Karthika Deepam 2: కార్తీక దీపం 2.. నెక్స్ట్ ఏంటీ? మాలినిపై రివేంజ్‌కు కార్తీక్ ప్లాన్ ఏంటీ? సూరజ్, జ్యోత్స్న పెళ్లి!
Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ లో మాలిని చావు దెబ్బ కొట్టడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఏ దిక్కూలేని పరిస్థితుల్లో నడి రోడ్డు మీద ఉండలేక శివ నారాయణ ఫ్యామిలీ మొత్తం కాంచన ఇంట్లో చేరారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? మాలినిపై రివేంజ్ కు కార్తీక్ ఎలాంటి ప్లాన్ వేస్తాడు? అనేది ఉత్కంఠ రేపుతోంది.
Karthika Deepam 2: Karthika Deepam 2: తెలుగు సీరియల్ లవర్స్ కు పరిచయం అక్కర్లేని పేరు.. కార్తీక దీపం 2. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్ అద్భుతమైన రేటింగ్, అదిరే క్రేజ్ తో దూసుకెళ్తోంది. ఎప్పటికప్పుడూ కథలో ట్విస్ట్ లతో, మలుపులతో సీరియల్ లవర్స్ కు కొత్త ఎక్స్ పీరియన్స్ అందిస్తోంది.

అదిరే ట్విస్ట్
కార్తీక దీపం 2 సీరియల్ లో స్టోరీ అంతా బాగానే సాగుతుంది అనుకునే టైమ్ లో ఓ బిగ్ ట్విస్ట్ తో కథ మొత్తం మారిపోయింది. సూరజ్ తో పెళ్లి కాగానే దీపనే అసలైన వారసురాలని చెప్పేస్తానని జ్యోత్స్న నిర్ణయించుకుంది. కానీ మాలిని కొడుకైన సూరజ్.. జ్యోత్స్నను పెళ్లి చేసుకోకుండా రివేంజ్ తీర్చుకున్నాడు.
నడిరోడ్డు మీదకు
మాలిని ఇక్కడితోనే ఆగిపోలేదు. శివ నారాయణను పూర్తిగా నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. అందుకే జ్యోత్స్న రెస్టారెంట్స్ ను లాక్కుంది. ఇంటిపై లోన్ తీసుకుని బయటకు గెంటేయించింది. శివ నారాయణ ఫ్యామిలీ మొత్తాన్ని నడిరోడ్డు మీద నిలబెట్టింది.
కాంచన ఇంటికి
ఇప్పుడు శివ నారాయణ కుటుంబానికి నిలువ నీడ లేదు. కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చేశారు. బ్యాంకు బ్యాలెన్స్ లేదు. విలాసవంతమైన కార్లు లేవు. అయినా ఆత్మాభిమానంతో కార్తీక్ ఇంటికి వెళ్లేందుకు నిరాకరించారు. కానీ కార్తీక్ తన ఫ్రెండ్ ఎస్ఐ సాయంతో తాతయ్య ఫ్యామిలీ అందరినీ తన ఇంట్లో ఉండేలా చేసుకోగలిగాడు.
నెక్స్ట్ ఏంటీ?
పోలీసుల బలవంతమో లేదా జనాల సలహానో కానీ కార్తీక్ ఇంట్లో ఉండేందుకు శివ నారాయణ, సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం, దశరథ ఓకే అన్నారు. ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. ఇప్పటికైతే వాళ్లకు రోడ్డు మీద ఉండాల్సిన దుస్థితి లేదు. కానీ కార్తీక దీపం 2 సీరియల్ కథలో నెక్స్ట్ ఏంటీ అనే ప్రశ్న చాలా ఉత్కంఠ రేపుతోంది.
కార్తీక్ ఏం ప్లాన్ వేస్తాడో?
ఇప్పుడు హీరో కార్తీక్ ముందు అన్ని ప్రశ్నలే మిగిలాయి. ఛాలెంజ్ లు అతని కోసం ఎదురు చూస్తున్నాయి. ముందుగా తాత దగ్గర నుంచి మాలిని లాక్కున్న ఆస్తులు, ఆఫీస్ తో పాటు మర్యాదను కూడా తిరిగి తీసుకురావాలి.
ఆ తర్వాత సూరజ్, జ్యోత్స్నకు పెళ్లి చేయాలి. వీళ్ల పెళ్లితోనే కార్తీక దీపం 2 సీరియల్ కు ఓ అర్థం వస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే సూరజ్ విషయంలో కార్తీక్, దీపపై అందరూ నిందలు వేస్తున్నారు.
రివేంజ్ ఎలా?
ఇప్పుడు మాలినిపై రివేంజ్ తీర్చుకోవాలని కార్తీక్, శివ నారాయణ సహా ఫ్యామిలీ అంతా రగిలిపోతున్నారు. అది జరగాలంటే మాలిని కుట్రలు, దారుణాల గురించి సూరజ్ కు తెలియాలి. సూరజ్ బేసిక్ గా మంచోడే కానీ తల్లి పగ అనే మాయలో పడి అసలు నిజాలు తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే ఒక్కోసారి తల్లినే ప్రశ్నిస్తున్నాడు.
ఇప్పుడు మాలిని గురించి సూరజ్ కు తెలిసేలా చేస్తే కార్తీక్ పని ఈజీ అవుతుంది. కానీ సూరజ్ అంత తేలికగా నమ్మే రకం కాదు. మరి సూరజ్ ను నమ్మించడానికి కార్తీక్ ఏం చేస్తాడు? దీప, జ్యోత్స్న ఇందులో ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? అనేది కార్తీక దీపం 2 రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


