Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. మాలినికి డబుల్ స్ట్రోక్- మామ ఫైర్, ఎదురు తిరిగిన సూరజ్- నోరు జారిన దీప
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 7 ఎపిసోడ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. జ్యోత్స్న పీఏగా జాయిన్ అయిన విషయం సుమిత్రకు చెప్పొద్దని మాలినికి దక్షిణామూర్తి చెప్తాడు. అయినా సుమిత్రకు కాల్ చేసిన మాలినికి సూరజ్ ఎదురు తిరుగుతాడు. జ్యో గురించి దీప నోరు జారుతుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తాత శివ నారాయణ టిఫిన్ బండి దగ్గరగా కార్తీక్, దీప టిఫిన్ తింటారు. టేస్ట్ అదిరిపోయిందని అంటారు. చాలా రోజుల తర్వాత మంచి టిఫిన్ చేసిన అనుభూతి కలిగిందని కార్తీక్ అంటాడు.

తాతకు కార్తీక్ హెల్ప్
రెండు ప్లేట్ లు కలిపి రూ.80 అని శివ నారాయణ చెప్తాడు. కానీ కార్తీక్ కావాలనే పర్స్ తెచ్చుకోలేదని అంటాడు. డబ్బులు ఎగ్గొడితే పనులు చేయించుకుంటారు కదా, మాతోని కూడా పని చేయించుకోండని కార్తీక్ అంటాడు. శివ నారాయణ వద్దు అన్నా కూడా కార్తీక్, దీప కలిసి అక్కడ పని చేస్తారు. వచ్చిన కస్టమర్లకు సర్వ్ చేస్తారు.
దక్షిణామూర్తి ఫైర్
మరోవైపు జ్యోత్స్న పీఏగా చేరిందని ఇప్పుడు సుమిత్రకు చెప్పాల్సిన అవసరం ఏముందని మాలినిపై దక్షిణామూర్తి ఫైర్ అవుతాడు. నేను మీ మాటను గౌరవిస్తా. అందుకే జ్యోత్స్నకు పీఏ పోస్టు ఇస్తే ఎదురు చెప్పలేదు. నేను ఇప్పుడే వెళ్లి జ్యోత్స్న పీఏగా చేరిందని వాళ్లకు చెప్పాల్సిందేనని మాలిని అంటుంది. నువ్వు వెళ్లి వాళ్లకు చెప్తే జ్యోత్స్నను జాబ్ చేయొద్దంటారని దక్షిణామూర్తి చెప్తాడు.
చెడ్డపేరు మనకెందుకు?
ఇప్పటికే వాళ్లకు తెలిస్తే మంచిదే. నా మనవరాలు జ్యోత్స్న బాధ చెప్పుకోవడానికి నా దగ్గరకు వచ్చిందని వాళ్లకు తెలిస్తే శివ నారాయణపై నేను గెలిచినట్లే. అందుకే జ్యోత్స్న వద్దన్నా జాబ్ ఇచ్చానని దక్షిణామూర్తి అంటాడు. మనం చెప్పకపోతే మనదే తప్పంటారు. ఆడపిల్ల మనసు మార్చారనే చెడ్డపేరు మనకెందుకు? అని మాలిని అంటుంది. ఆ పేరు తాను తీసుకుంటానని దక్షిణామూర్తి ఎమోషనల్ అవుతాడు.
ఇంట్లో ఉండను
జ్యోత్స్న వల్ల సుమిత్ర కూడా వస్తుందనే నమ్మకం ఉంది. జ్యోత్స్న ఏం చెప్పుకుంటుందో చెప్పుకోని. కార్తీక్, దీప ఏం చేస్తారో చేసుకోని. ఆఫీసులో పీఏ పోస్టు ఖాళీగా ఉంది. అందులో జ్యోత్స్న చేరింది. ఇప్పుడు నా ఆశ జ్యోత్స్న రూపంలో వచ్చింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే ఈ ఇంట్లో నేను ఉండను అని దక్షిణామూర్తి చెప్పడంతో మాలిని, సూరజ్ షాక్ అవుతారు.
నోరు జారిన దీప
తాత చేస్తుంది సరిగ్గానే ఉన్నప్పుడు మనం మాట్లాడటం ఎందుకని సూరజ్ కూడా అనడంతో మాలినికి మరో షాక్ తగులుతుంది. మరోవైపు జ్యోత్స్న ఇంకా రాలేదని సుమిత్ర ఎదురు చూస్తుంటుంది. మా కంటే ముందే బయల్దేరింది కదా అని దీప నోరు జారుతుంది. దీంతో జ్యోత్స్న ఎక్కడ అని అందరూ గుచ్చిగుచ్చి కార్తీక్, దీపను అడుగుతారు. కానీ వీళ్లు నిజం చెప్పకుండా గదిలోకి వెళ్లిపోతారు.
నీకు బుద్ధి ఉందా? మాలిని పిన్ని దగ్గర పీఏగా చేరిందని జ్యోత్స్న చెప్పొద్దన్నది కదా అని దీపపై కార్తీక్ కోప్పడతాడు. మరి ఎవరు చెప్తారు అని దీప అడుగుతుంది. ఎవరు చెప్తే మనకేంటీ, మనం మాత్రం చెప్పొద్దని కార్తీక్ స్పష్టం చేస్తాడు.
ఫోన్ లాక్కున్న సూరజ్
అప్పుడే కాంచన ఫోన్ కు మాలిని కాల్ చేసి సుమిత్రతో మాట్లాడుతుంది. నువ్వు అనుకున్నది నీ కూతురు ద్వారా సాధిస్తున్నావ్ కదా. ముందు కార్తీక్, ఆ తర్వాత దీపను రంగంలోకి దించారు. ఇప్పుడు నీ కూతురిని కూడా రంగంలోకి దించారు. నీ కూతురు జ్యోత్స్న నా అని మాలిని చెప్పబోతుండగా సూరజ్ వచ్చి ఫోన్ లాక్కొని కాల్ కట్ చేస్తాడు.
తప్పు చేశావమ్మా
ఎందుకు కాల్ కట్ చేశావని సూరజ్ ను మాలిని అడుగుతుంది. అత్తతో జ్యోత్స్న జాబ్ గురించి చెప్పొద్దని తాత చెప్పాడు కదా. నువ్వు తప్పు చేశావమ్మా. మరొక తప్పు చేయొద్దు. జ్యోత్స్నను నాకు పీఏగా పెట్టింది నువ్వే. కేఫ్ లో జ్యోత్స్న జాబ్ పోవడానికి కారణం నువ్వే. నేను అడిగినా కూడా నువ్వు నిజం చెప్పలేదని సూరజ్ వరుసగా షాక్ లు ఇస్తాడు.
తాత వద్దని చెప్పినా ఎందుకు చెప్తున్నావ్ అమ్మా? నేను తాత గురించి ఆలోచిస్తున్నా. కొన్ని సమస్యలు నిప్పు లాంటివే. మనం కోరి కొనితెచ్చుకోవద్దు. నువ్వు జ్యోత్స్నను అడ్డుకోవాలనుకున్నావ్. కానీ ఇక్కడితో అది ఆగదు. జ్యోత్స్న గురించి నువ్వు చెప్పొద్దు. ఆమె ఏం చేసుకుంటుందో చేసుకోని అని సూరజ్ చెప్తాడు. తల్లికి ఎదురు తిరిగి మాట్లాడతాడు.
ఇంటి వరకూ రప్పించొద్దు
నీకు తల్లి అంటే నమ్మకం లేదు. నీ తండ్రి విషయంలో తప్పు నాదే అని నమ్ముతున్నావా? అని సూరజ్ ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని మాలిని ట్రై చేస్తుంది. నేను చూడని విషయాలను నమ్మలేను అమ్మ. నా తండ్రి చావుకు పగ కోసమే కదా ఇదంతా చేసింది. జ్యోత్స్నను రెచ్చగొట్టి ఆఫీసు వరకు రప్పించావ్. ఇక ఇంటి వరకూ రప్పించొద్దు అమ్మా అని సూరజ్ మరో ట్విస్ట్ ఇస్తాడు.
బాధపెట్టేలా దశరథ మాటలు
ఇటు ఆఫీసులో ఏం జరిగిందో చెప్పమని కార్తీక్, దీపను సుమిత్ర గట్టిగా అడుగుతుంది. దీపను తీసిపారేసినట్లు సుమిత్ర మాట్లాడుతుంది. రక్తబంధాల గురించి వీళ్లతో మాట్లాడొద్దు సుమిత్ర. వీళ్లు పరాయివాళ్లే. పరాయివాళ్ల పంచన తల దాచుకుంటున్నామని దశరథ మాటలతో బాధపెడతాడు. కార్తీక్ కాల్ చేస్తే జ్యోత్స్న లిఫ్ట్ చేయకపోవడంతో సుమిత్ర ఇంకా టెన్షన్ పడుతుంది.
జ్యోత్స్న తిరిగి కాల్ చేస్తుంది. నేను ముఖ్యమైన పని మీద వేరే చోటుకు వెళ్లా. రేపు రాత్రి వస్తానని జ్యోత్స్న చెప్తుంది. ఎక్కడున్నావని దశరథ అడిగితే జ్యోత్స్న చెప్పకుండా కాల్ కట్ చేస్తుంది. జ్యోత్స్న గురించి మాట్లాడుతూ సుమిత్ర, దశరథ, శివ నారాయణ ఫీల్ అవుతారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


