Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. నువ్వు చనిపోయావ్ నాన్న-తండ్రికి సుమిత్ర షాక్-పోటీగా మాలిని టిఫిన్ బండి

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 9 ఎపిసోడ్ లో దక్షిణామూర్తిని మాటలతో సుమిత్ర దెబ్బకొడుతుంది. నువ్వెప్పుడో చచ్చిపోయావ్ నాన్న అని సుమిత్ర ఏడిపించేస్తుంది. ఇక శివ నారాయణ వ్యాపారాన్ని దెబ్బతీసేలా పోటీగా మాలిని టిఫిన్ బండి పెట్టిస్తుంది. ఈ విషయం సూరజ్ కు తెలుస్తుంది.

Published on: Oct 9, 2026, 07:02:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శివ నారాయణ టిఫిన్ బండి దగ్గరకు వచ్చిన దక్షిణామూర్తి, మాలిని, సూరజ్ పై సుమిత్ర ఫైర్ అవుతుంది. అత్త మాటలు జాగ్రత్తగా రాని అని సూరజ్ అంటాడు. నీ మాటలు కూడా జాగ్రత్తగా రాని, నువ్వు మాట్లాడేది మా అమ్మతో అని దీప అనేసరికి అందరూ షాక్ అవుతారు.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

నిలదీసిన దక్షిణామూర్తి

అదే మా సుమిత్రమ్మతో అని దీప కవర్ చేస్తుంది. సుమిత్రమ్మనా నిజంగా ఆ మాట కడుపులో నుంచి వస్తుందా? గొంతులో నుంచి వస్తుందా? అని దక్షిణామూర్తి అడుగుతాడు. గుండెలో నుంచి వస్తుందని దీప చెప్తుంది. ఆ మాటే నిజమైతే తల్లి లాంటి మనిషి కష్టపడుతుంటే నిలబడి చూస్తున్నావేంటీ అని దక్షిణామూర్తి నిలదీస్తాడు.

సుమిత్ర ప్రశ్నలు

ఇది నాటకమే. ఈ శివ నారాయణ విత్తనం లాంటివాడు. నువ్వు నన్ను పాతేసినా మహా వృక్షమై నిలబడతాడని దక్షిణామూర్తికి శివ నారాయణ కౌంటర్ ఇస్తాడు. నన్ను అవమానించిన మనిషితో నాకు అవసరం లేదని దక్షిణామూర్తి అంటాడు. అప్పుడే.. నీ కూతురి జీవితంలోకి కష్టాలు నువ్వే తీసుకోవచ్చు. నా భర్తను చంపడానికి లారీని పంపించింది ఎవరు? మీరు కాదా? మా ఆస్తుల మీద అధికారాలు లాగేసుకుంది మీరు కాదా? అని సుమిత్ర ప్రశ్నిస్తుంది.

నాన్న అని పిలవడమే తప్పు

ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ కష్టాలే. ఇవన్నీ ఇచ్చింది కూడా మీరే. నాకు నా పుట్టిల్లు జీవితాంతం ఏడ్చిన తరగని కన్నీళ్లను సారెగా ఇచ్చింది నాన్న. నిన్ను నాన్న అని పిలవడమే నా తప్పు. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నా. నా కూతురు జ్యోత్స్న ఉద్యోగం చేస్తుంది. మామయ్య, అత్తయ్య టిఫిన్ బండి పెట్టారని సుమిత్ర కోప్పడుతుంది.

బతికే ఉన్నావా నాన్న

నువ్వు అక్రమంగా మోసంతో అన్నీ లాక్కున్నావ్. కానీ మేం నిజాయతీగా పని చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా పది మంది కడుపు నింపుతున్నామని దక్షిణామూర్తిపై సుమిత్ర ఫైర్ అవుతుంది. నువ్వు నా దగ్గరకు వచ్చేయమ్మా. జ్యోత్స్న అని చెప్పబోతూ దక్షిణామూర్తి ఆగిపోతాడు. కూతురి కోసం ప్రాణమైనా ఇస్తానంటాడు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా నాన్న అని సుమిత్ర అనేసరికి దక్షిణామూర్తి ఏడ్చేస్తాడు.

దిమ్మతిరిగే షాక్

నువ్వు చాలా సార్లు చచ్చిపోయావ్ నాన్న. నా పెళ్లప్పుడు తండ్రిగా, జ్యోత్స్న పెళ్లిని ఆపి తాతగా, మమ్మల్ని బయటకు గెంటేసి మనిషిగా చచ్చిపోవాయ్ అని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. కాకపోతే నీ వల్లే మేం ఎలా బతకాలో నేర్చుకున్నాం నాన్న. అందుకు నీకు థ్యాంక్స్ అని సుమిత్ర అంటుంది. అప్పుడే అయిపోయిందా సుమిత్ర అని మాలిని అంటుంది. ఇంకేం సాధించి బాధపెడతావని సుమిత్ర గట్టిగా అడుగుతుంది.

మా బతుకులను చూద్దామని ఫ్యామిలీతో సహా వచ్చారు కదా. వెళ్లి ఇక పార్టీ చేసుకోండని చెప్పిన సుమిత్ర తన పనిలో పడిపోతుంది. ఇలా సుమిత్ర తన మాటలతో దక్షిణామూర్తి ఫ్యామిలీకి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది.

జ్యోత్స్న గురించి వెతుకుతున్నావ్

సూరజ్ దగ్గరకు వెళ్లి కార్తీక్, దీప మాట్లాడతారు. ఈ గొడవలు ఎందుకు అని అడుగుతారు. కానీ మాలిని ఏమో వాళ్లతో సూరజ్ మాట్లాడకూడదని కారు ఎక్కమంటుంది. కానీ నువ్వు వచ్చింది జ్యోత్స్న గురించి అని మీ అమ్మకు తెలియదనుకుంటా. వచ్చినప్పటి నుంచి కళ్లతో జ్యోత్స్నను వెతుకుతూనే ఉన్నావ్ కదా అని దీప చెప్పడంతో సూరజ్ షాక్ అవుతాడు. ఏదో కవర్ చేసి సూరజ్ వెళ్లిపోతాడు.

వాళ్లను వదిలేయండి తాత

ఇంటికి వెళ్లిన తర్వాత కూతురు సుమిత్ర మాటలు తలుచుకొని దక్షిణామూర్తి కుమిలిపోతాడు. ఆ దౌర్బాగ్యుడు శివ నారాయణ నా కూతురిని టిఫిన్ సెంటర్లో పని మనిషిని చేశారు. అదేంటీ అని అడిగితే నా కూతురితోనే తిట్టించారు. నా కూతురు, నా మనవరాలు నా ఇంట్లో ఉండాలి మాలిని అని దక్షిణామూర్తి చెప్తాడు.

జరిగింది చాలు తాత. ఇంకా వాళ్లను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ల జీవితాలను వాళ్లకు వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ టిఫిన్ బండిని నాశనం చేస్తారా? జ్యోత్స్నను, సుమిత్ర అత్తను ఇంటికి ఎలా తీసుకొస్తారు? నువ్వు ఏం చేస్తావ్ అమ్మా? ఏం చేసినా ఆలోచించి చేయండని సూరజ్ చెప్పి లోపలికి వెళ్లిపోతాడు.

పోటీగా టిఫిన్ బండి

ఇటు శివ నారాయణ టిఫిన్ బండికి ఎదురుగా పోటీగా టిఫిన్ బండి పెడతారు. కేవలం రూ.20కే ప్లేటు అని అరుస్తారు. శివ నారాయణ బండి దగ్గర టిఫిన్ రూ.40 కావడంతో జనాలంతా అక్కడికే వెళ్లిపోతారు. దీంతో శివ నారాయణ ఆ టిఫిన్ బండి దగ్గరకు వెళ్లి మాట్లాడతాడు. ఇలా చేయడం అన్యాయం కదా అని అడుగుతాడు. కానీ ఆ టిఫిన్ బండి ఓనర్ మాత్రం వినడు.

ఇదంతా ఎవరి ప్లానో అర్థమైందని దీపతో కార్తీక్ చెప్తాడు. అప్పుడే సత్తిబాబు వచ్చి శివ నారాయణతో వెటకారంగా మాట్లాడతాడు. నెల రోజులు బండి నడుపుతానని అన్నారు కదా. ఇక రెండు రోజులు నడపడమూ కష్టమేనని సత్తిబాబు వెళ్లిపోతాడు. దీంతో శివ నారాయణ కూలబడిపోతాడు. ఇదంతా మాలిని చేసిందని కార్తీక్ చెప్తాడు.

కార్తీక్ ప్లాన్

రేపు ఉదయం మీరు చట్నీలు మాత్రమే చేయండి. మోసాన్ని మోసంతో గెలుద్దాం. అందరు నన్ను నమ్మి ఒక్క ఛాన్స్ ఇవ్వండని కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. చివరకు శివ నారాయణ ఒప్పుకొంటాడు.

మరోవైపు మన దెబ్బ వాళ్లకు గట్టిగా తగిలినట్లుందేనని ఫోన్లో వీడియో చూస్తూ సంబరపడిపోతుంది మాలిని. ఇది శివ నారాయణ పతనానికి నేను పెట్టిన పెట్టుబడి అని బాడీగార్డ్ తో మాలిని చెప్తుంది. ఈ మాటలను సూరజ్ వింటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More