Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2.. భయపడ్డ మాలిని.. జ్యోత్స్న గేమ్ స్టార్ట్.. ఈ కార్తీక్, దీప ఎందుకున్నారు?

Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 సీరియల్ స్టోరీ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మాలిని, సూరజ్ పై రివేంజ్ తీర్చుకోవడం కోసం జ్యోత్స్న మైండ్ గేమ్స్ ఆడుతుంది. జ్యోత్స్న దెబ్బకు మాలిని భయపడిపోయింది. అయితే కథలో కార్తీక్, దీప ఎందుకు ఉన్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

Published on: Oct 18, 2026, 08:11:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial: బుల్లితెరపై తిరుగులేని రేటింగ్ తో దూసుకుపోతోంది కార్తీక దీపం 2 సీరియల్. ఈ సీరియల్ లోని ఎమోషన్స్, ట్విస్ట్, రివేంజ్ డ్రామాకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీరియల్ రీచ్ ను మరింత పెంచడం కోసం మేకర్స్ జ్యోత్స్నతో బాగానే మైండ్ గేమ్స్ ఆడిస్తున్నారని చెప్పొచ్చు.

కార్తీక దీపం 2.. భయపడ్డ మాలిని.. జ్యోత్స్న గేమ్ స్టార్ట్.. ఈ కార్తీక్, దీప ఎందుకున్నారు? (jiohotstar)
కార్తీక దీపం 2.. భయపడ్డ మాలిని.. జ్యోత్స్న గేమ్ స్టార్ట్.. ఈ కార్తీక్, దీప ఎందుకున్నారు? (jiohotstar)

రివేంజ్ డ్రామా

కార్తీక దీపం 2 సీరియల్ ఫస్ట్ నుంచి రివేంజ్ డ్రామాగానే సాగుతుంది. కార్తీక్ ను పెళ్లి చేసుకుందని దీపపై రివేంజ్ తీర్చుకోవాలని జ్యోత్స్న నానా కుట్రలు చేసింది. తన సొంత అమ్మానాన్నలకు దూరం చేసి, వారసురాలిగా ఉంటున్న జ్యోత్స్న మోసాన్ని బయటపెట్టాలని కార్తీక్, దీప ట్రై చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు స్టోరీ ఏమో మాలిని, సూరజ్ పై రివేంజ్ డ్రామాగా మారిపోయింది.

ట్విస్టులే ట్విస్టులు

కార్తీక దీపం 2 సీరియల్ లోకి సూరజ్, మాలిని అడుగుపెట్టినప్పటి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తల్లి చెప్పిందని వెనుకా ముందు ఆలోచించకుండా ప్రేమ పేరుతో జ్యోత్స్నను సూరజ్ మోసం చేశాడు. ఇక మాలిని ఏమో కొడుకును పావుగా వాడి శివ నారాయణ ఆస్తులు మొత్తం లాక్కుంది. శివ నారాయణ ఫ్యామిలీని రోడ్డున పడేసింది.

జ్యోత్స్న ఊరుకుంటుందా?

తన కుటుంబాన్ని అవమానించిన మాలినిపై రివేంజ్ కోసం జ్యోత్స్న గేమ్ స్టార్ట్ చేసింది. డైరెక్ట్ గా సూరజ్ పీఏ పోస్టు పట్టేసింది. ఏకంగా దక్షిణామూర్తి రికమండేషన్ తో జ్యోత్స్న అదిరే ట్విస్ట్ ఇచ్చింది. అయితే సూరజ్ ఎక్కడ జ్యోత్స్న ప్రేమలో మునిగిపోతాడేమోనని భయపడి మాలిని మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జ్యోత్స్నను మాయం చేసింది.

భయపడ్డ మాలిని

జ్యోత్స్ననైతే మాలిని మాయం చేసింది కానీ తన కొడుకు సూరజ్ లో మార్పు చూసి కంగుతింది. జ్యోత్స్న కనిపించకపోవడంతో సూరజ్ టెన్షన్ పడ్డాడు. జ్యోత్స్న కోసం వెతికాడు. తన సొంత తల్లి మాలినిపై అనుమానపడ్డాడు. దీంతో మాలినిలో భయం స్టార్ట్ అయింది. వెంటనే జ్యోత్స్నను విడిచిపెట్టిందని చెప్పొచ్చు.

జ్యో ఛాలెంజ్

సూరజ్ కు తన మీద ఉన్న ప్రేమను పూర్తిగా అర్థం చేసుకున్న జ్యోత్స్న ఇక చెలరేగేందుకు రెడీ అయింది. మాలినికి ఛాలెంజ్ విసిరింది. సూరజ్ ను తన తల్లి నుంచి దూరం చేసి, నిజం తెలుసుకునేలా చేస్తానని చెప్పింది. జ్యోత్స్న చెప్పిందంటే కచ్చితంగా చేస్తుంది. మరి సూరజ్ కు నిజం తెలిసే దిశగా జ్యో ఎలాంటి ప్లాన్ అమలు చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

కార్తీక్, దీప ఎందుకు?

కార్తీక దీపం 2 సీరియల్ లో కార్తీక్, దీపనే మెయిన్ క్యారెక్టర్లు. కానీ ఇప్పుడు మాత్రం ఈ క్యారెక్టర్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. స్టోరీ మొత్తం సూరజ్, మాలిని, జ్యోత్స్న చుట్టూనే తిరుగుతుంది. మాలిని, సూరజ్ కు వార్నింగ్ ఇవ్వడం తప్పా కార్తీక్ చేసిందేమీ లేదు. ఇక దీప కూడా ఏం చేస్తుందో తెలియడం లేదు. మరి రాబోయే ఎపిసోడ్లలో అయినా కార్తీక్, దీప మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More