా మాట్లాడతాడు. చివరకు జ్యోత్స్న కారు ఎక్కుతుంది.
జ్యో సీరియస్
ఇంటికి వెళ్లి చూసిన జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ అవుతుంది. అక్కడ ఉన్న మాలినిపై జ్యోత్స్న ఫైర్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? మా ఇంట్లో నువ్వేం చేస్తున్నావ్? అని జ్యోత్స్న అడుగుతుంది. ఇది ఇప్పుడు నా ఇల్లు. మీ వాళ్లకు మర్యాద చేశానని మాలిని వెటకారంగా చెప్తుంది. నేను మా మమ్మీ అంత మంచిదాన్ని కాదు. ముందు మా వాళ్లను ఏం చేశావో చెప్పు అని జ్యోత్స్న సీరియస్ గా అడుగుతుంది.
పగ సాధించిన మాలిని
అప్పుడే బయట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న శివ నారాయణ, దశరథ, సుమిత్ర, పారిజాతం దగ్గరకు జ్యోత్స్నను మాలిని తీసుకెళ్తుంది. మీరు ఎందుకు బయటకు వచ్చారు? అసలు ఏం జరిగింది? అని జ్యోత్స్న కంగారుగా అడుగుతుంది. చేసిన పాపాలకు ఇది పరిహారమని జరిగిందంతా మాలిని చెప్తుంది. మీ రెస్టారెంట్లు, మీ షేర్స్, మీ ఆఫీస్ లు అన్నీ నావే. మీకు ఏం మిగల్లేదని మాలిని పగ సాధించినట్లు మాట్లాడుతుంది.
రిక్వెస్ట్ చేస్తే
ఏం మేనకోడలా నువ్వు కొడితే నా కొడుకు చెంపపై ముద్ర పడుతుందేమో నేను మీ బతుకుల మీద కొట్టా. నీ చేయి ఉండదని జ్యోత్స్నకు మాలిని వార్నింగ్ ఇస్తుంది. మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది. ఎవరి ఇంటికి వెళ్లలేరు. కాంచన ఇంటికి కూడా పోలేరు. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. బాబాయి నువ్వు వచ్చి మా మామయ్య చేతులు పట్టుకొని వేడుకుంటే క్షమిస్తానని శివ నారాయణకు మాలిని ఆఫర్ ఇస్తుంది.
అయినా కూడా శివ నారాయణ తగ్గడు. నన్నెవరూ శిఖరం మీద కూర్చోబెట్టలేదు. అక్కడి వరకు ఉన్న మెట్లన్నీ ఎక్కుకుంటూ వెళ్లాను. ఇది ముగింపు కాదు ఆరంభమని శివ నారాయణ ఫైర్ అవుతాడు. జాగ్రత్తగా వెళ్లండని చెప్పి మాలిని వెళ్లిపోతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


