Karthika Deepam 2: కార్తీక దీపం 2.. ఈ జ్యోత్స్న మామూలుది కాదుగా.. ఇక మాలిని, సూరజ్ కు చుక్కలే.. ట్విస్ట్ ఇదేనా?
Karthika Deepam 2: కార్తీక దీపం 2.. ఈ సీరియల్ గురించి తెలుగు టీవీ ఆడియన్స్ కు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్పీ రేటింగ్ రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ సీరియల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తాజాగా ఈ సీరియల్ స్టోరీలోని ట్విస్ట్ లు అదిరిపోయేలా ఉంటున్నాయి. జ్యోత్స్న తన పట్టు వదలట్లేదు.
Karthika Deepam 2: బుల్లితెరపై టీఆర్పీ రికార్డులు క్రియేట్ చేస్తూ, తెలుగు ప్రజల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్న టాప్ సీరియల్ ‘కార్తీక దీపం 2’. స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు తెలుగు నాట స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ ను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఈ సీరియల్ స్టోరీ సాగుతోంది.

కార్తీక దీపం 2 స్టోరీ
కార్తీక దీపం 2 సీరియల్ ముందు కార్తీక్, దీప, జ్యోత్స్న చుట్టూ తిరిగింది. ఇప్పుడు కథలోకి కొత్తగా సూరజ్, మాలిని, దక్షిణామూర్తి వచ్చారు. దీంతో కార్తీక దీపం 2 సీరియల్ స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. శివ నారాయణ కుటుంబం ఆస్తులను లాగేసుకున్న మాలిని.. ఆ ఫ్యామిలీని నడిరోడ్డున నిలబెట్టింది.
జ్యోత్స్న పట్టు
సూరజ్ ను ఎంతో ప్రేమించిన జ్యోత్స్న.. తల్లి మాలిని మాట విని అతను చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతోంది. అందుకే సూరజ్, మాలినికి తగిన బుద్ధి చెప్పాలని పట్టుబట్టింది. తాత దక్షిణామూర్తిని బుట్టలో వేసుకొని మారి సూరజ్ పీఏ పోస్టును జ్యోత్స్న సొంతం చేసుకుంది.
మాలినికి ముక్కుతాడు
కార్తీక దీపం 2 సీరియల్ లో ఒకప్పుడు విలన్ గా రెచ్చిపోయిన జ్యోత్స్న ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అసలు విలన్ అయిన మాలినికి ముక్కుతాడు వేసేందుకు తన అడుగులు వేస్తుంది జ్యోత్స్న. దక్షిణామూర్తి చెప్తే మాలిని తప్పనిసరిగా వినాల్సిందే. అందుకే రిజెక్ట్ అయిన వెంటనే తాతతో మాట్లాడిన జ్యోత్స్న పీఏ పోస్టు పట్టేసింది.
ట్విస్ట్ ఇదేనా?
కార్తీక దీపం 2 సీరియల్ లో ఇప్పుడు జ్యోత్స్న క్యారెక్టర్ ఒక్కసారిగా ఇంపార్టెంట్ గా మారింది. తన కుటుంబం పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి దక్కించుకోవాలని.. మాలిని, సూరజ్ కు బుద్ధి చెప్పాలనే టార్గెట్ తో జ్యోత్స్న అడుగులు వేస్తుంది. అందుకే సూరజ్ నో చెప్పినా కూడా పట్టుబట్టి మరీ పీఏ పోస్టు దక్కించుకుంది.
ఇక ఆఫీసులో సూరజ్ పీఏగా జ్యోత్స్న చేరితే మాలినికి మూడినట్లే. ఎప్పటికప్పుడూ జ్యోత్స్నను సూరజ్ కలవకుండా దూరం పెడుతోంది మాలిని. కానీ ఇప్పుడేమో ఆఫీస్ లో ఉన్నంత సేపు సూరజ్, జ్యోత్స్న ఒకటే దగ్గర ఉంటారు. దీంతో సూరజ్ మనసు మెల్లగా కరిగే అవకాశముంది. రాబోయే ఎపిసోడ్లలో ఇదే జరుగుతుందనిపిస్తోంది.
నిజం తెలిస్తే
సూరజ్ మంచోడే. కానీ ఇప్పుడు అమ్మ చెప్పిన మాయ మాటలు అతణ్ని పూర్తిగా కమ్మేశాయి. అవి దాటుకొని సూరజ్ నిజం తెలుసుకుంటే కార్తీక దీపం 2 సీరియల్ స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారనుంది. మరి ఆ దిశగా మేకర్స్ ఈ సీరియల్ కథను ఎలా నడిపిస్తారో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


