Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..ఏడిపించేస్తున్న శివ నారాయణ ఫ్యామిలీ- గుడిలో దొంగతనం నింద- ఆకలి తీరేలా!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 18 ఎపిసోడ్లో శివ నారాయణ ఫ్యామిలీ ఏడిపించేస్తుంది. కార్తీక్, దీప రిక్వెస్ట్ చేసినా వాళ్ల ఇంటికి వెళ్లడానికి శివ నారాయణతో సహా ఎవరూ ఒప్పుకోరు. గుడికి వెళ్లి రాత్రి పడుకుంటారు. ఉదయం వీళ్లపై దొంగలు అనే ముద్ర పడుతుంది.

Published on: Sep 18, 2026, 06:58:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కార్తీక్, దీపలపై శివ నారాయణ నిందలు వేస్తూనే ఉంటాడు. కార్తీక్, దీప చాలా మంచివాళ్లు. వాళ్లు తీసుకొచ్చిన సూరజ్ ఇంకా మంచోడు. సంతకాలు పెట్టించుకున్నారు. చావుదెబ్బ తీశారని శివ నారాయణ ఫైర్ అవుతాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కార్తీక్ రిక్వెస్ట్

మమ్మల్ని ప్రమాదంలో పడేశాడని నిండా మునిగాక కానీ తెలియలేదు. మీ వల్లే రోడ్డు మీద పడ్డాం. మళ్లీ మీ పంచన ఎలా చేరతామని శివ నారాయణ మండిపడతాడు. ముందు మన ఇంటికి వెళ్దాం పదా తాత. మీరు రోడ్డున పడ్డారు అని కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ శివ నారాయణ మాత్రం వినడు. ఇక దొరికిందే ఛాన్స్ అని దీపను నోటికి వచ్చినట్లు తిడుతుంది పారిజాతం.

చచ్చిపోయానని చెప్పు

కార్తీక్ సాయం అవసరం లేదని జ్యోత్స్న కూడా తెగేసి చెప్తుంది. అయినా కూడా కార్తీక్ రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాడు. మీ అమ్మకు నేను చచ్చిపోయానని చెప్పు. శివ నారాయణ కుటుంబం చచ్చిపోయిందని చెప్పు. దీప, నువ్వు కలిసి చంపేశామని చెప్పండని శివ నారాయణ చేతులెత్తి దండం పెడతాడు. అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు.

గుడికి శివ నారాయణ ఫ్యామిలీ

శివ నారాయణ ఫ్యామిలీ అంతా కలిసి రాత్రి గుడిలో ఉంటారు. మాలిని చెప్పిన మాటలు, చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుని అందరూ ఎమోషనల్ అవుతారు. గుడిలో రాత్రి ఎవరూ ఉండకూడదని పూజారి చెప్తాడు. మా కుటుంబ సమేతంగా గుడిలో ఓ రాత్రి నిద్ర చేస్తే సమస్యలు ఉండవని మా గురువు చెప్పారని పారిజాతం అబద్ధం చెప్తుంది. అయినా కూడా పూజారి ఒప్పుకోడు.

ఆకలి ఏడుపులు

ఇంత దూరం ఎప్పుడూ నడవలేదు. కడుపులో నొప్పిగా ఉందని పారిజాతం అంటుంది. దాన్ని ఆకలి అంటారు అత్తయ్య అని సుమిత్ర ఏడ్చేస్తుంది. క్యారేజీ తీసుకొని వచ్చిన కార్తీక్, దీప ఆ సీన్ చూసి ఎమోషనల్ అవుతారు. ఆ భోజనం నేరుగా ఇస్తే తీసుకోరని పూజారి చేతులతో ప్రసాదం అని చెప్పి ఇప్పించేలా చేస్తాడు కార్తీక్. అలాగే తాత ఫ్యామిలీ గుడిలో ఉండేలా కార్తీక్ రిక్వెస్ట్ చేస్తే పూజారి ఒప్పుకొంటాడు.

ఏడిపించే సీన్లు

పూజారి ప్రసాదం ఇవ్వడంతో శివ నారాయణతో పాటు అందరూ ఏడ్చేస్తారు. దేవుడు ఉన్నాడండీ, మన ఆకలి తీర్చడానికి ప్రసాదాలు పంపించాడని పారిజాతం అంటుంది. అందరూ ఆబగా తింటుంటే.. జ్యోత్స్న మాత్రం తినకుండా ఉంటుంది. పారిజాతం కన్నీళ్లు తుడిచి తినమంటుంది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న కార్తీక్, దీప కూడా ఏడ్చేస్తారు.

ఎంతోమందికి భోజనం పెట్టిన మన కుటుంబం అనాథలా మారిపోయింది బావ అని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. వీళ్లు ఇలా ఎన్నాళ్లు ఉండాలి బావ అని దీప అడుగుతుంది. ఏదో ఒకటి చేద్దామని కార్తీక్ చెప్తాడు. రాత్రి అందరూ ఆ గుడిలోనే పడుకుంటారు. ఉదయం కార్తీక్ మళ్లీ ప్రసాదం తీసుకొస్తాడు.

దొంగలు అనే ముద్ర

అయితే ఆలయ ధర్మకర్త వచ్చి పూజారిపై కోప్పడతాడు. వీళ్లను రాత్రి గుడిలో ఎందుకు ఉండనిచ్చారని సీరియస్ అవుతాడు. వీళ్లు ఎవరో? ఎందుకు వచ్చారో తెలుసుకోరా? ఈ మధ్య దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. వీళ్లు అలాంటివాళ్లు కారని నమ్మకం ఏంటీ? అని ధర్మకర్త ప్రశ్నిస్తాడు. ఇక్కడే ఉండటానికి ఇదేమైనా సత్రమా? దేవుడి నగలు పోతే ఎవరిది బాధ్యత అని ఆ ధర్మకర్త ఫైర్ అవుతాడు.

స్వామి వారి నగలన్నీ ఉన్నాయో లేదో ముందు చూశారా పూజారి? అన్ని చూసి వీళ్లను పంపించేయండని శివ నారాయణ ఫ్యామిలీపై దొంగతనం నింద వేస్తాడు ధర్మకర్త. మీలాంటి దిక్కులేని వాళ్లు తలదాచుకోవడానికి సత్రాలు ఉంటాయి లేదా ఊరి చివరి గుడిసె వేసుకొని తలదాచుకోండని ధర్మకర్త అవమానిస్తాడు. బాధతో శివ నారాయణ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

సూరజ్ ఆలోచనలు

ఇంత అవమానం భరించడం కంటే ప్రాణం పోయినా బాగుండేది కదా దశరథ అని శివ నారాయణ ఏడుస్తాడు. తల తిరుగుతుందని జ్యోత్స్న వెళ్లి ముఖం కడుక్కుంటుంది. అక్కడే కూర్చుని సూరజ్ గురించి ఆలోచిస్తుంది. అప్పుడే జ్యోత్స్నకు సూరజ్ కనిపిస్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More