Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ సూరజ్ షాకింగ్ ఫ్యాక్ట్స్-రైటర్, డైరెక్టర్ గా సినిమా-మ్యాజిక్ షోల నుంచి హీరోగా!

Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ లో ఇప్పుడు స్టోరీ అంతా సూరజ్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతోంది. స్టార్ మాలో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను శ్రీక‌ర్ కృష్ణ‌ ప్లే చేస్తున్నాడు. అతని బ్యాక్ గ్రౌండ్, ప్రస్తుతం చేస్తున్న వర్క్ గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే.

Published on: Sep 26, 2026, 15:29:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2: బుల్లితెరపై తిరుగులేని రేటింగ్ తో దూసుకుపోతున్న టాప్ సీరియల్ కార్తీక దీపం 2. కార్తీక్, దీప మెయిన్ క్యారెక్టర్లుగా మొదలైన ఈ సీరియల్ లో ఇప్పుడు అదిరిపోయే ఉత్కంఠ కొనసాగుతోంది. సూరజ్, ఆ తర్వాత మాలిని ఎంట్రీతో కార్తీక దీపం 2 సీరియల్ కథ వేరే లెవల్ కు చేరుకుంది.

కార్తీక దీపం 2 సీరియల్ సూరజ్ షాకింగ్ ఫ్యాక్ట్స్-రైటర్, డైరెక్టర్ గా సినిమా-మ్యాజిక్ షోల నుంచి హీరోగా! (instagram-SRIKAR KRISHNA)
కార్తీక దీపం 2 సీరియల్ సూరజ్ షాకింగ్ ఫ్యాక్ట్స్-రైటర్, డైరెక్టర్ గా సినిమా-మ్యాజిక్ షోల నుంచి హీరోగా! (instagram-SRIKAR KRISHNA)

కార్తీక దీపం 2 సూరజ్

కార్తీక దీపం 2 సీరియల్ లో ఇప్పుడు సూరజ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ గా మారింది. తల్లి మాలిని కోసమే బతికే సూరజ్.. తన అమ్మ చెప్పిందని ప్రేమ పేరుతో జ్యోత్స్నను మోసం చేశాడు. శివ నారాయణ ఆస్తి మొత్తం మాలిని చేతికి చిక్కేలా చేశాడు. అయితే అతనిలో మంచోడు అనే యాంగిల్ కూడా ఉంది. ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న సూరజ్ క్యారెక్టర్ ను శ్రీక‌ర్ కృష్ణ‌ ప్లే చేస్తున్నాడు.

శ్రీక‌ర్ కృష్ణ‌ లైఫ్ స్టోరీ

కార్తీక దీపం 2 సీరియల్ లో సూరజ్ అనే కీలకమైన పాత్ర పోషిస్తున్న శ్రీక‌ర్ కృష్ణ‌ లైఫ్ స్టోరీ చూస్తే ఎన్నో షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. ఒకప్పుడు మెజీషియన్ గా మ్యాజిక్ షోలు చేసే శ్రీకర్.. ఇప్పుడు హీరో. అంతే కాకుండా ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.

డిప్రెషన్

మేజిషియన్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీక‌ర్ కృష్ణ‌కు చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. అయితే ఛాన్స్ లు లేక, అవమానాలు భరించలేక తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఓ దశలో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాడు.

పట్టు వదలకుండా

తెరపై కనబడాలి, ప్రధాన పాత్రలతో మెప్పించాలనే తన తల్లి కోరిక కోసం శ్రీక‌ర్ కృష్ణ‌ పట్టు వదల్లేదు. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాడు. యాంకర్ గా సత్తాచాటాడు. సీరియల్స్ లో మెప్పించాడు. కళ్యాణ వైభోగం, బ్రహ్మముడిలో తన నటనతో అదరగొట్టాడు. ఇప్పుడు కార్తీక దీపం 2లోనూ కీ రోల్ తో నటుడిగా నిరూపించుకుంటున్నాడు.

డైరెక్టర్ గా

శ్రీక‌ర్ కృష్ణ‌ ఓ రెండు సినిమాల్లో హీరోగానూ చేశాడు. మరికొన్ని సినిమాల్లో నటించాడు. ఇప్పుడు రైటర్ కమ్ డైరెక్టర్ గా మారాడు శ్రీక‌ర్ కృష్ణ‌. ‘ఓ టార్చర్ ప్రేమ’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతే కాదు శ్రీకారం ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పై ఈ సినిమాను అతనే స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా.

మెజీషయన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీక‌ర్ కృష్ణ‌ ఇవాళ మంచి పొజిషనల్ లో ఉన్నాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టువదలకుండా అతను సాగించిన పోరాటమే ఇందుకు కారణం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More