Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-జ్యోత్స్న నా కూతురు కాదు-బాంబ్ పేల్చిన దాసు-జ్యో జాబ్ తీసేయించిన మాలిని!
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 29 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. జ్యోత్స్న తన మనవరాలే అని చెప్పేందుకు పారు ట్రై చేస్తుంది. కానీ దాసు ఎంట్రీ ఇచ్చి జ్యో తన కూతురు కాదంటాడు. ఇక మాలిని బెదిరించి మరీ జ్యోత్స్నను జాబ్ లో నుంచి తీసేయిస్తుంది. దీపకు టాస్క్ ఇస్తుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. కొంతమంది అబ్బాయిల ఫొటోలు ముందు పడేసి సెలెక్ట్ చేసుకోమని పారిజాతం అంటుంది. ఈ పెళ్లి సంబంధాలు నాకు అవసరం లేదని జ్యోత్స్న కరాఖండీగా చెప్పేస్తుంది. చేసుకోనంటే చేసుకోనని జ్యోత్స్న మొండికేస్తుంది.

జ్యోత్స్నపై హక్కు లేదు
పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావని పారిజాతాన్ని అందరూ అడుగుతారు. అయినా పారు వినదు. జ్యోత్స్న తన మనవరాలని పారు గట్టిగా అరుస్తుంది. జ్యోత్స్నపై నీకు హక్కు లేదని శివ నారాయణ అంటాడు. ఆ మాటతో పారు కోపంతో ఊగిపోతుంది.
దాసు ఎంట్రీ
అసలు జ్యోత్స్న మీద హక్కు లేనిది మీకు. ఎందుకంటే ఇది శివ నారాయణ మనవరాలు కాదు అని చెప్పబోతుండగా అమ్మా అంటూ దాసు ఎంట్రీ ఇస్తాడు. అమ్మా ఏం మాట్లాడుతున్నావ్? నీ ఆవేశానికి హద్దుల్లేవా? అని దాసు అడుగుతాడు. సుమిత్ర, దశరథల కూతురే జ్యోత్స్న. నీకు తనపై హక్కు లేదని శివ నారాయణ మండిపోతాడు.
పారు కోపం
పారిజాతాన్ని దాసు బయటకు లాక్కెళ్తాడు. నిజం చెప్పేయడం గొప్ప అనుకుంటున్నావా అమ్మ? అని పారును దాసు అడుగుతాడు. మన కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం కరెక్టా అని జ్యోత్స్న అడుగుతుంది. ఇది నీ కుటుంబం కాదు. నువ్వు కళ్యాణి- దాసులా కూతురు. దాసు నువ్వు నిజం చెప్పు అని పారిజాతం అంటుంది.
జ్యోత్స్న నా కూతురు కాదు
జ్యోత్స్న తన కూతురు కాదని దాసు షాకిస్తాడు. పెళ్లి మండపంలో మాలిని చెప్పినప్పుడు తాను సుమిత్ర కూతురిని కాదు, సూరజ్ ను తాళి కట్టమని అడిగే అవకాశం జ్యోత్స్నకు వచ్చింది. కానీ తను అలా చెప్పలేదు. మా అమ్మ శత్రువులు తనకు కూడా శత్రువులు అని వాళ్ల సైడ్ నిలబడింది. అప్పుడే జ్యోత్స్న.. సుమిత్ర-దశరథల కూతురు అయిపోయింది. జ్యోత్స్న నా కూతురు కాదమ్మా అని బాంబ్ పేల్చి దాసు వెళ్లిపోతాడు.
మాలిని వార్నింగ్
మరోవైపు జ్యోత్స్న వెయిటర్ గా పని చేస్తున్న ఓనర్ ను మాలిని పిలిపిస్తుంది. జ్యోత్స్న నా మేనకోడలు. అంతే కాదు శివ నారాయణ మనవరాలు అని మాలిని అసలు విషయం చెప్తుంది. మీరు జ్యోత్స్న ఆస్తులు లాగేసుకున్నారని జనాలు అనుకుంటున్నారని ఆ ఓనర్ అంటాడు. అవన్నీ నీకు అనవసరం. వెంటనే ఆమెను జాబ్ లో నుంచి తీసేయ్. లేదంటే నీకు ఆ కెఫే కూడా ఉండదని మాలిని వార్నింగ్ ఇస్తుంది. ఆ ఓనర్ ఓకే అని వెళ్లిపోతాడు.
జ్యోత్స్న బయటకు
సీన్ కెఫేకు మారుతుంది. జ్యోత్స్న నా టైమ్ బాలేదు. నువ్వు చాలా బాగా పని చేస్తున్నావు. కానీ నీలాంటి వాళ్లు ఎక్కడో ఉండాలి. అందుకే నిన్ను ఈ జాబ్ లో నుంచి తీసేస్తున్నా. నీ గతం గురించి తెలుసుకోకుండా తప్పు చేశా. ఒకప్పుడు రెస్టారెంట్ ఓనర్ ను, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు ఈ కెఫే కూడా ఉండదంటున్నారని ఓనర్ చెప్తాడు.
మిమ్మల్ని ఎవరో బెదిరించారు. కానీ నా వల్ల ఏ ప్రాబ్లెం రాదు సార్ అని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తున్నా ఆ ఓనర్ వినడు. మిమ్మల్ని ఎవరు బెదిరించారో చెప్పండని జ్యోత్స్న అడిగినా ఆ ఓనర్ చెప్పడు. సూరజ్ ఫొటో చూపిస్తే.. ఎవరైతే ఏంటీ అని ఆ ఓనర్ అంటాడు. అప్పుడే అక్కడకు సూరజ్ వచ్చి కాఫీ ఆర్డర్ ఇస్తాడు. కానీ జ్యోత్స్న వెళ్లిపోతుంది. తను ఇక్కడ జాబ్ చేయడం లేదని ఓనర్ వచ్చి సూరజ్ కు చెప్తాడు.
దీపకు టాస్క్
ఇటు ఆఫీసులో దీపకు సెపరేట్ క్యాబిన్ ను తీసేస్తారు. బయట టేబుల్ సెట్ చేస్తారు. మాలిని వచ్చి కుప్పలు కుప్పలుగా ఉన్న డాక్యుమెంట్స్ ను టేబుల్ మీద పెట్టిస్తుంది. అవన్నీ సాయంత్రం లోగా చదివి సంతకం పెట్టాలి. ఏదైనా తేడా వస్తే నష్టం నువ్వే భరించాలి. ఇవన్నీ చేయలేక నువ్వే పారిపోతావని మాలిని వెటకారంగా మాట్లాడుతుంది.
నువ్వే జాబ్ తీయించేశావ్
కెఫె బయట సూరజ్ తో జ్యోత్స్న కోపంగా మాట్లాడుతుంది. ముందు నువ్వు కెఫెలో జాబ్ ఎందుకు మానేశావో చెప్పు అని సూరజ్ అడుగుతాడు. ఎదుటివాళ్లకు నిజం తెలిసినా నటించడం కరెక్ట్ కాదు. నన్ను జాబ్ లో నుంచి తీసేశారు. నువ్వు నా జాబ్ తీయించేశావ్. బెదిరించి మరీ జాబ్ తీయించేలా చేశావని జ్యోత్స్న అంటుంది.
నువ్వే ఊహించుకుంటున్నావ్ జ్యోత్స్న. నేనేం చేయలేదని సూరజ్ అంటాడు. నువ్వు మిగతా రెస్టారెంట్లు, వందల్లో కాఫీ షాపులు వదిలేసి కాఫీ తాగేందుకు ఇక్కడికి ఎందుకు వస్తున్నావ్? నువ్వు పగతో నా చుట్టూ తిరుగుతున్నావ్. నువ్వు డ్యూటీ చేస్తున్నావ్. మీ అమ్మ నా దగ్గర డ్యూటీ వేసిందని జ్యోత్స్న కోపంగా మాట్లాడుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


